Russia ukraine war : రష్యా TV లైవ్ లో యుద్ధం ఆపాలని ప్లకార్డుతో మహిళా జర్నలిస్ట్‌ నిరసన..అరెస్ట్..15 ఏళ్లు జైలుశిక్ష

రష్యా టీవీ లైవ్ లో యుద్ధం ఆపాలని ప్లకార్డుతో మహిళా జర్నలిస్ట్‌ నిరసన వ్యక్తం చేసారు. దీంతో పోలీసులు ఆమెను అరెస్ట్ చేశారు. ఆమెకు 15 ఏళ్లు జైలుశిక్ష పడే అవకాశం ఉందంటున్నారు.

Russia ukraine war : రష్యా TV లైవ్ లో యుద్ధం ఆపాలని ప్లకార్డుతో మహిళా జర్నలిస్ట్‌ నిరసన..అరెస్ట్..15 ఏళ్లు జైలుశిక్ష

Russia Ukraine War

యుక్రెయిన్ పై రష్యా యుద్ధం ఆపాలని డిమాండ్ చేస్తూ..రష్యా టీవీ లైవ్‌ షోలో ఓ మహిళా జర్నలిస్టు నిరసన తెలిపారు. దీంతో ఆమెను అరెస్ట్ చేశారు. ఇటువంటి పని చేసినందుకు సదరు మహిళా జర్నలిస్టులకు 15 సంవత్సరాలు జైలుశిక్ష కూడా పడే అవకాశం ఉన్నట్లుగా తెలుస్తోంది. రష్యా రాజధాని మాస్కోలోని ఛానల్‌1లో పనిచేస్తున్న మెరీనా ఓవ్స్యానికోవా అనే జర్నలిస్టు యుక్రెయిన్ పై రష్యా యుద్ధం ఆపాలని ప్లకార్డుతో రష్యాకు వ్యతిరేకంగా నిరసన తెలిపారు. దీంతో ఆమెను పోలీసులు వెంటనే పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.

Also read : Russia ukraine war: ప్రపంచ న్యాయస్థానంలో రష్యాకు వ్యతిరేకంగా ఓటువేసిన భారత జడ్జి..

పోలీసుల అదుపులో ఉన్నా మెరీనా ఏమాత్రం భయపడటటంలేదు. పోలీసులు అదుపలో ఉండగానే మెరినా మీడియాతో మాట్లాడుతూన్న వీడియోను న్యూయార్క్‌ టైమ్స్‌ ట్విటర్‌లో పోస్టు చేసింది. దీంతో ఇది వైరల్ గా మారింది. ఈ సందర్భంగా మెరినా మాట్లాడుతూ..‘‘పోలీసులు నన్నను 14 గంటలపాటు విచారించారు..నా కుటుంబ సభ్యుల్ని కలవటానికి కూడా అనుమతి ఇవ్వలేదు. పోలీసుల కష్టడీలో ఉన్న నాకు న్యాయసహాయం కూడా అందించలేదు’అని తెలిపింది.

Also read : Israel Covid Variant : ఇజ్రాయెల్‌లో కొత్త కరోనా వేరియంట్.. లక్షణాలివే? ప్రాణాంతకమా? నిపుణులు ఏమంటున్నారంటే?