Leave Russia : వెంటనే రష్యా నుంచి వచ్చేయండి.. అమెరికన్లకు ఆదేశం

యుక్రెయిన్ పై రష్యా యద్ధం నేపథ్యంలో అగ్రరాజ్యం అమెరికా కీలక నిర్ణయం తీసుకుంది. వెంటనే రష్యాను వీడాలని అమెరికన్లకు సూచించింది.

Leave Russia : వెంటనే రష్యా నుంచి వచ్చేయండి.. అమెరికన్లకు ఆదేశం

Leave Russia : యుక్రెయిన్ పై రష్యా యద్ధం నేపథ్యంలో అగ్రరాజ్యం అమెరికా కీలక నిర్ణయం తీసుకుంది. రష్యాలోని తమ దేశ పౌరులకు కీలక ఆదేశాలు జారీ చేసింది. వెంటనే రష్యాను(Leave Russia) వీడాలని అమెరికన్లకు సూచించింది. ఇప్పటికే రష్యా రాజధాని మాస్కోలని తమ రాయబార కార్యాలయానికి చెందిన నాన్-ఎమర్జెన్సీ సిబ్బంది, కుటుంబసభ్యులను స్వచ్చందంగా వెనక్కి రావాలని ఆదేశించింది. ఇప్పటికే అమెరికన్లు రష్యా వెళ్లొద్దని అమెరికా ప్రభుత్వం కోరడం జరిగింది.

మరోవైపు రష్యా, యుక్రెయిన్ మధ్య సైనిక పోరు భీకరంగా కొనసాగుతోంది. ఐదో రోజూ(ఫిబ్రవరి 28) రష్యా సేనలు యుక్రెయిన్ లోకి దూసుకొచ్చాయి. బాంబుల వర్షం కురిపించాయి. మరోవైపు యుక్రెయిన్‌ సైన్యం సైతం తగ్గేదేలే అంటోంది. రష్యా బలగాలకు ఎదురొడ్డి నిలుస్తోంది.

యుక్రెయిన్ పై యుద్ధానికి దిగిన రష్యా దళాలు.. రాజధాని కీవ్ స్వాధీనానికి భీకర పోరాటం చేస్తున్నాయి. కీవ్ ను అన్ని వైపుల నుంచి రష్యా సేనలు చుట్టుముట్టాయి. యుక్రెయిన్ సైన్యం కూడా తగ్గేదేలే అంటోంది. రష్యా బలగాలను యుక్రెయిన్ సేనలు తీవ్రంగా ప్రతిఘటిస్తున్నాయి. ఓవైపు చర్చలు జరుగుతున్న మరోవైపు ఇరు దేశాల దళాలు భీకరంగా తలపడుతున్నాయి. దీంతో యుక్రెయిన్ దేశ వాసులు, అక్కడ ఉంటున్న విదేశీయులు ప్రాణ భయంతో బతుకుతున్నారు. లక్షలాది మంది ప్రజలకు ఇప్పటికే యుక్రెయిన్ వీడారు.

Russia-Ukraine : రష్యా, యుక్రెయిన్‌ మధ్య చర్చలు విఫలం

రష్యా దాడులతో ఉక్కిరిబిక్కిరవుతున్న యుక్రెయిన్‌కు క్రమంగా ఒక్కో దేశం ముందుకు వచ్చి మిలటరీ సాయంతో అండగా నిలుస్తున్నాయి. ఇప్పటికే భారీ స్థాయిలో ఆయుధాలు అందజేస్తున్న ఈయూ సమాఖ్య దేశాలు.. తాజాగా యుద్ధ విమానాలను సైతం పంపడానికి సిద్ధమయ్యాయి. ‘‘మేం యుద్ధ విమానాలను కూడా పంపుతాం. కేవలం ఆయుధాలు పంపడం గురించే మాట్లాడడం లేదు. యుద్ధానికి కావాల్సిన కీలక ఆయుధాలను సైతం అందజేస్తున్నాం’’ అని ఈయూ సమాఖ్య విదేశీ విధానం విభాగపు అధిపతి జోసెఫ్‌ బోరెల్‌ అన్నారు.

త‌క్ష‌ణ‌మే కాల్పులు ఆపాల‌ని ర‌ష్యా, యుక్రెయిన్ దేశాల‌కు ఐక్య‌రాజ్య స‌మితి పిలుపునిచ్చింది. ఇరు దేశాలు సంయ‌మ‌నం పాటించ‌డంతో పాటు ఇరు దేశాల మ‌ధ్య శాంతి నెల‌కొనేలా చ‌ర్చ‌ల‌ను ప్రారంభించాల‌ని యూఎన్ జ‌న‌ర‌ల్ అసెంబ్లీ సూచించింది.

ర‌ష్యా యుద్ధోన్మాదం కార‌ణంగా ఉక్రెయిన్‌లో నెల‌కొన్న సంక్షోభం నేప‌థ్యంలో యూఎన్ జ‌న‌ర‌ల్ అసెంబ్లీ స‌మావేశాన్ని సోమ‌వారం అత్య‌వ‌స‌రంగా నిర్వ‌హించారు. ఈ సంద‌ర్భంగా ర‌ష్యాతో పాటు ఉక్రెయిన్ కూడా సంయ‌మ‌నం పాటించాల‌ని యూఎన్ఓ సూచించింది. స‌మావేశం సంద‌ర్భంగా ర‌ష్యా యుద్ధం కార‌ణంగా చ‌నిపోయిన మృతుల‌కు సంతాపం ప్ర‌క‌టించింది.

ఈ సంద‌ర్భంగా జ‌న‌ర‌ల్ అసెంబ్లీలో యూఎన్ సెక్ర‌ట‌రీ జ‌న‌ర‌ల్ ఆటోనియో గుటెర‌స్ ఇరు దేశాల‌కు ప‌లు సూచ‌న‌లు చేశారు. నానాటికీ పెరిగిపోతున్న హింస ద్వారా అనేక మంది సాధార‌ణ పౌరులు చ‌నిపోతున్నార‌ని ఆయ‌న ఆవేద‌న వ్య‌క్తం చేశారు. ఇప్ప‌టిదాకా జ‌రిగిన దానిని ప‌క్క‌న‌పెట్టేసి ఇరు దేశాల సైనికులు త‌మ స్థావ‌రాల‌కు వెళ్లిపోవాల‌ని ఆయ‌న సూచించారు. హింస‌తో స‌మ‌స్య‌ల‌కు ప‌రిష్కారం ల‌భించ‌దని, శాంతితోనే స‌మ‌స్య‌లు ప‌రిష్కార‌మ‌వుతాయ‌ని ఆయ‌న చెప్పారు. యుద్ధం కార‌ణంగా ఇబ్బందుల్లో ప‌డ్డ యుక్రెయిన్‌కు చేయూత‌నందిస్తుంద‌ని, ఆ దేశాన్ని అలా వ‌దిలేయ‌మ‌ని కూడా గుటెర‌స్ చెప్పారు.

Russia-Ukraine War: భారత సైన్యాన్ని పంపమంటూ ఏడుస్తూ రిక్వెస్ట్!

మరోవైపు ప్ర‌పంచ దేశాలన్నీ భ‌య‌ప‌డిన‌ట్టుగానే అయ్యింది. యుద్ధంతో హోరాహోరీగా త‌ల‌ప‌డుతున్న ర‌ష్యా, యుక్రెయిన్ల మ‌ధ్య సోమ‌వారం మధ్యాహ్నం మొద‌లైన చ‌ర్చ‌లు విఫ‌ల‌మ‌య్యాయి. బెలార‌స్ వేదిక‌గా జ‌రిగిన ఈ చ‌ర్చ‌ల్లో ఇరు దేశాలు త‌మ త‌మ వాద‌న‌ల‌కే క‌ట్టుబ‌డి సాగాయి. ప్ర‌త్య‌ర్థి వ‌ర్గం చేసిన డిమాండ్ల‌ను ఇరు దేశాలు కూడా ప‌రిగ‌ణ‌న‌లోకి తీసుకోలేదు. ఈ కార‌ణంగా గంట‌ల త‌ర‌బ‌డి సాగిన ఈ చ‌ర్చ‌లు సింగిల్ తీర్మానం కూడా లేకుండానే ముగిశాయి.