Sputnik V vaccine: ఇండియాకు లక్షా 50వేల డోసుల మరో బ్యాచ్ రష్యా వ్యాక్సిన్లు

రష్యన్ మెడికల్ సపోర్ట్ ను ఢిల్లీలోని కలావతి హాస్పిటల్ లో చూడొచ్చు. 75వెంటిలేటర్లు, 20 అతిపెద్ద ఆక్సిజన్ కాన్సట్రేటర్లు, 150 మానిటర్లను సెంట్రల్ ఢిల్లీ హాస్పిటల్ లో..

Sputnik V vaccine: ఇండియాకు లక్షా 50వేల డోసుల మరో బ్యాచ్ రష్యా వ్యాక్సిన్లు

Sputnik Vaccine

Sputnik V vaccine: ఇండియా స్ట్రాటజిక్ పార్టనర్ రష్యా మరోసారి స్పుత్నిక్ వీ వ్యాక్సిన్లను పంపనుంది. మరో రెండ్రోజుల్లో లక్షాల 50వేల డోసులు ఇండియాకు చేరుకోనున్నాయి. హైదరాబాద్ కు మరో 3మిలియన్ డోసులు రాబోతున్నాయన్న మాట. వీటిని మే చివరికల్లా డా. ల్యాబొరేటరీస్ హైదరాబాద్ కు చేరుస్తున్నారు. వీటితో పాటు వచ్చే నెల ఐదు మిలియన్లు, జులైలో 10మిలియన్ వ్యాక్సిన్లు రానున్నాయి.

న్యూ ఢిల్లీ, మాస్కో డిప్లొమేట్స్ ప్రకారం.. కనీసం నాలుగు మీడియా ఆక్సిజన్ జనరేటింగ్ ట్రక్స్ ను రష్యా పంపించనుంది. అవి దాదాపు 200 హాస్పిటల్ బెడ్స్ కు సరిపోతాయి. ఈ ట్రక్కులు గంటలకు 70కిలోల ఆక్సిజన్ ఉత్పత్తి చేస్తుండటంతో రోజుకు 50వేల లీటర్లు ప్రొడ్యూస్ చేయగలదు. ఈ ట్రక్కులు వారం చివరి నాటికి రష్యన్ IL-76 సాయంతో ఇండియాకు చేరుకుంటాయని అధికారులు చెప్తున్నారు.

స్పుత్నిక్ వ్యాక్సిన్లు తొలి డోసు కింద లక్షా 50వేలు మే1 నాటికి ఇండియాకు వచ్చాయి. ఇండియాలో మూడో ఫేజ్ వ్యాక్సినేషన్ లో భాగంగా 18 నుంచి 44ఏళ్ల మధ్య వయస్సు వారికి వ్యాక్సిన్ ఇవ్వనున్నారు. స్పుత్నిక్ వీ అనేది హ్యూమన్ అడెనొవైరల్ వెక్టార్స్ లో ఒకటి కాగా, ఫైజర్, మోడర్నాలు మిగతా రెండు.

కరోనావైరస్ జబ్బుపై ఈ వ్యాక్సిన్లు 90శాతం సమర్థవంతంగా పనిచేస్తున్నాయి. ఇండియాలో వీటి వాడకానికి ఏప్రిల్ 12నే అప్రూవల్ ఇచ్చింది రెగ్యూలేటరీ బోర్డు.

రష్యన్ మెడికల్ సపోర్ట్ ను ఢిల్లీలోని కలావతి హాస్పిటల్ లో చూడొచ్చు. 75వెంటిలేటర్లు, 20 అతిపెద్ద ఆక్సిజన్ కాన్సట్రేటర్లు, 150 మానిటర్లను సెంట్రల్ ఢిల్లీ హాస్పిటల్ లో ఏర్పాటు చేశారు. దాంతో పాటుగా 60 అతిపెద్ద ఆక్సిజన్ కాన్సట్రేటర్లు ఆల్రెడీ వచ్చేందుకు రెడీగా ఉన్నాయి. కరోనా వైరస్ తొలినాళ్లలో రష్యా 2లక్షల ఫఫివీర్ డ్రగ్ సప్లై చేసింది. నార్త్ ఇండియాలోని అన్ని సెంట్రల్ ఎయిమ్స్ ఫెసిలిటీలకు వాటిని సప్లై చేశారు.