Russia burns Gas : గ్యాస్ దగ్ధం చేస్తున్న రష్యా .. ఆందోళన వ్యక్తంచేస్తున్న పాశ్చాత్య దేశాలు

భారత్ సహా అనేక దేశాల్లో గ్యాస్ ధరలు భారీగా పెరిగిపోయాయి. పెరిగిన ధరలతో అన్ని దేశాల్లో ప్రజలు అల్లాడుతున్నారు. అయితే యుక్రెయిన్‌పై యుద్ధం చేస్తూ ఇంధన ధరలు పెరగడానికి కారణమైన రష్యా మాత్రం పెద్ద ఎత్తున గ్యాస్‌ను తగలబెడుతోంది. దీనిపై ప్రపంచ దేశాల్లో ఆందోళన వ్యక్తమవుతోంది.

Russia burns Gas : గ్యాస్ దగ్ధం చేస్తున్న రష్యా .. ఆందోళన వ్యక్తంచేస్తున్న పాశ్చాత్య దేశాలు

Russia is burning $10 million a day of natural gas

Russia burns Gas : భారత్ సహా అనేక దేశాల్లో గ్యాస్ ధరలు భారీగా పెరిగిపోయాయి. పెరిగిన ధరలతో అన్ని దేశాల్లో ప్రజలు అల్లాడుతున్నారు. అయితే యుక్రెయిన్‌పై యుద్ధం చేస్తూ ఇంధన ధరలు పెరగడానికి కారణమైన రష్యా మాత్రం పెద్ద ఎత్తున గ్యాస్‌ను తగలబెడుతోంది. దీనిపై ప్రపంచ దేశాల్లో ఆందోళన వ్యక్తమవుతోంది.

రష్యా రోజుకు దగ్ధం చేస్తున్న గ్యాస్ విలువ 79 కోట్లు. ఫిన్‌లాండ్ సరిహద్దు దగ్గరున్న గ్యాస్ ప్లాంట్‌లో ఇది జరుగుతోంది. యుక్రెయిన్‌తో యుద్ధం, పాశ్చాత్య దేశాల ఆంక్షలు రష్యా గ్యాస్, ముడిచమురు ఎగుమతులపై ప్రభావం చూపాయి. ఈ కారణాలే రష్యా గ్యాస్ దగ్ధం చేయడానికి దారితీశాయి. రష్యా తగలబెడుతున్న గ్యాస్ వాస్తవానికి జర్మనీకి ఎగుమతి చేయాల్సి ఉందని, ఆంక్షల వల్ల జర్మనీకి సరఫరా చేయకుండా దగ్ధం చేస్తోందని ప్రచారం జరుగుతోంది. అయితే ఈ గ్యాస్ దగ్ధం వల్ల భారీ స్థాయిలో కార్బన్‌డై ఆక్సైడ్ వెలువడుతోందని, ఈ బూడిద వల్ల ప్రతికూల ప్రభావం ఉంటుందని పాశ్చాత్య దేశాలు ఆందోళన వ్యక్తంచేస్తున్నాయి

గ్యాస్ దగ్ధం విషయాన్ని రష్యా అధికారికంగా ప్రకటించలేదు. దూరంగా మంటలు మండుతాన్ని గమనించిన ఫిన్లాండ్ ప్రజల ద్వారా ప్రపంచానికి ఈ విషయం తెలిసింది. సముద్రగర్భంలో పైప్‌లైన్ ద్వారా జర్మనీకి గ్యాస్ సరఫరా చేయడం నిలిపివేసింది రష్యా. ఈ పైప్‌లైన్ పోర్టోవాయా పట్టణం దగ్గర మొదలవుతుంది. ఇక్కడో కంప్రెసర్ స్టేషన్ ఉంది. ఆ కంప్రెసర్ స్టేషన్ నుంచి వేడి పెరుగుతూవస్తోంది. ఈ వేడి పెరగడానికి కారణం భారీ స్థాయిలో గ్యాస్ దగ్ధమవుతుండడమే అన్న నిర్ణయానికి వచ్చారు పాశ్చాత్య దేశాల శాస్త్రవేత్తలు.

గ్యాస్ శుద్ధికి అవసరమైన హై క్వాలిటీ వాల్వులు తయారుచేయలేపోవడం, ఎల్‌ఎన్‌జీ తయారుచేసే అవకాశం లేకపోవడం వంటి కారణాలు కూడా గ్యాస్ దగ్ధానికి కారణంగా భావిస్తున్నారు. మంటలకు కచ్చితమైన కారణం తెలియనప్పటికీ..రష్యాకున్న ఇంధన సామర్థ్యాన్ని ఈ గ్యాస్ దగ్ధం రుజువుచేస్తోందని అంతర్జాతీయ నిపుణులు అంటున్నారు. ఇతర దేశాలకు సరఫరా చేసే వీలు లేనప్పుడు రష్యా దాన్ని మండించడంలో తప్పు లేదన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. గ్యాస్‌ను దగ్ధం చేయకుండా వాతావరణంలోకి వదిలిస్తే…అందులో ఉండే మిథేన్ వాయువుతో ప్రమాదకర పరిణామాలు తలెత్తుతాయని హెచ్చరిస్తున్నారు. రష్యా చర్యపై విమర్శలు గుప్పిస్తున్నవారు మాత్రం గ్యాస్ మంట వల్ల రోజుకు 9వేల టన్నులకు సమానమైన కార్బన్ డై ఆక్సైడ్ విడుదల చేస్తోందని మండిపడుతున్నారు.