Good News : ఆగస్టు 12న కరోనా వ్యాక్సిన్

  • Published By: madhu ,Published On : August 8, 2020 / 08:36 AM IST
Good News : ఆగస్టు 12న కరోనా వ్యాక్సిన్

కరోనాకు ఎప్పుడు వ్యాక్సిన్ వస్తుంది ? అన ప్రపంచ వ్యాప్తంగా అందరూ వేచి చూస్తున్నారు. అన్ని దేశాలు వ్యాక్సిన్ కనిపెట్టేందుకు బిజిబిజిగా ఉన్నాయి. అందులో రష్యా దేశం ముందువరుసలో నిలుస్తోంది. ఇప్పటికే వ్యాక్సిన్ కు సంబంధించిన ట్రయల్స్ చేస్తున్నారు. ఆగస్టు నెలలో తప్పకుండా వ్యాక్సిన్ తీసుకొస్తామని రష్యా స్పష్టం చేస్తోంది.



అనుకున్నట్లుగానే..ఆగస్టు 12వ తేదీన తొలి వ్యాక్సిన్ విడుదల చేస్తామని రష్యా ఆరోగ్య మంత్రి ఒలేగా గ్రిడ్నెవ్ ప్రకటించారు. గమలేయ రీసెర్చ్ ఇనిస్టిట్యూట్, రష్యా రక్షణ మంత్రిత్వ శాఖ సంయుక్తంగా…ఈ వ్యాక్సిన్ ను తయారు చేశారని తెలిపారు. ప్రస్తుతం చివరి దశ ట్రయల్స్ జరుగుతున్నాయని, వైరస్ సోకిన వారిలో రోగ నిరోధక శక్తి పెరిగితే..వ్యాక్సిన్ సురక్షితమని వెల్లడించారు.

తొలి దశలో వ్యాక్సిన్ ను వైద్యాధికారులు, సీనియర్ సిటిజన్లకు వేస్తామన్నారు. జూన్ 18వ తేదీన ఈ వ్యాక్సిన్ క్లినికల్ ట్రయల్స్ ప్రారంభమయ్యాయని, 38 మంది వాలంటీర్లపై వ్యాక్సిన్ ను ప్రయోగించామని, వీరిలో రోగ నిరోధక శక్తి పెరగడం గుర్తించామన్నారు. నిబంధనలకు లోబడి వ్యాక్సిన్ ను తయారు చేయడం జరిగిందన్నారు. అక్టోబర్ లో ప్రజలందరికీ ఉచితంగా వ్యాక్సినేషన్ ఇస్తుందనే ప్రచారం జరుగుతోంది.



రష్యా ప్రకటించనట్లుగా..వ్యాక్సిన్ అందుబాటులోకి తెచ్చి..వైరస్ కు అడ్డుకట్ట వేస్తే..ప్రపంచంలో కరోనా వ్యాక్సిన్ తయారు చేసిన మొట్టమొదటి దేశంగా రష్యా రికార్డు నెలకొల్పుతుంది.