Russia-Ukraine war: 400 ఇరాన్ డ్రోన్లతో రష్యా దాడి చేసిందన్న ఉక్రెయిన్ అధ్యక్షుడు.. ఇరాన్‌పై అమెరికా ఆగ్రహం

ఇరాన్ కు చెందిన 400 డ్రోన్లను వాడుతూ తమ దేశంపై రష్యా దాడులు చేసిందని ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్ స్కీ అన్నారు. ‘షేడెడ్-136’ కమికజె డ్రోన్లను వాడుతూ రష్యా తమ పౌరులపై దాడులు చేసిందని చెప్పారు. ఈ నెల 17న ఒకేసారి 43 డ్రోన్లతో భీకర దాడి చేసింది. అనంతరం 28 డ్రోన్లతో కీవ్ పై దాడులు జరిపింది. దీంతో ఇరాన్ తీరుపై అంతర్జాతీయంగా వ్యతిరేకత వస్తోంది. ఇరాన్ డ్రోన్లతో ఉక్రెయిన్ లోని ప్రజల నివాసాలపై రష్యా దాడులు జరుపుతోంది. దీనిపై అమెరికా కూడా స్పందించింది.

Russia-Ukraine war: 400 ఇరాన్ డ్రోన్లతో రష్యా దాడి చేసిందన్న ఉక్రెయిన్ అధ్యక్షుడు.. ఇరాన్‌పై అమెరికా ఆగ్రహం

JelenZelensky scy

Russia-Ukraine war: ఇరాన్ కు చెందిన 400 డ్రోన్లను వాడుతూ తమ దేశంపై రష్యా దాడులు చేసిందని ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్ స్కీ అన్నారు. ‘షేడెడ్-136’ కమికజె డ్రోన్లను వాడుతూ రష్యా తమ పౌరులపై దాడులు చేసిందని చెప్పారు. ఈ నెల 17న ఒకేసారి 43 డ్రోన్లతో భీకర దాడి చేసింది. అనంతరం 28 డ్రోన్లతో కీవ్ పై దాడులు జరిపింది. దీంతో ఇరాన్ తీరుపై అంతర్జాతీయంగా వ్యతిరేకత వస్తోంది.

ఇరాన్ డ్రోన్లతో ఉక్రెయిన్ లోని ప్రజల నివాసాలపై రష్యా దాడులు జరుపుతోంది. దీనిపై అమెరికా కూడా స్పందించింది. ఇరాన్ పంపుతున్న డ్రోన్లతో ఉక్రెయిన్ లో పౌరులను చంపుతున్నారని, ఇరాన్ డ్రోన్లను సరఫరా చేయకూడదని అమెరికా అధ్యక్షుడి అధికారిక నివాసం వైట్ హౌస్ ప్రెస్ సెక్రటరీ కరీన్ జీన్-పియర్ అన్నారు.

ఇరాన్-రష్యా చర్యలపై తాము ఆందోళన వ్యక్తం చేస్తున్నట్లు పేర్కొన్నారు. తాము ఇరాన్ కు స్పష్టమైన సందేశం ఇస్తున్నామని, ఇప్పటికైనా రష్యాకు ఆయుధాల ఎగుమతులను ఆపాలని చెప్పారు. కాగా, కొన్ని నెలలుగా ఉక్రెయిన్ పై రష్యా చేస్తున్న యుద్ధంలో చాలా మంది అమాయకులు ప్రాణాలు కోల్పోయారు.

10 TV live: “నాన్ స్టాప్ న్యూస్ అప్ డేట్స్ కోసం 10TV చూడండి”..