Indian Embassy : బాంబుల మోతతో దద్దరిలుతున్న కీవ్.. ఇండియన్ ఎంబసీ మూసివేత

తక్షణమే కీవ్ లోని( పౌరులు ఖాళీ చేసి వెళ్లిపోవాలని సూచించింది. ఓవైపు రష్యా బాంబుల వర్షం, మరోవైపు యుక్రెయిన్ ధీటుగా జవాబు..(Indian Embassy)

Indian Embassy : బాంబుల మోతతో దద్దరిలుతున్న కీవ్.. ఇండియన్ ఎంబసీ మూసివేత

Indian Embassy

Indian Embassy : యుక్రెయిన్ రాజధాని కీవ్ పై రష్యా వైమానిక దాడి చేసింది. కీవ్ లోని టీవీ టవర్ పై దాడికి పాల్పడింది. ఈ దాడిలో 8మంది పౌరులు మృతి చెందారు. కీవ్ సెక్యూరిటీ హెడ్ క్వార్టర్స్ పై దాడి చేస్తామని వార్నింగ్ ఇచ్చింది రష్యా. తక్షణమే కీవ్ లోని పౌరులు ఖాళీ చేసి వెళ్లిపోవాలని సూచించింది. ఓవైపు రష్యా బాంబుల వర్షం, మరోవైపు యుక్రెయిన్ ధీటుగా జవాబు.. బాంబుల మోతతో కీవ్ నగరం దద్దరిల్లిపోతోంది. ఎలాగైనా కీవ్ ని స్వాధీనం చేసుకునేందుకు రష్యన్ ఆర్మీ ప్రయత్నాలు చేస్తుండగా, యుక్రెయిన్ సైనికులు మాత్రం తీవ్రంగా ప్రతిఘటిస్తున్నారు.

మరోవైపు రష్యాతో భీకర యుద్ధం కారణంగా కీవ్ లోని ఇండియన్ ఎంబసీని(Indian Embassy) మూసివేశారు. దీంతో భారతీయ పౌరులకు ఇబ్బందులు ఎదురయ్యే అవకాశం ఉంది. ప్రస్తుతం రష్యా దూకుడు చూస్తుంటే కీవ్ నగరం నామరూపాలు లేకుండా పోతుందా అన్న అనుమానం వ్యక్తమవుతోంది. రష్యా ఉన్నట్టుండి 64 కిమీ కాన్వాయ్ తో కీవ్ వైపు దూసుకురావడం, కీవ్ ని పౌరులు వెంటనే ఖాళీ చేయాలని రష్యా(Indian Embassy)ఆదేశించడం చూస్తుంటే.. కీవ్ పై పెద్దఎత్తున దాడి చేసేందుకు ఇప్పటికే ప్రణాళిక రెడీ అయినట్లుగా క్లియర్ కట్ గా అర్థమవుతోంది.

Russia Ukraine War : నాడు జర్మనీ కోసం హిట్లర్… నేడు రష్యా కోసం పుతిన్

రష్యన్ ఆర్మీ కాన్వాయ్ ఇప్పటికే కీవ్ వైపు దండెత్తి వస్తున్నట్లుగా శాటిలైట్లు గుర్తించాయి. ఇందులో యుద్ధ ట్యాంకుల నుంచి ఆర్టిలరీ గన్స్ వరకు అన్ని రకాల ఆయుధాలు ఉన్నాయి. ఇప్పుడు ఇవన్నీ కీవ్ పై ఎక్కుపెట్టేందుకు రెడీ అవుతున్నాయి. ప్రస్తుతం ఏ క్షణమైనా కీవ్ ను అన్ని వైపుల నుంచి రష్యా బలగాల మోహరింపు జరగడమో, లేదా కీవ్ పై రాకెట్ల వర్షం కురవడమో జరగడం ఖాయం అంటున్నారు అమెరికా ఇంటెలిజెన్స్ అధికారి.

Ukraine Russia War : యుక్రెయిన్‌పై వెనక్కి తగ్గని పుతిన్.. ఆ ధైర్యం ఇచ్చింది ఇతడేనట..!

రష్యా మొదట వేసుకున్న ప్రణాళిక ప్రకారం కీవ్ ఇప్పటికే హస్తగతం కావాలి. కానీ, యుక్రెయిన్ ఆర్మీ నుంచి ఊహించని విధంగా ప్రతిఘటన ఎదురైంది. దీంతో రష్యా ప్లాన్ బి ఇంప్లిమెంట్ చేస్తోందని అమెరికా ఇంటెలిజెన్స్ అధికారి అంటున్నారు. మరిన్ని దారుణమైన దాడులకు కీవ్ సాక్ష్యం కాబోతోందని చెబుతున్నారు. దానికి తగ్గట్టుగానే రష్యా సేనల మోహరింపు, దాడులు ఉన్నాయి.

రష్యా దాడులపై యుక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్ స్కీ మరోసారి మండిపడ్డారు. ఈయూ పార్లమెంటును ఉద్దేశించి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా మాట్లాడిన ఆయన రష్యాపై నిప్పులు చెరిగారు. రష్యా తీవ్ర యుద్ధ నేరాలకు పాల్పడుతోందని ఆరోపించారు. అత్యంత దారుణమైన, హేయమైన రాక్షసత్వానికి పాల్పడుతోందని ఆరోపణలు చేశారు. యుద్ధ నియమాలను ఉల్లంఘించి సాధారణ పౌరులపై రష్యా బలగాలు కాల్పులు జరుపుతున్నాయని ఆగ్రహం వ్యక్తం చేశారు. సాధారణ పౌరులపై రష్యా సేనల కాల్పులకు సంబంధించి తమ దగ్గర ఆధారాలు ఉన్నాయని అన్నారు. యుక్రెయిన్ లోని రెండో అతిపెద్ద నగరం ఖార్కివ్ లో పౌరుల ఇళ్లపై జరిగిన దాడులను జెలెన్ స్కీ ఈయూకి వివరించారు.