Russia Nuclear weapons : భూమిని వందలసార్లు నాశనం చేయగల అణ్వాయుధాలు కలిగిఉన్న రష్యా ..

అమెరికా-రష్యా మధ్య న్యూక్లియర్ వార్‌కు దారితీస్తే.. దాని ఇంపాక్ట్ ఎలా ఉండబోతోంది? ఎంతలా ఉంటుంది? అనేది బిగ్ క్వశ్చన్. రష్యా-యుక్రెయిన్ యుద్ధంలో పరిస్థితులు చేజారి.. న్యూక్లియర్ వార్ గనక సంభవిస్తే.. పరిస్థితులు చాలా భయంకరంగా ఉంటాయ్. భూమిని వందలసార్లు నాశనం చేయగల వేలాది అణు బాంబులను కలిగి ఉన్న రష్యా అణు యుద్ధానికి సిద్ధపడితే ప్రపంచ వ్యాప్తంగా 5 వందల కోట్ల మంది ప్రాణాలు కోల్పోతారని తాజా పరిశోధనలో తేలింది.

Russia Nuclear weapons : భూమిని వందలసార్లు నాశనం చేయగల అణ్వాయుధాలు కలిగిఉన్న రష్యా ..

Russia ukraine war..Nuclear weapons

Russia ukraine war..Nuclear weapons : రష్యా ప్రెసిడెంట్ పుతిన్ న్యూక్లియర్ దాడులకు దిగితే.. అమెరికా కచ్చితంగా స్పందిస్తుందని ప్రెసిడెంట్ బైడెన్ క్లియర్‌కట్‌గా చెప్పేశారు. అయితే.. ఇదే సమయంలో యుక్రెయిన్‌ మీద పైచేయి సాధించేందుకు.. అణుదాడులకైనా వెనుకాడబోమన్న పుతిన్ హెచ్చరికలు కూడా జోక్ కాదని స్పష్టం చేశారు బైడెన్. ఒకవేళ అదే జరిగి.. ఆ తర్వాత పరిణామాలు అమెరికా-రష్యా మధ్య న్యూక్లియర్ వార్‌కు దారితీస్తే.. దాని ఇంపాక్ట్ ఎలా ఉండబోతోంది? ఎంతలా ఉంటుంది?

ఊహించడానికి ఇది కాస్త ఎక్కువే అనిపించినా.. రానున్న రోజుల్లో ఇది జరగబోదు అని గ్యారెంటీ ఇచ్చే పరిస్థితులేవీ లేవు. ప్రచ్ఛన్న యుద్ధం తర్వాత.. తొలిసారి ప్రపంచానికి అణ్వాయుధ ముప్పు పొంచి ఉందని అమెరికా అంచనా వేస్తోంది. దీనికి సంబంధించి.. యుక్రెయిన్ యుద్ధంలో.. రష్యా అధ్యక్షుడు పుతిన్ ఆలోచనా విధానాన్ని అంచనా వేసేందుకు తాము ప్రయత్నిస్తున్నామని బైడెన్ కూడా చెప్పారు. పుతిన్ న్యూక్లియర్ బెదిరింపుల వల్ల ఏర్పడే ప్రమాదాల గురించే.. ఇప్పుడు అంతటా ఆందోళన కనిపిస్తోంది.

10TV LIVE : నాన్ స్టాప్ న్యూస్ అప్‌డేట్స్ కోసం 10TV చూడండి.

యుక్రెయిన్‌ని స్వాధీనం చేసుకునే ప్రయత్నంలో.. అన్ని అవకాశాలు అయిపోయాయని పుతిన్ భావించినప్పుడు.. ఆఖరి అస్త్రంగా.. అణ్వాయుధాలను ప్రయోగించొచ్చని.. యూఎస్ అంచనా వేస్తోంది. అయితే.. అంతర్జాతీయ నిపుణులు మాత్రం పుతిన్‌వి వ్యూహాత్మక ప్రకటనలు కావొచ్చంటున్నారు. కానీ.. అమెరికా మాత్రం యుక్రెయిన్-రష్యా యుద్ధం వరకు.. అది వ్యూహాత్మకమైనప్పటికీ.. ప్రపంచవ్యాప్తంగా విస్తృతమైన గందరగోళాన్ని సృష్టించే ప్రమాదముందని చెబుతోంది. ఈ విషయంలో.. పుతిన్ ఆలోచనా విధానం ఎలా ఉంటుందనేది.. అంచనా వేసేందుకు యూఎస్ తీవ్రంగా ప్రయత్నిస్తోంది. రష్యాలో పట్టు కోల్పోకూడదంటే యుద్ధంలో గెలవడం పుతిన్‌కు తప్పనిసరి. దానికోసం అతను ఏమైనా చేయడానికి సిద్ధమన్న అనుమానాలు ఉన్నాయి. క్రిమియా వంతెనను పేల్చినందుకు ప్రతీకారంగా కీవ్‌పై రష్యా మిసైళ్లు ఎలా విరుచుకుపడుతున్నాయో మనం కళ్లారా చూస్తున్నాం.. పుతిన్ పగబడితే అలానే ఉంటుంది. గెలుపు మాత్రమే ఆయనకు కావాల్సింది. అందుకే అణుయుద్ధంపై ఇప్పుడు అంతగా ప్రపంచదేశాల్లో భయం..

యుద్ధంలో పరిస్థితులు చేజారి.. న్యూక్లియర్ వార్ గనక సంభవిస్తే.. పరిస్థితులు చాలా భయంకరంగా ఉంటాయ్. ఐక్యరాజ్యసమితి రిపోర్ట్ ప్రకారం.. ప్రపంచంలోని ఏడు దేశాల దగ్గర 12 వేల 7 వందల న్యూక్లియర్ వార్ హెడ్‌లు ఉన్నాయి. వీటిలో.. యూఎస్, రష్యా దగ్గరే.. 90 శాతానికి పైగా ఉన్నాయి. ప్రపంచవ్యాప్తంగా.. రష్యా తన సైనిక స్థావరాల్లో.. అత్యధికంగా దాదాపు 6 వేల అణు బాంబులను సిద్ధంగా ఉంచింది. వీటి సాయంతో.. పుతిన్ ఈ భూమిని వందలసార్లు నాశనం చేయగలడు. ఫెడరేషన్ ఆఫ్ అమెరికన్ సైంటిస్ట్స్ ప్రకారం.. ఈ వార్‌హెడ్‌లలో.. రష్యా నుంచి ప్రపంచంలోని ప్రతి మూలకు పంపగల ఖండాంతర బాలిస్టిక్ మిస్సైళ్లు.. 11 వందల దాకా ఉన్నాయ్. సబ్‌మెరైన్‌ల నుంచి అణుదాడులు చేసేందుకు.. రష్యన్ నేవీ దగ్గర.. 8 వందల బాలిస్టిక్ క్షిపణులున్నాయ్.

Russia Nuclear weapons : రష్యా న్యూక్లియర్ దాడులు బెదిరింపులు .. గేమ్‌ ప్లాన్ రెడీ అంటున్న అమెరికా‌ .. తీవ్ర పరిణామాలు తప్పవంటున్న జీ7 దేశాలు

పుతిన్ గనక అణ్వాయుధాలను ప్రయోగించాలని నిర్ణయించుకుంటే.. యుక్రెయిన్‌లోని రెండు ముఖ్య నగరాలను టార్గెట్ చేసే చాన్స్ ఉందంటున్నారు. ఓ అంచనా ప్రకారం.. అవి.. కచ్చితంగా ఒకటి కీవ్, మరొకటి ఖార్కివ్ అని చెబుతున్నారు. ఈ రెండు నగరాల్లో.. మొత్తం జనాభా 42 లక్షలకు పైనే ఉంది. ఈ ముప్పును చూపి.. యుక్రెయిన్‌ లొంగిపోయేలా రష్యా ఒప్పిస్తుందనే టాక్ కూడా వినిపిస్తుంది. ఇక.. ఇదే న్యూక్లియర్ వార్ అమెరికా-రష్యా మధ్య తలెత్తితే.. పరిస్థితులు మరింత దారుణంగా ఉంటాయ్. వాతావరణంలో చేరే ధూళి, ఉద్గారాలతో కరవు తలెత్తి.. కనీసం 5 వందల కోట్ల మంది ప్రాణాలు కోల్పోతారని తాజా పరిశోధనలో తేలింది. రట్జర్స్ యూనివర్సిటీలోని ఓ టీమ్.. అణు యుద్ధం జరిగేందుకు ఉన్న ఆరు అవకాశాలు విశ్లేషించింది. వీటిలో.. అమెరికా-రష్యా మధ్య జరిగే న్యూక్లియర్ వార్.. భూగోళంపై భయంకరమైన ప్రతికూల ప్రభావాన్ని చూపుతుందని తేల్చింది. ఇదే గనక జరిగితే.. సగానికి పైగా మానవాళి తుడిచిపెట్టుకు పోతుందని తెలిపింది.

ఇక.. క్రిమియాలోని కెర్చ్ బ్రిడ్జ్‌ పేలుడు తర్వాత.. రష్యా-యుక్రెయిన్‌పై దాడులను తీవ్రతరం చేసింది. కీవ్‌ సహా మిగతా నగరాలపై వందల సంఖ్యలో మిస్సైళ్లను ప్రయోగించింది. స్కూళ్లు, ఆస్పత్రులు, అపార్ట్‌మెంట్లు, విద్యుత్ ప్లాంట్లు, బ్రిడ్జ్‌లను టార్గెట్ చేసి మరీ దాడులు చేసింది. ఈ భీకర దాడులతో యుక్రెయిన్ ప్రజలు తీవ్ర భయాందోళనతో వణికిపోతున్నారు. బంకర్లలో తలదాచుకుంటున్నారు. రష్యా జరిపిన తాజా దాడుల్లో 20 మందికి పైగా మృతి చెందారు. వంద మందికి పైగా గాయాలపాలయ్యారు. అయితే.. నేరుగా పౌరుల మీద దాడులు చేయడాన్ని అమెరికా, దాని మిత్ర దేశాలు ఖండిస్తున్నాయ్. మరోవైపు.. రష్యా హెచ్చరికలను ఏమాత్రం పట్టించుకోకుండా.. తమ వార్షిక అణు విన్యాసాలపై ముందుకెళ్లాలని.. ముందస్తు ప్రణాళిక ప్రకారం వచ్చే వారం వాటిని నిర్వహించి తీరాలని నాటో నిర్ణయించింది. దీని తర్వాత.. ఎలాంటి పరిణామాలు తలెత్తుతాయన్న దానిపైనా ఆందోళన నెలకొంది.