Romania : అతి పెద్ద టీ-షర్టు .. డివైడ్ చేసి 10,000 మంది పేదలకు పంచుతారట

రికార్డుకి కాదేది అనర్హం .. ప్రపంచంలోనే అతి పెద్ద టీ-షర్టును రూపొందించింది రొమేనియా. ఆ షర్టుని కుట్టడానికి నెల రోజుల సమయం పడితే.. దానిని స్టేడియంలో పరచడానికి 120 మంది పనిచేశారట.

Romania : అతి పెద్ద టీ-షర్టు .. డివైడ్ చేసి 10,000 మంది పేదలకు పంచుతారట

Romania

Romania made the largest T-shirt : రొమేనియా ప్రపంచంలోనే అతి పెద్ద టీ-షర్టును తయారు చేసింది. ఎంత పెద్దదంటే రగ్బీ పిచ్ కంటే పెద్దది. ప్రపంచ రికార్డు నమోదైన తర్వాత దానిని డివైడ్ చేసి 10,000 మందికి పేదలకు పంచుతారట.

Bible : రూ.313 కోట్లకు అమ్ముడుపోయిన బైబిల్.. ఎందుకంత రేటు అంటే

రొమేనియా అతి పెద్ద టీ-షర్టుతో ప్రపంచ రికార్డు నమోదు చేసుకోబోతోంది. బుకారెస్ట్‌లోని ఆర్కుల్ డి ట్రయంఫ్ నేషనల్ రగ్బీ స్టేడియంలో ఈ టీ-షర్టును ఆవిష్కరించారు. టీ-షర్టు 108.96 m (357.48 ft) పొడవు, 73.48 m (241.08 ft) వెడల్పు ఉంది. 120 మంది కంటే ఎక్కువమంది వాలంటీర్లు ఈ చొక్కాను వేయడానికి వచ్చారట. ఆ బట్టను పూర్తిగా విప్పడానికి ఒక రోజు మొత్తం పట్టిందట. ఈ టీ-షర్టు రికార్డు నమోదైన అనంతరం డివైడ్ చేసి 10,000 మంది నిరుపేదలకు పంపిణీ చేస్తారట.

New World Record With 200-Kg Cake : 200 కేజీల కేక్ తయారు చేసి ప్రపంచ రికార్డ్ సాధించిన మహిళ.. ఈ కేక్ స్పెషాలిటీ ఏంటంటే?

పారేసిన ప్లాస్టిక్ బాటిళ్లను రీసైక్లింగ్ చేసి ఈ టీ-షర్టును తయారు చేశారు. రీసైక్లింగ్ పట్ల అందరికీ అవగాహన కల్పించేందుకు ఈ కార్యక్రమం చేపట్టారట. టీ షర్టును తయారు చేయడానికి 5,00,000 రీ సైకిల్ ప్లాస్టిక్ సీసాలు సేకరించారట. ఇక ఫ్యాబ్రిక్ లో కుట్టడానికి నెల సమయం పట్టిందట. ఈ టీ-షర్టు రొమేనియన్  జాతీయ జెండా మరియు రొమేనియన్ రగ్బీ జట్టు అధికార జెర్సీని కలిగి ఉంది ఈ టీ-షర్టు. ఇక రికార్డు రిజల్ట్ కోసం నిర్వాహకులు ఎదురుచూస్తున్నారు.