అమెరికా మిలటరీ క్యాంపుపై రాకెట్ల దాడి

అమెరికా మిలటరీ క్యాంపుపై రాకెట్ల దాడి

Rockets hit ఇరాక్‌లోని అమెరికా మిలటరీ క్యాంపుపై గుర్తుతెలియని వ్యక్తులు రాకెట్లతో దాడి చేశారు. ఇరాక్ లోని అన్బార్ ఫ్రావిన్స్ లోని అయిన్‌ అల్‌ అసద్‌ ఎయిర్‌బేస్‌లో గత కొన్నాళ్లుగా అమెరికాకు చెందిన మిలటరీ క్యాంపు కొనసాగుతోంది. ఈ క్యాంపులో ఇరాఖీ దళాలతో పాటు ఐసిస్ గ్రూప్ కి వ్యతిరేకంగా పోరాడే ఓఐఆర్సీ(Operation Inherent Resolve coalition)సభ్యులు కూడా ఉన్నారు. అయితే, బుధవారం ఉదయం ఒక్కసారిగా పది రాకెట్లు ఈ క్యాంపుపై బాంబుల వర్షం కురిపించాయి. ఏం జరుగుతుందో తెలుసుకునేలోపే రాకెట్లు బాంబులు జారవిడిచి పారిపోయాయి.

ఈ ఘటనలో ఎంత మంది చనిపోయారన్న సమాచారం ఇంతవరకు అందుబాటులో లేదు. బాంబు దాడులకు ఇంతవరకు ఏ సంస్థగానీ, వ్యక్తులు గానీ తమదే బాధ్యత అని ప్రకటించలేదు. అయితే,ఇది పూర్తిగా ఇజ్రాయెల్‌ పనే అని భావిస్తున్నట్లు ఓఐఆర్‌ అధికార ప్రతినిధి కల్నల్‌ వేన్ మారొట్టో తెలిపారు. త్వరలోనే ఘటనకు సంబంధించిన మరింత సమాచారాన్ని అందిస్తామని ఆయన వెల్లడించారు. ఈ విషయంపై దర్యాప్తు జరుపుతున్నట్లు ఇరాక్‌ ప్రభుత్వం ప్రకటించింది.

మరోవైపు, మరో రెండు రోజుల్లో పోప్ ఫ్రాన్సిస్ ఇరాక్ దేశాన్ని సందర్శించనున్నవేళ గత నెల రోజుల్లో ఇరాక్ లో చోటు చేసుకున్న రెండో రాకెట్ దాడి ఇది. గత నెలలో ఉత్తర ఇరాక్ లోని యూఎస్ నేతృత్వంలోని దళాలపై జరిగిన రాకెట్ దాడిలో ఓ కాంట్రాక్టర్​ మృతిచెందగా.. అమెరికాకు చెందిన అధికారితో పాటు సంకీర్ణ దళాల సభ్యులు గాయపడ్డారు.

ఇరాక్​లో రాకెట్​ దాడి వల్ల ఓ అమెరికా అధికారి గాయపడిన ఘటనకు ప్రతీకారంగా..ఇటీవల ఇరాన్​ మిలీషియా బృందాలే లక్ష్యంగా సిరియా-ఇరాక్​ సరిహద్దులో వైమానిక దాడులు జరిపింది అమెరికా. ఇందులో మిలిటెంట్లకు సంబంధించిన అనేక స్థావరాలు ధ్వంసమైనట్టు అమెరికా పేర్కొంది. బైడెన్​ అధ్యక్ష పదవి చేపట్టిన అనంతరం అమెరికా వైమానిక దాడి జరపడం ఇదే తొలిసారి.