Roger Federer Donate : రోజర్ ఫెదరర్ గొప్పమనసు.. యుక్రెయిన్ చిన్నారుల కోసం భారీ విరాళం

యుక్రెయిన్ చిన్నారులకు అండగా నిలిచారు. బాధిత చిన్నారుల విద్య కోసం రోజర్‌ ఫెదరర్‌ భారీ విరాళం ప్రకటించారు.

Roger Federer Donate : రోజర్ ఫెదరర్ గొప్పమనసు.. యుక్రెయిన్ చిన్నారుల కోసం భారీ విరాళం

Roger Federer Donate

Roger Federer Donate : రష్యా చేస్తున్న యుద్ధం కారణంగా యుక్రెయిన్ లో నెలకొన్న దారుణమైన పరిస్థితులు చూసి ప్రముఖ టెన్నిస్ స్టార్ రోజర్ ఫెదరర్ మనసు చలించిపోయింది. ఆయన తన గొప్పమనసు చాటుకున్నారు. యుక్రెయిన్ చిన్నారులకు అండగా నిలిచారు. యుక్రెయిన్ పై రష్యా యుద్ధం నేపథ్యంలో అక్కడి బాధిత చిన్నారుల సహాయార్ధం రోజర్‌ ఫెదరర్‌ భారీ విరాళం ప్రకటించారు. యుక్రెయిన్‌ చిన్నారుల విద్యావసతుల కల్పన కోసం ఏకంగా 5 లక్షల స్విస్‌ డాలర్ల ఆర్ధిక సాయం ప్రకటించారు.

David Cameron: యుక్రెయిన్ల కోసం స్వయంగా ట్రక్ నడుపుకుంటూ వెళ్లిన యూకే మాజీ ప్రధాని

సైనిక చర్య పేరుతో రష్యా సేనలు చేస్తున్న భీకర దాడుల కారణంగా యుక్రెయిన్‌లోని అతి పురాతన, చారిత్రక భవనాలతో పాటు స్కూళ్లు కూడా పెద్ద సంఖ్యలో ధ్వంసమయ్యాయి. దీంతో యుక్రెయిన్‌లోని చాలామంది చిన్నారులు చదువుకోవడానికి సరైన వసతులు లేక ఇబ్బందులు పడుతున్నారు. ఇప్పటికే చాలామంది తమ తల్లిదండ్రులతో కలిసి విదేశాలకు తరలి వెళ్లగా, ఇంకా వేల సంఖ్యలో ప్రజలు ఎటూ వెళ్లలేక నిరాశ్రయులై బిక్కుబిక్కుమని బతుకుతున్నారు. ఈ పరిస్థితి చూసి చలించిపోయిన ఫెదరన్.. తనవంతు సాయంగా 5 లక్షల స్విస్‌ డాలర్ల విరాళాన్ని ప్రకటించారు.

Russia-Ukraine War : యుద్ధం ఆపాలంటూ పుతిన్‌కు హాలీవుడ్ టెర్మినేటర్ స్టార్ విజ్ఞప్తి!

‘‘యుక్రెయిన్‌లో పరిస్థితులకు సంబంధించిన ఫోటోలు భయాందోళనకు గురి చేశాయి. యుద్ధం కారణంగా ఎంతోమంది అమాయక ప్రజలు సర్వం కోల్పోయారు. యుక్రెయిన్‌లో శాంతి కోసం యావత్‌ మానవ జాతి​ ఏకతాటిపై నిలబడాలి” అంటూ ట్విటర్‌ వేదికగా పిలుపునిచ్చారు ఫెదరర్. కాగా, రష్యా భీకర దాడుల కారణంగా యుక్రెయిన్‌లో స్కూళ్లన్నీ ధ్వంసం కావడంతో దాదాపు 6 మిలియన్ల మంది చిన్నారులు దిక్కుతోచని స్థితిలో ఉన్నారు.

యుక్రెయిన్‌పై రష్యా దాడులు కొనసాగుతూనే ఉన్నాయి. తాజాగా దక్షిణ యుక్రెయిన్‌లోని జపోరిజియా నగర శివార్లలో జరిగిన దాడుల్లో తొమ్మిది మంది మృతి చెందినట్లు స్థానిక డిప్యూటీ మేయర్ అనటోలీ కుర్తీవ్‌ తెలిపారు. మరో 17 మంది గాయపడ్డారని వెల్లడించారు. మరోవైపు ఈ నగరంలో 38 గంటల కర్ఫ్యూను ప్రకటించారు. ఇటీవల ఈ నగరంలోని ఓ అణు విద్యుత్‌ కేంద్రంపై దాడి.. ప్రపంచవ్యాప్తంగా ఆందోళనకు దారితీసిన విషయం తెలిసిందే.

ఇప్పటివరకు 14వేల 400 మంది రష్యా సైనికులు హతమైనట్లు యుక్రెయిన్ సైన్యం శనివారం ప్రకటించింది. దీంతోపాటు 466 ట్యాంకులు, 1470 సాయుధ వాహనాలను ధ్వంసం చేసినట్లు తెలిపింది. 95 విమానాలు, 115 హెలికాప్టర్లు, 17 యూఏవీలను నేలకూల్చినట్లు వెల్లడించింది. వీటికి అదనంగా మూడు నౌకలు, 44 విమాన, క్షిపణి విధ్వంసక వ్యవస్థలను నాశనం చేసినట్లు చెప్పింది.

ఉక్రెయిన్‌పై దాడుల్లో భాగంగా రష్యా తన అమ్ములపొదిలోంచి తాజాగా మరో అస్త్రాన్ని బయటకు తీసింది. శుక్రవారం తమ సరికొత్త కింజాల్ హైపర్‌సోనిక్ క్షిపణులను ప్రయోగించి.. పశ్చిమ ఉక్రెయిన్‌లోని ఆయుధ నిల్వల కేంద్రాన్ని ధ్వంసం చేసినట్లు రష్యా రక్షణ శాఖ తెలిపింది. ‘హైపర్‌సోనిక్ ఏరోబాలిస్టిక్ క్షిపణులతో కూడిన కింజాల్ ఏవియేషన్ క్షిపణి వ్యవస్థ.. ఇవానో- ఫ్రాంకివ్స్క్ ప్రాంతంలోని డెలియాటిన్‌లో ఉక్రెయిన్‌ క్షిపణులు, విమానయాన మందుగుండు సామగ్రిని కలిగి ఉన్న పెద్ద భూగర్భ గిడ్డంగిని ధ్వంసం చేసింది’ అని తెలిపింది.