Russia-Ukraine War: రష్యాలో పాక్షిక సైనిక సమీకరణ.. జైలుకైనా వెళ్తా కానీ, ఉక్రెయిన్ వెళ్లి యుద్ధం చేయనన్న రష్యా పౌరుడు

ఉక్రెయిన్ కి వెళ్లి పోరాడడం కంటే జైలుకి వెళ్లడానికే ప్రాధాన్యం ఇస్తానని మిఖాయిల్ అషిచెవ్ అనే వ్యక్తి చెప్పాడు. ఏదైనా దేశం రష్యాను ఆక్రమించుకోవడానికి వస్తే తాను నేరుగా మిలటరీ ఆఫీసుకి వెళ్లి సైన్యంలో చేరడానికి సంతకాలు చేస్తానని అన్నాడు. కానీ, ప్రస్తుతం రష్యాలో ఆ పరిస్థితి లేదని చెప్పాడు.

Russia-Ukraine War: రష్యాలో పాక్షిక సైనిక సమీకరణ.. జైలుకైనా వెళ్తా కానీ, ఉక్రెయిన్ వెళ్లి యుద్ధం చేయనన్న రష్యా పౌరుడు

Russia vs Ukraine War

Russia-Ukraine War: ఉక్రెయిన్ ను ఆక్రమించుకోవడం అనుకున్నంత సులువేమీకాదని తెలుసుకున్న రష్యా పాక్షిక సైనిక సమీకరణ చేపడుతుండడం, మార్షల్ చట్టం తీసుకురావాలని యోచిస్తుండడం కలకలం రేపుతోంది. దీనిపై రష్యా పౌరులు భయాందోళనలకు గురవుతున్నారు. ఇప్పటికే చాలా మంది దేశం వదిలి వెళ్లిపోయారు. సైన్యంలో చేరకపోతే జైలుకు పంపుతారని భయపడుతున్నారు. రష్యా అధ్యక్షుడు పుతిన్ పాక్షిక సైనిక సమీకరణ ప్రకటన చేసినప్పటి నుంచి ఇప్పటివరకు 2,20,000 మంది పాక్షిక సైనిక సమీకరణ రిజర్వు దళాలను పిలిచారు.

మాస్కోకి 500 మైళ్ల దూరంలో ఉండే పొద్పొరొఝయీలో నివసించే మిఖాయిల్ అషిచెవ్ అనే వ్యక్తిని మిలటరీ డ్రాఫ్ట్ ఆఫీస్ అధికారులు పాక్షిక సైనిక సమీకరణలో భాగంగా పిలిపించి, ఉక్రెయిన్ కు పంపాలని యోచిస్తున్నారు. ఈ నేపథ్యంలో అతడు ఓ మీడియాకు ఇంటర్వ్యూ ఇస్తూ.. ఉక్రెయిన్ కి వెళ్లి పోరాడడం కంటే జైలుకి వెళ్లడానికే ప్రాధాన్యం ఇస్తానని చెప్పాడు.

ఏదైనా దేశం రష్యాను ఆక్రమించుకోవడానికి వస్తే తాను నేరుగా మిలటరీ ఆఫీసుకి వెళ్లి సైన్యంలో చేరడానికి సంతకాలు చేస్తానని అన్నాడు. కానీ, ప్రస్తుతం రష్యాలో ఆ పరిస్థితి లేదని చెప్పాడు. అయితే, తన మాతృదేశానికి ముప్పు మాత్రం ఉందని అన్నాడు. ఫిబ్రవరి 24కి ముందు వరకు తమ దేశానికి ఎలాంటి ముప్పు లేదని, ఉక్రెయిన్ ను రష్యా ఆక్రమించడం మొదలు పెట్టినప్పటి నుంచి ముప్పు పొంచి ఉందని తెలిపాడు.

10 TV live: “నాన్ స్టాప్ న్యూస్ అప్ డేట్స్ కోసం 10TV చూడండి”..