Russia-ukraine..war : రష్యాకు మరో దెబ్బ.. కోకా కోలా, పెప్సీ అమ్మకాలు నిలిపివేత

యుక్రెయిన్ పై యుద్ధం చేపట్టినప్పటినుంచి రష్యాపై ఆంక్షలు వెల్లు వెత్తుతున్నాయి. దీంట్లో భాగంగా రష్యాలో కోకా కోలా, పెప్సీ అమ్మకాలు నిలిపివేశాయి.

Russia-ukraine..war : రష్యాకు మరో దెబ్బ.. కోకా కోలా, పెప్సీ అమ్మకాలు నిలిపివేత

Coca Cola And Pepsico Suspend Sales In Russia

Russia-ukraine..war యుక్రెయిన్ పై యుద్ధం చేపట్టినప్పటినుంచి రష్యాపై ఆంక్షలు వెల్లు వెత్తుతున్నాయి. ఇప్పటికే రష్యాకు చెందిన లిక్కర్ అమ్మకాలపై పలు దేశాలు నిషేధం విధించారు. అలాగే పలు బ్రాండెడ్ కంపెనీలు రష్యాలతో తమ ఉత్పత్తుల్ని నిలిపివేశాయి. దీంట్లో భాగంగానే ఇప్పటికే..మెక్‌డొనాల్డ్‌, స్టార్‌బక్స్‌ వంటి సంస్థలు కూడా రష్యాలను తమ వ్యాపారాన్ని తాత్కాలికంగా నిలిపివేస్తున్నట్లు ప్రకటించాయి. ఇప్పుడు తాజాగా మరో రెండు బ్రాండెండ్ శీతలపానీయాల కంపెనీలు రష్యాలతో తమ డ్రింక్స్ అమ్మకాలు నిలిపివేస్తున్నామని ప్రకటించాయి.

Also read : Russian ukraine war : ‘పుతిన్ ను అడ్డుకోకపోతే..ఈ భూమిపై ఎక్కడా..ఎవరికీ సురక్షిత ప్రదేశం ఉండదు’: ఒలెనా జెలెన్ స్కీ

అతిపెద్ద కంపెనీ అయిన పెప్సీ కో కూడా తమన ఉత్పత్తుల అమ్మకాలను రష్యాలో నిలిపివేస్తున్నట్లు స్పష్టం చేసింది. పెప్సీ బాటలోనే పెప్సి కోలా, సెవనప్‌, మిరిండా వంటి బ్రాండ్ల అమ్మకాలను ఆపివేస్తున్నామని వెల్లడించారు. అలాగే వాటికి సంబంధించిన ప్రకటనలను కూడా నిలిపివేస్తున్నట్లు తెలిపాయి.

కాగా..రష్యాలో పెప్సీకో 60 దశాబ్దాల నుంచి తన వ్యాపారాన్ని నిర్విరామంగా కొనసాగిస్తోంది. పెస్పీతో పాటు మెక్‌డొనాల్డ్‌, స్టార్‌బక్స్‌ వంటి సంస్థలు కూడా రష్యాలను తమ వ్యాపారాన్ని తాత్కాలికంగా నిలిపివేస్తున్నట్లు ప్రకటించాయి. 2014లో క్రిమియాపై దాడి సందర్భంగా కూడా పలు అమెరికన్‌ కంపెనీలు రష్యాలో తమ వ్యాపారాన్ని నిలిపివేశాయి. అనంతరం యధావిధితా బిజినెస్‌ కొనసాగిస్తున్నాయి.

Also read : Zelensky Compromise : రష్యాతో యుద్ధంపై యుక్రెయిన్ అధ్యక్షుడు రాజీబాట.. నాటోలో చేరేదే లేదన్న జెలెన్‌స్కీ

ఈక్రమంలో యుక్రెయిన్ పై హోరా హోరీగా రష్యా యుద్ధాన్ని కొనసాగిస్తున్న వేళ పలు ఆంక్షలు వెల్లువెత్తున్నాయి. ఇప్పటి వరకు ఇన్ని ఆంక్షలు ఎదుర్కొనే దేశం ఏది లేదు. ఒక్క రష్యాపై మాత్రమే ఇన్ని ఆంక్షలు విధించటం జరుగుతోంది. దీనికి కారణం ఒకే ఒక్కటి. అదే యుక్రెయిన్ పై యుద్ధం.

యుక్రెయిన్ పై రష్యా యుద్ధం ఎంత తీవ్ర తరం అవుతుంటో ఆంక్షలు కూడా అంత తీవ్రంగా కొనసాగుతున్నాయి. గ్యాస్, బొగ్గు దిగుమతులకు సంబంధించి రష్యాపై అమెరికా ఆంక్షలు విధించింది. ఇప్పటికే అమెరికాలోని పలు ప్రాంతాల్లో రష్యాకు చెందిన లిక్కర్ అమ్మకాలు నిలిపివేశాయి.