Russia-Ukraine War : రష్యా దాడులు..యుక్రెయిన్ లోని అపార్ట్‌మెంట్ లో 200 కుళ్లిపోయిన మృతదేహాలు..!
భీకర పోరాటం తర్వాత ఇటీవల మారియుపోల్‌ను స్వాధీనం చేసుకున్న రష్యా దళాలు అక్కడ ఒడిగట్టిన దారుణమారణకాండ వెలుగుచూసింది. మారియుపోల్‌లోని ఓ అపార్ట్ మెంట్ భవనం శిధిలాలు తొలగిస్తుండగా ఆ శిథిలాల క్రింద ఏకంగా 200ల మృతదేహాలు బయటపడ్డాయి.

Russia-Ukraine War : యుక్రెయిన్‌పై రష్యా యుద్ధం మానలేదు. యుక్రెయిన్ కూడా రష్యాను ప్రతిఘటిస్తునే ఉంది. యుద్ధం ప్రారంభించిన సమయంలో కొన్ని వారాల పాటు సామాన్యుల వైపు దృష్టి పెట్టకుండా కేవలం యుక్రెయిన్ సైన్యంమీదనే యుద్ధం చేసింది రష్యా. కానీ పోను పోను అమాయకులను మట్టుబెట్టడం మొదలుపెట్టింది. అలా నివాసాలపై బాంబు దాడులు కొనసాగిస్తోంది. అలా రష్యా దాడులకు ప్రతిఫలంగా ఓ అపార్ట్ మెంట్ పై చేసిన దాడుల దాష్టీకం తాజాగా బయటపడిన ఓ నిజం ప్రపంచాన్ని నిర్ఘాంతపోయేలా చేస్తోంది.
Also read : Minister ktr: 20ఏళ్లలో కేటీఆర్ ప్రధాని కావొచ్చు..! మహిళా వ్యాపారవేత్త ప్రశంసలు
భీకర పోరాటం తర్వాత ఇటీవల మారియుపోల్‌ను స్వాధీనం చేసుకున్న రష్యా దళాలు అక్కడ ఒడిగట్టిన దారుణమారణకాండ వెలుగుచూసింది. మారియుపోల్‌లోని ఓ అపార్ట్ మెంట్ భవనం శిధిలాలు తొలగిస్తుండగా ఆ శిథిలాల క్రింద ఏకంగా 200ల మృతదేహాలు బయటపడ్డాయి. ఈ విషయాన్ని యుక్రెయిన్ అధికారులు మంగళవారం (మే 24,2022)న వెల్లడించారు. మృతదేహాలు కుళ్లిపోయిన స్థితిలో ఉన్నాయని..తీవ్రమైన దుర్వాసన వస్తున్నాయని మేయర్ సలహాదారు పెట్రో ఆండ్రియుష్చెంకో తెలిపారు.
రష్యా దాడిలో పూర్తిగా ధ్వంసమైన మేరియుపోల్‌లోని ఓ అపార్ట్ మెంట్ శిథిలాలను తొలగిస్తున్న క్రమంలో ఓ అపార్ట్‌మెంట్ సెల్లార్ నుంచి ముక్కుపుటాలు అదిరిపోయే దుర్గంధం వచ్చింది. లోపలికి వెళ్లి చూసిన అధికారులు అక్కడి దృశ్యాన్ని చూసి నిశ్చేష్టులయ్యారు. దాదాపు 200 వరకు మృతదేహాలు కుళ్లిన స్థితిలో కనిపించాయి. రష్యా దాడుల్లో నగరంలో దాదాపు 21 వేల మంది మృతి చెందినట్టు యుక్రెయిన్ అధికారులు చెబుతున్నారు. సంచార దహనవాటికలతోపాటు సామూహిక పూడ్చివేతలు చేపడుతూ ఈ దారుణాలు వెలుగులోకి రాకుండా రష్యా జాగ్రత్తపడుతోందని యుక్రెయిన్ ఆరోపిస్తోంది.
Also read :Dawood Ibrahim : పాకిస్తాన్ లోనే అండర్ వరల్డ్‌డాన్ దావూద్ ఇబ్రహీం
కాగా ఈనాటికి కూడా యుక్రెయిన్‌లో రష్యా దాడులు కొనసాగుతున్నాయి. సీవియెరోదొనెట్స్క్, దాని చుట్టుపక్కల నగరాలను చుట్టుముట్టిన రష్యా దళాలు వాటిని పూర్తిగా దిగ్బంధం చేసేందుకు పెద్ద ఎత్తున బలగాలను మోహరించాయి. స్విట్లోడార్స్క్ పట్టణాన్ని స్వాధీనం చేసుకుని తమ జెండాను ఎగురవేశాయి. కాగా, యుద్ధం ప్రారంభమైన ఫిబ్రవరి 24 నుంచి ఇప్పటి వరకు ఉక్రెయిన్‌పైకి రష్యా 1,474 సార్లు క్షిపణులు ప్రయోగించిందని, వేర్వేరు రకాలకు చెందిన 2,275 క్షిపణుల్ని ఉపయోగించిందని ఉక్రెయిన్ అధ్యక్షుడు వోలోదిమిర్ జెలెన్‌స్కీ ఆరోపించారు.
- Swimmer Blows Up: స్విమ్మింగ్ చేస్తూ ఫ్యామిలీ చూస్తుండగానే పేలిపోయాడు!
- Russia-ukraine war :వీధుల్లో కుళ్లిన శవాలతో భీతావహంగా యుక్రెయిన్..ఓ పక్క రష్యా దాడులు..మరోపక్క కలరా వ్యాధితో అతలాకుతలం
- Russia-Ukraine war: అత్యంత ప్రమాదకర ఆయుధాలను వాడుతున్న రష్యా!
- Russia vs Ukraine war: యుద్ధభూమిలో తెరుచుకున్న సినిమా థియేటర్.. తొలిరోజు హౌస్‌ఫుల్
- supreme court: అధిక ఫీజుల వల్లే విదేశాలకు విద్యార్థులు: సుప్రీం కోర్టు
1Crude Oil Sale: కీలక నిర్ణయాలు తీసుకున్న కేంద్ర కేబినెట్
2Ram Pothineni: మీకో దండంరా బాబు.. అంటోన్న రామ్.. ఎందుకో తెలుసా?
3Election Commission: ఆగస్టు 6న ఉప రాష్ట్రపతి ఎన్నిక: ఈసీ
4Karnataka Crime : హత్యాచార కేసును ఛేదించి..నిందితుడిని పట్టించిన కుక్క
5Maharashtra : రెండేళ్లుగా ఆడ కుక్కపై అత్యాచారం చేస్తున్న వృధ్దుడు
6Salaar: సలార్‌లో రాకింగ్ సర్ప్రైజ్.. ప్రశాంత్ నీల్ మాస్టర్ ప్లాన్!
7Maharashtra: రేపు బలపరీక్ష.. మీ తీరు సరికాదు: సీఎం ఉద్ధవ్‌కు గవర్నర్ లేఖ
8Nokia G11 Plus : పవర్ఫుల్ బ్యాటరీతో నోకియా G11 ఫోన్.. ఒకసారి ఛార్జ్ చేస్తే.. 3 రోజులు వస్తుంది..!
9Gujarat : వాడి పారేసిన ప్లాస్టిక్ ఇవ్వండీ..ఈ కేఫ్ లో నచ్చింది తినండీ తాగండీ..ఎక్కడో కాదు మన భారత్ లోనే
10Agnipath: ‘అగ్నిపథ్’ కింద వైమానిక దళంలో ఉద్యోగాలకు 6 రోజుల్లో 2 లక్షల దరఖాస్తులు
-
Sharwanand: శర్వానంద్ రేర్ ఫీట్.. ఏకంగా మిలియన్!
-
Vikram: ఓటీటీలోకి వచ్చేస్తున్న విక్రమ్.. రిలీజ్ డేట్ ఫిక్స్!
-
Period Tracking Apps : అమెరికాలో మహిళలు.. ఫోన్లలో పీరియడ్ ట్రాకింగ్ యాప్స్ డిలీట్ చేస్తున్నారు.. ఎందుకంటే?
-
Moto G42 India : మోటో G42 లాంచ్ డేట్ ఫిక్స్.. ఫీచర్లు, ధర ఎంతంటే?
-
Google Hangouts : వచ్చే నవంబర్‌లో హ్యాంగౌట్స్ షట్‌డౌన్.. గూగుల్ చాట్‌కు మారిపోండి..!
-
Pakka Commercial: పక్కా కమర్షియల్ సెన్సార్ పూర్తి.. రన్ టైమ్ ఎంతంటే?
-
Lokesh Kanagaraj: విజయ్ కోసం మకాం అక్కడికి మారుస్తున్న లోకేశ్..?
-
Tesla Employees : టెస్లా ఉద్యోగుల కష్టాలు.. ఆఫీసుకు రావాల్సిందే.. వస్తే కూర్చొనేందుకు కుర్చీలు కూడా లేవట..!