Russia Attack: ఒక్క దెబ్బకు 200 మంది ఉగ్రవాదులు హతం

ఉగ్రవాద శిక్షణ క్యాంపును లక్ష్యంగా చేసుకొని రష్యా వైమానిక దళం దాడి చేసింది. ఈ దాడిలో సుమారు 200 మంది ఉగ్రవాదులు మృతి చెందినట్లుగా రష్యా సైన్యం ప్రకటించింది. ప్రపంచంలోని పలు దేశాల్లో దాడులు చేసేందుకు టెర్రరిస్టులను

Russia Attack: ఒక్క దెబ్బకు 200 మంది ఉగ్రవాదులు హతం

Russia Attack

Russia Attack: ఉగ్రవాద శిక్షణ క్యాంపును లక్ష్యంగా చేసుకొని రష్యా వైమానిక దళం దాడి చేసింది. ఈ దాడిలో సుమారు 200 మంది ఉగ్రవాదులు మృతి చెందినట్లుగా రష్యా సైన్యం ప్రకటించింది. ప్రపంచంలోని పలు దేశాల్లో దాడులు చేసేందుకు టెర్రరిస్టులను సిద్ధం చేస్తున్న సమయంలో రష్యా ఈ దాడి చేసినట్లు రక్షణ వర్గాలు తెలిపాయి.

ఇక రష్యా సైన్యం చేసిన దాడిలో 24 వాహనాలు ధ్వంసం కాగా, అర టన్ను పేలుడు పదార్దాలు ధ్వంసం అయినట్లు సైన్యం పేర్కొంది. సిరియా నదిలో ఉగ్రవాద క్యాంపు నడుపుతున్న దళాలపై రష్యా వైమానిక దళం దాడి చేసినట్లు అడ్మిరల్ అలక్సందర్ కార్పొవ్ తెలిపారు.

పల్మైరా ప్రాంతంలో ఉన్న క్యాంపులో ఉగ్రవాదులు అక్రమ రీతిలో పేలుడు పదార్ధాలు తయారు చేస్తున్నట్లు గుర్తించారు. ఇక మరోవైపు ఆఫ్రికా దేశాల్లో ఉగ్రవాదులు రెచ్చిపోతున్నారు. నైజీరియా దాని చుట్టుపక్కల ఉన్న దేశాల్లో రైతులు, రైతు కూలీలే లక్ష్యంగా చేసుకొని ఉగ్రవాదులు కాల్పులకు తెగబడుతున్నారు. ఫిబ్రవరి నుంచి ఏప్రిల్ వరకు ఉగ్రవాదులు జరిపిన దాడుల్లో 500 పైగా రైతులు, రైతు కూలీలు మృతి చెందారు.