ఖరీదైన విడాకులు : కాంతతోనే కనకం పోయింది

  • Published By: venkaiahnaidu ,Published On : January 11, 2019 / 05:43 AM IST
ఖరీదైన విడాకులు : కాంతతోనే కనకం పోయింది

అమెజాన్ ఫౌండర్ జెఫ్ బెజోస్ ప్రపంచంలో నెం.1 ధనవంతుడి స్థానం నుంచి ధనవంతుల్లో ఒకడి స్థానంకి పడిపోనున్నారు. అవును మీరు విన్నది నిజమే0. రాత్రికి రాత్రికి స్టాక్ మార్కెట్లలో కోట్లు నష్టపోవడం వల్ల ఆయన నెం.1 స్థానం నుంచి పడిపోలేదు. కేవలం ఆయన తన భార్య మెకన్సీ విడాకులు తీసుకోబోతున్నామని చేసిన ప్రకటనే ఇందుకు కారణం. కాంతతో కనకం వచ్చింది కాంతతో కనకం పోయింది అనే సామెత బెజోస్ కి కెరెక్ట్ గా సూట్ అవుతుంది.  ప్రపంచంలోనే అత్యంత ఖరీదైన విడాకులుగా బెజోస్ దంపతుల డైవర్స్ రికార్డు సృష్టించాయి.

 వాషింగ్టన్ రాఫ్ట్ర చట్టాల ప్రకారం.. దాంపత్య జీవితంలో సమకూరిన ఆస్తులు విడాకుల తర్వాత ఇద్దరికీ చెరిసగం చెందుతాయి. బెజోస్ సంపద ప్రస్తుతం 137 బిలియన్ డాలర్లు(9.67 లక్షల కోట్లు). ఇందులో సగం..60-70 బిలియన్ డాలర్లు(4.2 లక్షల కోట్లు) మెకన్ జీ కి వెళ్లనుంది. ఈ సంపదతో ప్రపంచంలోనే నెం.1 మహిళా ధనవంతురాలిగా మెకన్ జీ నిలవనుంది.

1993లో జెఫ్ బెజోస్ కి మెకన్ జీకి వివాహం అయింది. 25 ఏళ్లపాటు అన్యోన్యంగా సాగిన వీరి దాంపత్య జీవితానికి బ్రేక్ పడింది. విడాకులు తీసుకోబోతున్నట్లు ఇద్దరు ప్రకటించిన విషయం తెలిసిందే. అసలు అమెజాన్ స్థాపనలో మెకన్ జీ ది చాలా ప్రముఖ పాత్ర. మెకన్ జీతో వివాహం తర్వాతే బెజోస్ అమెజాన్ స్థాపించి ప్రపంచంలో నెం.1 స్థానానికి రాగలిగాడు. ప్రతి మగాడి విజయం వెనుక ఓ ఆడది ఉంటుందనే పదానికి బెజోస్ దంపతులు సరిపోతారు. విడాకుల తర్వాత నెం.1 స్థానాన్ని బెజోస్ కోల్పోనుండటంతో  మైక్రోసాఫ్ట్ వ్యవస్థాపకుడు బిల్ గేట్స్ నెం.1స్థానానికి రానున్నాడు.