Russia-Ukraine War: యుక్రెయిన్‌పై యుద్ధం.. భారత పత్రికలపై ప్రభావం!

నెల రోజులు గడుస్తున్నా.. యుక్రెయిన్, రష్యా మధ్య భీకర యుద్ధం కొనసాగుతోంది. ఫిబ్రవరి 24న మొదలైన రష్యా దండయాత్ర..

Russia-Ukraine War: యుక్రెయిన్‌పై యుద్ధం.. భారత పత్రికలపై ప్రభావం!

Russia Ukraine War

Russia-Ukraine War: నెల రోజులు గడుస్తున్నా.. యుక్రెయిన్, రష్యా మధ్య భీకర యుద్ధం కొనసాగుతోంది. ఫిబ్రవరి 24న మొదలైన రష్యా దండయాత్ర 3 వారాలకుపైగా కొనసాగుతూనే ఉంది. యుక్రెయిన్ పై రష్యా బలగాలు విచక్షణ లేకుండా బాంబులు, క్షిపణుల వర్షం కురిపిస్తూనే ఉన్నాయి. యుక్రెయిన్ ప్రధాన నగరాల్లోకి చొచ్చుకుని వచ్చిన రష్యా బలగాలు.. ఇప్పటికే ఖర్కివ్, మారియుపోల్, సుమీ, చెర్నిహివ్ వంటి ఇతర నగరాలను తమ అధీనంలోకి తెచ్చుకున్నాయి.

Russia-Ukraine War : యుద్ధం ఆపాలంటూ పుతిన్‌కు హాలీవుడ్ టెర్మినేటర్ స్టార్ విజ్ఞప్తి!

యుక్రెయిన్‌ రాజధాని కైవ్‌పై రష్యా వరుసగా బాంబు దాడులను చేస్తూనే ఉండగా.. రష్యా దాడుల నేపథ్యంలో యుక్రెయిన్ నుంచి మూడు మిలియన్ల మందికి పైగా ప్రజలు దేశం విడిచి పారిపోయారు. ఖేర్సన్ లాంటి ప్రాంతాలు రష్యా పూర్తి నియంత్రణలో తీసుకోగా.. యుక్రెయిన్ సైనికులు పోరాడుతున్న ప్రాంతాలలో సైనికులపైనే కాదు.. సామాన్య ప్రజలపై కూడా రష్యా సైన్యం దాడులకు పాల్పడుతుంది. యుక్రెయిన్ పై రష్యా యుద్ధ ప్రభావం ప్రపంచ దేశాలపై కూడా పడుతుంది.

Russia-Ukraine War : సీ ఆఫ్ అజోవ్‌ సముద్రంలో ప్రవేశాన్ని తాత్కాలికంగా కోల్పోయిన యుక్రెయిన్

ముఖ్యంగా భారత్ లాంటి దిగుమతులపై ఆధారపడిన దేశాలు కొన్ని తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నాయి. భారత్ న్యూస్ ప్రింట్ దిగుమతుల్లో 45% వాటా రష్యాదే కాగా.. యుక్రెయిన్ పై యుద్ధ నేపథ్యంలో రష్యా నౌకాశ్రయాల నుంచి బుకింగ్స్ తీసుకోవడాన్ని పలు అంతర్జాతీయ షిప్పింగ్ కంపెనీలు నిలిపివేయడంతో కంటైనర్లన్నీ అక్కడే నిలిచిపోయాయి. దీంతో భారత న్యూస్ ప్రింట్లు సరఫరాదారుల కోసం ఎదురుచూడాల్సి వస్తుంది. ఇప్పటికే న్యూస్ ప్రింట్ల ధరలు భారీగా పెరుగుతున్నాయి. 2019లో టన్ను న్యూస్ ప్రింట్ ధర 450 డాలర్లు ఉండగా.. ఇప్పుడు అదే న్యూ ప్రింట్ ధర 950 డాలర్లకు చేరుకుంది.