Ever Given Ship: రూ.7500 కోట్లు కట్టండి!

మార్చి 23 తేదీన ‘ఎవర్‌ గివెన్‌’ సూయజ్ కాల్వలో భారీ నౌక చిక్కుకున్న విషయం తెలిసిందే. నౌక కాల్వలో చిక్కుకోవడం వలన వారం రోజులు ఆ కాల్వ నుంచి రవాణా నిలిచిపోయింది.

Ever Given Ship: రూ.7500 కోట్లు కట్టండి!

Ever Given

Ever Given Ship: మార్చి 23 తేదీన ‘ఎవర్‌ గివెన్‌’ సూయజ్ కాల్వలో భారీ నౌక చిక్కుకున్న విషయం తెలిసిందే. నౌక కాల్వలో చిక్కుకోవడం వలన వారం రోజులు ఆ కాల్వ నుంచి రవాణా నిలిచిపోయింది. వందల కొద్దీ రవాణా షిప్పులు ఆ ప్రాంతం గుండా వెళ్లేందుకు సముద్రంలో వేచి ఉండాల్సి వచ్చింది.

ఈ నౌక సూయజ్ కాల్వలో చిక్కువడం వలన రోజుకు రూ.70 వేల కోట్ల నష్టం వాటిల్లింది. ఇక దీనిని పూడ్చుకునేందుకు ఈజిప్ట్ ప్రభుత్వం సిద్ధమైంది. కాల్వలో చిక్కుకున్న నౌక యాజమాన్యానికి భారీ జరిమానా విధించింది. $100 కోట్లు చెల్లించాలని ఎవర్ గివెన్ నిర్వహణ సంస్థను ఆదేశించింది. అది భారత కరెన్సీలో రూ. 7,500 కోట్లు వాణిజ్యపరంగా తీవ్ర నష్టం కలగడం కారణంగానే ఈ నిర్ణయం తీసుకున్నట్లు ఈజిప్ట్ తెలిపింది.

మొత్తం $9 బిలియన్ డాలర్లు నష్టం వాటిల్లినట్లు పేర్కొంది. నౌక బయటకు తీసిన వారానికి కానీ రవాణా పూర్తి స్థాయిలో జరగలేదని ఈజిప్ట్ పేర్కొంది.