Russia – Ukaraine: ఉక్రెయిన్‌లోని భారత విద్యార్థుల కోసం 3విమానాలు

రష్యా - ఉక్రెయిన్ దేశాల మధ్య మొదలైన ఆందోళనలు, వివాదాల ఒత్తిడికి తెరదించింది ఎయిరిండియా. ఉక్రెయిన్ లో చదువుకుంటున్న విద్యార్థులను స్వదేశానికి చేర్చేందుకు గానూ మూడు విమానాలను...

Russia – Ukaraine: ఉక్రెయిన్‌లోని భారత విద్యార్థుల కోసం 3విమానాలు

Russia Ukraine

Russia – Ukaraine: రష్యా – ఉక్రెయిన్ దేశాల మధ్య మొదలైన ఆందోళనలు, వివాదాల ఒత్తిడికి తెరదించింది ఎయిరిండియా. ఉక్రెయిన్ లో చదువుకుంటున్న విద్యార్థులను స్వదేశానికి చేర్చేందుకు గానూ మూడు విమానాలను నడపనుంది. వందే భారత్ మిషన్ లో భాగంగా ఈ సర్వీసులను నడుపుతామని ఎయిరిండియా ప్రకటనలో వెల్లడించింది.
ఉక్రెయిన్ లోని అతిపెద్ద విమానాశ్రయమైన బోరిస్పిల్ ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్టు నుంచి ఈ సర్వీసులు నడుస్తాయి. భారత ప్రభుత్వం ఉక్రెయిన్ నుంచి వచ్చే ఎయిర్ బబుల్ అరేంజ్మెంట్ ను తొలగించిన తర్వాతే ఈ ప్రకటన వెలువడింది.
‘ఉక్రెయిన్ – ఇండియాల మధ్య ఫిబ్రవరి 22, 24, 26తేదీల్లో మూడు విమాన సర్వీసులు నడపనున్నాం. ఎయిరిండియా బుకింగ్ ఆఫీసెస్, వెబ్‌సైట్, కాల్ సెంటర్, ఆథరైజ్డ్ ట్రావెల్ ఏజెంట్స్ ద్వారా బుకింగ్ చేసుకోవచ్చు’ అని ట్విట్టర్ ద్వారా వెల్లడించారు.
రష్యా తన బోర్డర్ వద్దకు యుద్ధ బలగాలను, ట్యాంకులను, అటాక్ చేయగలిగే హెలికాప్టర్ లను చేర్చడంతో ఇరు దేశాల్లో యుద్ధ వాతావరణం కనిపిస్తుంది. ముందునుంచే ఉక్రెయిన్ లో చదువుకుంటున్న ఇండియన్ స్టూడెంట్స్ ఆందోళనకు గురికావొద్దని తాము ఏర్పాట్లు చేస్తున్నామని చెబుతూ వచ్చింది ఇండియన్ ఎంబసీ.
వీలును బట్టి చార్టర్డ్ ఫ్లైట్స్ కూడా నడుపుతామని విదేశాంగ మంత్రిత్వ శాఖ స్టేట్మెంట్ లో వెల్లడించింది. ప్రస్తుతం ఉక్రెనియన్ ఇంటర్నేషనల్ ఎయిర్‌లైన్స్, ఎయిర్ అరేబియా, ఫ్లై దుబాయ్. ఖతర్ ఎయిర్‌వేస్ సర్వీసులు మాత్రమే నడుస్తున్నాయి.