Ukrainian Court : యుద్ధ నేరాల్లో తొలి శిక్ష.. రష్యా సైనికుడికి జీవితఖైదు విధించిన యుక్రెయిన్ కోర్టు

రష్యా యుద్ధ నేరాల విషయంలో తొలి శిక్ష పడింది. ఓ పౌరుడిని కాల్చి చంపిన రష్యా సైనికుడిని దోషిగా నిర్ధారించి జీవితఖైదు విధించింది యుక్రెయిన్ కోర్టు.(Ukrainian Court)

Ukrainian Court : యుద్ధ నేరాల్లో తొలి శిక్ష.. రష్యా సైనికుడికి జీవితఖైదు విధించిన యుక్రెయిన్ కోర్టు

Ukrainian Court

Ukrainian Court : రష్యా యుద్ధ నేరాల విషయంలో తొలి శిక్ష పడింది. రష్యా యుద్ధ నేరాలపై విచారణ చేపట్టిన యుక్రెయిన్ కోర్టు.. ఓ పౌరుడిని కాల్చి చంపిన రష్యా సైనికుడిని దోషిగా నిర్ధారించి జీవితఖైదు విధించింది. యుక్రెయిన్ బలగాలకు పట్టుబడ్డ ఆ రష్యా సైనికుడి పేరు వదీమ్ షిషిమారిన్. 21 ఏళ్ల షిషిమారిన్ రష్యా సైన్యంలో సార్జెంట్ హోదాలో ఉన్నాడు. ఫిబ్రవరి 28న ఈశాన్య సుమీ ప్రాంతంలో 62ఏళ్ల వృద్ధుడిని కాల్చి చంపాడన్న అభియోగాలు ఎదుర్కొంటున్నాడు.

War (3)

War (3)

తాను కాల్పులు జరిపింది నిజమేనని, ఉన్నతాధికారి ఆదేశాల మేరకే కాల్చి చంపానని కోర్టు విచారణలో వదీమ్ అంగీకరించాడు. తమ గురించి యుక్రెయిన్ సైన్యానికి ఆ వ్యక్తి సమాచారం అందిస్తాడేమోనని భావించి కాల్పులు జరపాల్సి వచ్చిందని వివరించాడు. రష్యా సైనికుడు యుద్ధ నేరానికి పాల్పడినట్టు నిర్ధారించిన న్యాయమూర్తి జీవితఖైదు విధిస్తున్నట్టు తీర్పు వెలువరించారు. సార్జెంట్ షిషిమారిన్ కు జీవితఖైదు ద్వారా రష్యా యుద్ధనేరాల విషయంలో తొలి శిక్ష పడినట్టయింది.(Ukrainian Court)

Russia banns Biden: బైడెన్, కమలా హ్యారిస్‌ను దేశంలోకి రాకుండా శాశ్వతంగా నిషేదించిన రష్యా

సైనిక చర్య పేరుతో యుక్రెయిన్ పై రష్యా దండయాత్రకు దిగింది. యుక్రెయిన్ లోని పలు ప్రాంతాలపై బాంబులు, క్షిపణుల వర్షం కురిపిస్తోంది. ఈ ఏడాది ఫిబ్రవరి 24 నుంచి యుక్రెయిన్ పై రష్యా తీవ్ర దాడులతో విరుచుకుపడుతోంది. కాగా, యుక్రెయిన్ దళాలు రష్యా సేనల దాడులను తీవ్రంగానే ప్రతిఘటిస్తున్నాయి. ఈ క్రమంలో కొన్ని చోట్ల రష్యా బలగాలకు నష్టం వాటిల్లింది. కొందరు రష్యా సైనికులు యుక్రెయిన్ దళాలకు బందీలుగా పట్టుబడ్డారు.

Russia Soldier

Russia Soldier

దండయాత్రకు దిగినప్పటి నుంచి రష్యా సైనికులు యుక్రెయిన్ గడ్డపై పాల్పడిన అరాచకాలు, అఘాయిత్యాలకు సంబంధించి వేలాది కేసులు ఇప్పుడు యుక్రెయిన్ కోర్టుల్లో విచారణకు వచ్చాయి.

Ukraine Crisis: రష్యా చేతుల్లోకి మరియపోల్.. యుద్ధం ముగిసిందని ప్రకటించిన పుతిన్ సేన

మరోవైపు అమెరికా అధ్యక్షుడు జో బైడెన్, ఉపాధ్యక్షురాలు కమలా హ్యారిస్‌ను తమ దేశంలోకి రాకుండా రష్యా ప్రభుత్వం శాశ్వత నిషేధం విధించింది. దీంతో రష్యా ప్రభుత్వం ద్వారా శాశ్వత నిషేదానికి గురైన అమెరికా పౌరుల సంఖ్య 963కి చేరింది. యుక్రెయిన్ కు అమెరికా మద్దతు, రష్యా ఆక్రమణ తర్వాత విధించిన ఆంక్షలకు ప్రతి స్పందనగా పలువురు వ్యక్తులను లక్ష్యంగా చేసుకుని రష్యా విదేశాంగ మంత్రిత్వశాఖ ఆంక్షల జాబితాను విడుదల చేసింది. బైడెన్ పరిపాలన సభ్యులు, రిపబ్లికన్స్, టెక్ ఎగ్జిక్యూటివ్స్, జర్నలిస్టులు, సాధారణ అమెరికా పౌరులు ఈ జాబితాలో ఉన్నారు.

War (5)

War (5)

సైనిక చర్య పేరుతో ఉక్రెయిన్ పై దండెత్తిన రష్యా సైన్యం.. భీకర దాడులు చేస్తోంది. మూడు నెలలుగా విరామం లేకుండా రష్యా దళాలు యుక్రెయిన్ లోని పలు ప్రాంతాల్లో బాంబులు, క్షిపణుల వర్షం కురిపిస్తున్నాయి. ఫలితంగా ప్రాణ, ఆస్తినష్టం భారీగా జరుగుతోంది. యుక్రెయిన్ పై రష్యా దాడులను అమెరికా, ఆస్ట్రేలియా, బ్రిటన్ తో పాటు నాటో దేశాలు ఖండించాయి. పుతిన్ తీరుపై తీవ్రంగా మండిపడుతున్నాయి. దీనికితోడు రష్యాపై కఠినమైన ఆర్థిక ఆంక్షలు విధించాయి. రష్యాను ఒంటరిని చేయడానికి అమెరికా తీవ్ర ప్రయత్నాలు చేస్తోంది. అయినా.. పుతిన్ మాత్రం తగ్గేదేలే అంటున్నారు.