Snake island : రష్యాకు పక్కలో బల్లెంలా మారిన అతి చిన్న ద్వీపం..ఎందుకంటే..?!
రష్యా గుండెల్లో గుబులు పుట్టిస్తోంది. బుసలు కొడుతూ..రష్యాను వెంటాడుతోంది. వేల ఏళ్ల చరిత్ర వున్న ఆ చిన్న దీవి..ఇప్పుడు రష్యాకు పక్కలో బల్లెంలా మారింది. దాని జోలికి ఎందుకు పోయామా అని పుతిన్ సైన్యం ఇప్పుడు తలపట్టుకుంది.

Snake island : మొత్తం కలిపి 0.17 కిలోమీటర్లు. పొడవు అరకిలోమీటర్ కంటే కాస్త ఎక్కువ. వెడల్పు అర కిలోమీటర్ కంటే తక్కువ. స్కేల్ పెట్టి కొల్చేంత వీలున్న ద్వీపమది. అత్యధిక శాతం రాతిమయం. పేరు స్నేక్ ఐలాండ్. ఇప్పుడు అదే రష్యా గుండెల్లో గుబులు పుట్టిస్తోంది. బుసలు కొడుతూ..రష్యాను వెంటాడుతోంది. వేల ఏళ్ల చరిత్ర వున్న ఆ చిన్న దీవి..ఇప్పుడు రష్యాకు పక్కలో బల్లెంలా మారింది. దాని జోలికి ఎందుకు పోయామా అని పుతిన్ సైన్యం ఇప్పుడు తలపట్టుకుంది. వరుసగా యుద్ధ నౌకల ధ్వంసం రష్యాకు పీడకలగా మారుతోంది.
Also read : North korea Missile : వరుస మిస్సైల్ ప్రయోగాలతో కవ్విస్తున్న కిమ్..ఆందోళనలో దక్షిణకొరియా
యుద్ధం మొదలైన రోజే…రష్యా సైనం…మాస్కోవా యుద్ధ నౌక సాయంతో స్కేక్ ఐలాండ్‌ను రౌండప్ చేసింది. అక్కడున్న యుక్రెయిన్ సైన్యాన్ని పట్టుకుంది. నిజానికి రష్యా పండుగ జరుపుకోవాల్సిన సమయమది. దానికి కారణం కూడా లేకపోలేదు. మొత్తం కొలిచినా పావు కిలో మీటర్ కూడా లేని స్నేక్ ఐలాండ్…బ్లాక్ సీ లో అత్యంత కీలకమైన వ్యూహాత్మక ప్రదేశం. సముద్ర మట్టానికి కేవలం 135 అడుగుల ఎత్తులో వున్నా దాని ప్రత్యేకత వేరు. యుక్రెయిన్ ఆర్థిక కేంద్రమైన ఒడెస్సా పోర్టుకు 80 కిలోమీటర్ల దూరంలో ఆ ద్వీపంపై పట్టు సాధించిన దేశానికి…బ్లాక్ సీలో నౌకల కదలికలపై నిఘా పెట్టడం చాలా సులువు అవుతుంది. అందుకే యుద్ధం మొదలుపెట్టగానే రష్యా సేనలు ఆ ద్వీపంపై కన్నేశాయి. మాస్కోవా యుద్ధ నౌక…ఆ ద్వీపంపై క్రూజ్ క్షిపణుల వర్షం కురిపించింది కట్టడాలను, లైట్‌హౌస్‌ను కూల్చి వేసింది. అక్కడ ఎలెక్ట్రానిక్ వార్ఫేర్ పరికరాలు, సెన్సర్లు, కమ్యూనికేషన్ వ్యవస్థను ఏర్పాటు చేసింది.
కానీ స్నేక్ ఐలాండ్‌పై పట్టు సాధించామనే రష్యా ఆనందం…గాల్లో కలిసిపోవడానికి ఎక్కువ కాలం పట్టలేదు. చిట్టి ద్వీపమే అనుకుంటే చుక్కలు చూపిస్తోంది. రానురాను ఆ దీవి రష్యాకు మృత్యు దీవిగా మారిపోయింది. ఇప్పటిదాకా రష్యాకు చెందిన రెండు భారీ యుద్ధ నౌకలతో సహా మూడు నౌకలు బ్లాక్ సీలో మునిగిపోయాయి. రష్యా లెక్క చెప్పడంలేదు గానీ చాలా మంది సైనికులు చనిపోయారు. ఏప్రిల్ 13న మాస్కోవా నౌక స్నేక్ ఐలాండ్ సమీపంలో ప్రయాణిస్తుండగా యుక్రెయిన్ క్షిపణులు నౌకను ధ్వంసం చేశాయి. ఆ మర్నాడే దెబ్బతిన్న ఆ నౌకను మరో చోటికి రష్యా తరలిస్తుండగా సముద్రంలో మునిగిపోయింది. ఈ ఘటన రష్యాకు పెద్ద షాక్ ఇచ్చింది. ఆ తర్వాత కూడా యుక్రెయిన్ క్షిపణులు రష్యాకే చెందిన మరో యుద్ధ నౌకను ధ్వంసం చేశాయి. అదే ద్వీపం సమీపంలో మరో నౌకను ముంచేసినట్టు వీడియోతో సహా యుక్రెయిన్ లేటెస్ట్‌గా ట్వీట్ చేయడం రష్యా జీర్ణించుకోలేకపోతోంది.
Also read : Russia Victory Day : రెండో ప్రపంచయుద్ధంలో నాజీలకు పట్టిన గతే యుక్రెయిన్ కు పడుతుంది : పుతిన్
వాస్తవానికి 1991 తర్వాత సోవియట్ పతనంతో స్నేక్ ఐలాండ్ యుక్రెయిన్ చేతికి వచ్చింది. ఇప్పుడు ఆ పావు కిలోమీటర్ ద్వీపాన్ని స్వాధీనం చేసుకునే ప్రయత్నంలో రష్యా భారీ నష్టాలను మూటగట్టుకుంటోంది. అయినా అది వ్యూహాత్మక ప్రదేశం కావడంతో దాన్ని వుంచుకోలేక, వదులుకోలేక రష్యా తల బొప్పి కడుతోంది.
- Russian Bomb Hits School : యుక్రెయిన్‌లో స్కూల్‌పై రష్యా బాంబు దాడి… 60మంది మృతి
- Russia Ukraine War: శత్రుదేశాలకు వణుకు పుట్టించే సందేశం
- Zelensky On Australia : మీ సాయం మరువం, పుస్తకాల్లో రాసుకుంటాం- జెలెన్ స్కీ
- Russia-Ukraine war: యుద్ధ భూమిలో ఏంజెలీనా జోలీ పర్యటన.. అక్కడి పరిస్థితిని చూసి ఆమె ఏమన్నారంటే..
- Russia-Ukraine War : రష్యా సైనికుల్ని అడ్డుకోవటానికి గ్రామాన్ని నీటితో ముంచేసిన యుక్రెయిన్ వాసులు
1Nirmala Sitharaman: అన్నదాతకు ఊరట.. కీలక ప్రకటన చేసిన కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి
2VishwakSen : హిట్ పడగానే రేటు పెంచేసిన హీరో..
3MLC Ananthababu : వైసీపీ ఎమ్మెల్సీ అనంతబాబుపై హత్య కేసు నమోదు
4Vijay Devarakonda : ఖుషిలో విజయ్, సమంత లిప్‌లాక్??
5Cm Kcr: ముచ్చటగా మూడోసారి.. ప్రధాని పర్యటనకు దూరంగా సీఎం కేసీఆర్..
6SSC Exams : తెలంగాణలో రేపటి నుంచి పదో తరగతి పరీక్షలు
7BiggBoss Nonstop : బిగ్‌బాస్ నాన్‌స్టాప్ విన్నర్.. బిందు మాధవి.. అందరూ అనుకున్నదే అయిందిగా..
8Rajendra Prasad : ఈ సినిమా హిట్ అవ్వకపోతే.. ఇక నేను మీకు కనపడను..
9Navneet rana couple: వదిలేదే లేదు.. నవనీత్ రాణా దంపతులకు మరో ఝలక్ ఇచ్చిన శివసేన సర్కార్..
10IPL2022 DelhiCapitals Vs MI : ముంబై గెలిచింది.. బెంగళూరు నిలిచింది.. ప్లేఆఫ్స్‌కు చేరిన జట్లు ఇవే
-
Taliban Bans Polygamy: బహుభార్యత్వంపై నిషేధం విధించిన తాలిబన్లు
-
Praggnanandhaa: ఉత్కంఠ చెస్ గేమ్: మరోసారి ప్రపంచ నెంబర్ 1ను ఓడించిన చెస్ గ్రాండ్ మాస్టర్ ప్రజ్ఞానందా
-
LPG Price Drop : గుడ్ న్యూస్… సిలిండర్ ధరలపై రూ.200 తగ్గింపు..!
-
Ex Minister Vs MLA: నాగర్‌కర్నూల్‌లో మాజీ మంత్రి జూపల్లి వర్సెస్ ఎమ్మెల్యే అనుచరులు
-
Cyber Crime: అనకాపల్లిలో సైబర్ మోసం: కరోనా పరిహారం అంటూ రూ. 90 వేలు కాజేసిన మాయగాళ్లు
-
Oatmeal Packs : చర్మానికి మాయిశ్చరైజర్ గా పనిచేసే ఓట్స్ ప్యాక్స్!
-
CM KCR in Delhi: ఢిల్లీలో సీఎం కేసీఆర్ బిజీ బిజీ: ఎస్పీ అధినేత అఖిలేష్‌తో ముగిసిన కేసీఆర్ భేటీ
-
Hyderabad Weather: హైదరాబాద్‌లో ఒక్కసరిగా మారిపోయిన వాతావరణం