Russia-Ukraine War : రష్యాకు పట్టుబడి అత్యంతదారుణంగా మారిపోయిన యుక్రెయిన్ సైనికుడు .. ఫోటో విడుదల చేసిన యుక్రెయిన్ రక్షణశాఖ

రష్యాకు పట్టుబడి అత్యంతదారుణంగా మారిపోయిన యుక్రెయిన్ సైనికుడు ఫోటో విడుదల చేసింది యుక్రెయిన్ రక్షణశాఖ. రష్యాకు పట్టుబడక ముందు అతను ఎలా ఉన్నాడో తరువాత ఎలా ఉన్నాడో చూస్తే రష్యా రాక్షసత్వానికి ఆ సైనికుడు ఎంత నరకం అనుభవించాడో తెలుస్తోంది.

Russia-Ukraine War : రష్యాకు పట్టుబడి అత్యంతదారుణంగా మారిపోయిన యుక్రెయిన్ సైనికుడు .. ఫోటో విడుదల చేసిన యుక్రెయిన్ రక్షణశాఖ

Ukrainian soldier Mykhailo Dianov

Russia- Ukraine War: యుక్రెయిన్ పై దాదాపు నెలలుగా యుద్ధం చేస్తు మారణహోమాన్ని సృష్టిస్తున్న రష్యా దాష్టీకానికి నిలువెత్తు నిదర్శనంగా కనిపిస్తున్నాడు ఓ సైనికుడు. యుద్ధం జరుగుతున్న సమయంలో రష్యా సేనలకు చిక్కిన ఓ యుక్రెయిన్ సైనికుడు ఫోటో రష్యా రాక్షసత్వం ఎలా ఉంటుందో చూపిస్తోంది. దేశం కోసం కదనరంగంలోకి దిగి రొమ్ము విరిచి తమ దేశం కోసం పోరాడతునన్న యుక్రెయిన్ సైనికులు దురదృష్టవశాత్తు రష్యాకు చిక్కితే ఎంతటి నరకం అనుభవించాల్సి వస్తోంది ఈ ఒక్క ఫోటో కళ్లకు కట్టి చూపిస్తోంది. రష్యాతో పోరాడి పట్టుబడిన యుక్రెయిన్ సైనికులను నరకం అంటే ఏంటో చూపిస్తోంది రష్యా. తాజాగా రష్యా దళాలకు చిక్కిన ఓ యుక్రెయిన్ సైనికుడి రూపం చూసి ప్రపంచమే నివ్వెరపోయింది. ఆ యుక్రెయిన్ సైనికుడు పేరు మైఖేల్ డయానోవ్. అతడి చేయి విరిచేసి.. ఎముకల గూడుగా మార్చేసి చిత్రహింసలు పెట్టినట్టుగా రూపం ఉంది. ఎముకలు తప్ప ఏం లేని అస్తిపంజరంగా యుక్రెయిన్ సైనికుడు కనిపిస్తున్నాడు.. యుద్ధ ఖైదీలను ఏం చేయవద్దన్న ‘జెనీవా’ ఒప్పందాలను తుంగలో తొక్కి రష్యా చేస్తున్న ఈ మారణఖండకు అంతే లేకుండా పోయిందని ఈ ఒక్క ఫోటో నిరూపిస్తోంది.

ప్రశాంతంగా ఉన్న యుక్రెయిన్ పై యుద్ధం మొదలు పెట్టి నేలమట్టం చేసిన పారేసింది. క్షిపణులతో దాడి చేసి శ్మశానంగా మార్చేసింది. యుక్రెయిన్ సైన్యంమీదనే కాకుండా సామాన్య పౌరులపై కూడా రష్యా ప్రతాపం చూపింది. సాధారణ జనాల నివాసాలపై బాంబులు వేసి మారణహోమం సృష్టించింది. నగరాలు..గ్రామాలు అనే తేడా తెలియకుండా శవాల కుప్పగా మార్చేసింది. యుద్ధంలో రష్యాకు పట్టుబడిన యుక్రెయిన్ సైనికులకు ప్రత్యక్ష నరకం చూపిస్తోంది రష్యా. దాంట్లో భాగంగా తమ రాక్షసత్వం ఎలా ఉంటుందో అనేదానికి ఉదాహరణగా మైఖేల్ డయానోవ్ ఫోటోను విడుదుల చేసింది. మాకు చిక్కితే మీ పరిస్థితి కూడా ఇలాగే ఉంటుందని హెచ్చరిస్తున్నట్లుగా ఆ ఫోటోను విడుదుల చేసింది.

యుక్రెయిన్ లోని మారియుపోల్ ముట్టడి సమయంలో రష్యా సైనికుల చేతికి ఈ యుక్రేనియన్ డయానోవ్ రష్యన్ జైలులో చిత్రహింసలు అనుభవించాడు.2022 ప్రారంభంలో మారియుపోల్‌లోని అజోవ్‌స్టల్ స్టీల్ వర్క్స్‌ను రక్షించడానికి ఉక్రెయిన్ సైన్యం తరుఫున డయానోవ్ పోరాడాడు. ఆ సమయంలోనే రష్యా సైనికుల చేతికి చిక్కాడు. బుధవారం (సెప్టెంబర్,2022) రాత్రి విడుదలైన 205 మంది యుక్రేనియన్ యుద్ధ ఖైదీలలో మైఖైలో డయానోవ్ కూడా ఒకరు. అతడు యుద్ధానికి ముందున్న రూపం.. ఇప్పటి రూపం చూసి అంతా నివ్వెరపోతున్నారు.

మేలో ఓడరేవు నగరంలోని పారిశ్రామిక ప్రదేశాన్ని రష్యా ముట్టడించిన సమయంలో తన చేయితో శాంతి చిహ్నాన్ని మెరుస్తున్న ఫోటో వైరల్ అయింది. అందులో అతను అలసిపోయి, షేవ్ చేయని స్థితిలో ఉన్నాడు. కానీ డయానోవ్ తాజా ఫోటో చూస్తే అతని చేయి విరిగిపోయి.. ముఖంపై గాయాలు, మచ్చలతో కప్పబడి కృంగి కృశించిపోయినట్లుగా ఓ ఎముకల గూడులా ఉన్నట్లుగా చూపిస్తుంది.అజోజ్ మిలిటరీ యూనిట్‌లో సైనికుడు అయిన డయానోవ్ మారియుపోల్ యుద్ధంలో రష్యా సైనికుల చేతికి చిక్కాడు. నాలుగు నెలలు రష్యన్ జైలులో శిక్ష అనుభవించాడు. రష్యా నరకం చూపించింది. అతడి చేయి విరిచేసి.. చిత్రహింసలు పెట్టి.. తిండి పెట్టకుండా కృంగి కృశించిపోయేలా చేసింది. కరడుగట్టిన రష్యన్ మద్దతుదారులు వీరిని యుద్ధ నేరస్థులు.. నాజీలు అని ఆరోపిస్తూ ఉరితీయాలని డిమాండ్ చేశారు.

ఈ వారం ప్రధాన ఖైదీల మార్పిడిలో భాగంగా విడుదలైన డయానోవ్ కూడా విడుదలయ్యాడు. ఆ తర్వాత తన స్నేహితులు, బంధువులతో కలిసి చెర్నిహివ్‌లోని ఒక నగర ఆసుపత్రిలో ఎముకలగూడుగా మారిపోయి సొంత కుటుంబ సభ్యులు కూడా గుర్తించలేదని దుస్థితిలో చేరాడు. అతను కైవ్ మిలిటరీ ఆసుపత్రికి తరలించబడ్డాడు. అక్కడ అతని సోదరి తీవ్రమైన పరిస్థితిలో ఉన్న డయనోవ్ ను చూసి భోరుమని ఏడ్చింది. అతడి శరీరంలోని ఎముకలన్నీ విరిగిపోయాయని.. దీర్ఘకాలిక చికిత్స అవసరమని డాక్టర్లు చెప్పిన మాటలకు కుప్పకూలిపోయిందామె.

గాయపడిన డయనోవ్ చేతిలోని ష్రాప్నెల్ ఎముకను కొంచెం విరిచేసి మత్తుమందు లేకుండా తీసేశారు. బందిఖానాలో అతను ఎదుర్కొన్న అమానవీయ పరిస్థితుల కారణంగా చేయి అతని స్వాధీనంలో లేకుండాపోయింది. మిలిటరీ హాస్పిటల్‌లోని డాక్టర్ అతనిని పరిశీలించగా అతడికి 4 సెంటీమీటర్ల ఎముక లేదు అని గుర్తించారు డాక్టర్లు. ప్రస్తుతం అతని ఆరోగ్య పరిస్థితి సర్జరీ చేయటానికి వీల్లేకుండా ఉంది. అతను మొదట కోలుకున్నాక సర్జరీ చేయాలంటున్నారు డాక్టర్లు. అతడున్న పరిస్థితిలో అతనికి ఆపరేషన్ చేయలేమని… ఇది అతని ఆరోగ్యానికి ప్రమాదకరమని.. కాబట్టి అతను ఇప్పుడు కోలుకుని బలాన్ని పొందాలని తెలిపారు. శారీరకంగా అత్యంత దారుణ దుస్థితిలో ఉన్నాడని కానీ మానసికంగా మైఖైలో చాలా బలంగా ఉన్నాడని తెలిపాడు. రష్యా చేతిలో అన్నిరకాల చిత్రహింసలకు గురి అయినా డయానోవ్ మానసికంగా అంత బలంగా ఉన్నాడు అంటే అది అతనికి దేశంమీద ఉన్న భక్తి మాత్రమేనని చెప్పితీరాల్సిందే.తన దేశం వచ్చినందుకు అతను చాలా సంతోషంగా ఉన్నాడు. రష్యా చేతిలో చిత్రహింసలు అనుభవించిన డయానోవ్ పాత రూపానికి.. ఇప్పటి రూపానికి పొంతనే లేకుండా ఉంది.