Russia: జీ7 దేశాలకు రష్యా షాక్.. ఫిబ్రవరి నుంచి చమురు సరఫరా నిలిపివేత

జీ7 దేశాలైన కెనడా, ఫ్రాన్స్, జర్మనీ, ఇటలీ, జపాన్, యూకే, యురోపియన్ యూనియన్ ఇటీవల రష్యా చమురు దిగుమతుల విషయంలో ప్రైస్ క్యాప్ నిర్ణయించాయి. అంటే బ్యారెల్ చమురుకు 60 డాలర్ల గరిష్ట ధరను నిర్ణయించాయి.

Russia: చమురుకు ప్రైస్ క్యాప్ (గరిష్ట ధర) నిర్ణయించిన జీ7 దేశాలకు రష్యా షాక్ ఇవ్వనుంది. ఆ దేశాలకు త్వరలో చమురు సరఫరా నిలిపి వేయాలని నిర్ణయించింది. వచ్చే ఫిబ్రవరి నుంచి చమురు సరఫరా నిలిపివేయాలని నిర్ణయించినట్లు ఒక నివేదిక తెలియజేస్తోంది.

Chiranjeevi : రవితేజని మర్చిపోయాను.. చాలా ఫీల్ అయ్యాను.. రవితేజ లేకపోతే వాల్తేరు వీరయ్య లేదు..

జీ7 దేశాలైన కెనడా, ఫ్రాన్స్, జర్మనీ, ఇటలీ, జపాన్, యూకే, యురోపియన్ యూనియన్ ఇటీవల రష్యా చమురు దిగుమతుల విషయంలో ప్రైస్ క్యాప్ నిర్ణయించాయి. అంటే బ్యారెల్ చమురుకు 60 డాలర్ల గరిష్ట ధరను నిర్ణయించాయి. అంతకుమించి ఆ దేశాలు చమురుకు ధర చెల్లించవు. యుక్రెయిన్‌పై రష్యా దాడికి నిరసనగా, ఆ దేశాన్ని ఆర్థికంగా దెబ్బతీయాలనే ఉద్దేశంతో జీ7 దేశాలు ఈ నిర్ణయం తీసుకున్నాయి. అయితే, ప్రైస్ క్యాప్ నిర్ణయాన్ని రష్యా తిరస్కరించింది. తాము ఉత్పత్తి చేసే చమురుకు ఇతర దేశాలు ఎలా ధరను నిర్ణయిస్తాయని రష్యా ఆగ్రహం వ్యక్తం చేస్తోంది. ఈ నేపథ్యంలో ప్రైస్ క్యాప్ అమలు చేయాలని చూస్తే, ఆయా దేశాలకు వచ్చే ఫిబ్రవరి నుంచి చమురు సరఫరా నిలిపివేయాలని రష్యా భావిస్తోంది. ఈ నిర్ణయం కచ్చితంగా జీ7 దేశాలకు షాకిచ్చేదే.

Chiranjeevi : అలా చేయలేనప్పుడు సినిమాల నుంచి రిటైర్ అయిపోవాలి..

మరోవైపు రష్యా నుంచి భారీ స్థాయిలో చమురు దిగుమతి చేసుకుంటున్న ఇండియాపై కూడా ఒత్తిడి తెచ్చి, చమురు కొనకుండా చేసేందుకు అమెరికాసహా పాశ్చాత్య దేశాలు ప్రయత్నిస్తున్నాయి. అయితే, ఇండియా దీనికి అంగీకరించడం లేదు. ఇండియాకు మేలు కలిగే అవకాశం ఉన్న దృష్ట్యా, రష్యా నుంచి చమురు దిగుమతుల్ని ఆపబోమని స్పష్టం చేసింది. అలాగే రష్యా-ఇండియా మధ్య వ్యాపార, వాణిజ్య కార్యకలాపాలు ఇప్పుడు భారత రూపాయిల్లోనే సాగుతున్నాయి. ఇదే విషయంపై ఇతర దేశాలతో కూడా ఇండియా చర్చలు జరుపుతోంది.

ఈ నిర్ణయం ద్వారా ఇన్నాళ్లూ సాగిన అమెరికా ఆధిపత్యానికి తెరపడుతుంది. ఎందుకంటే ఇతర దేశాలతో వ్యాపార, వాణిజ్య కార్యకలాపాలు అన్నీ అమెరికన్ డాలర్లలోనే సాగుతున్నాయి. అయితే, ప్రస్తుతం ఇండియా చేపడుతున్న చర్యల వల్ల అమెరికాకు గట్టి దెబ్బ తగిలే అవకాశం ఉంది.

 

 

ట్రెండింగ్ వార్తలు