బికినీలో నర్సు..కరోనా రోగులకు చికిత్స

  • Published By: madhu ,Published On : May 21, 2020 / 10:19 AM IST
బికినీలో నర్సు..కరోనా రోగులకు చికిత్స

బికీనీ ధరించి..కరోనా రోగులకు చికిత్స చేస్తున్న నర్సు ఫొటో ఒకటి సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ప్రాణాలకు తెగించి వైద్యులు తీవ్రంగా కృషి చేస్తున్న సంగతి తెలిసిందే. కరోనా రోగులకు చికిత్స అందించే విషయంలో కొన్ని నిబంధనలు పాటించాల్సి ఉంటుంది. తప్పనిసరిగా వైద్యులు, నర్సులు, ఇతర సిబ్బంది PPE డ్రెస్ వేసుకోవాల్సి ఉంటుంది. రష్యాలోని టూలా పట్టణ ప్రాంతంలో కరోనా రోగులకు వైద్యులు వైద్య చికిత్సలు అందిస్తున్నారు. ఓ నర్సు బికినీ ధరించి..ఆపై పీపీఈ ధరించి సేవలు అందిస్తోంది. దీనికి సంబంధించిన ఫొటో తీసి సోషల్ మీడియాలో పోస్టు చేశారు. అది కాస్తా వైరల్ అయిపోయింది. 

పీపీఈ ప్లాస్టిక్ తో తయారు చేబడుతుంది. ఇది వేసుకున్న అనంతరం అధికంగా వేడి ఉంటుంది. కానీ చికిత్స అందించే క్రమంలో..దీనిని భరించాల్సి ఉంటుంది. కానీ..ఈ నర్సు వేసుకోకపోవడంపై మండిపడుతున్నారు. పీపీఈ కిట్ వేసుకోవడ వల్ల చాలా వేడి వస్తోందని, లోపల మాములు దుస్తులు ధరించానని నర్సు వెల్లడించినట్లు సమాచారం. రోగుల నుంచి ఎలాంటి కంప్లయింట్ లేవని చెబుతోంది. అయితే..దీనిపై ప్రభుత్వం సీరియస్ గా ఉన్నట్లు సమాచారం. విచారణకు ఆదేశించింది. క్రమశిక్షణ చర్యలు తీసుకున్నట్లు తెలుస్తోంది. 

రష్యాలో కరోనా కేసులు అధికంగానే నమోదవుతున్నాయి. 3 లక్షలకు పైగా పాజిటివ్ కేసులున్నట్లు, 2 వేల 972 మంది చినిపోయారని అంచనా. మృతుల సంఖ్య తక్కువగానే ఉన్నా..కేసులు రోజు రోజుకు పెరుగుతుండంతో అక్కడి ప్రజలు తీవ్ర భయాందోళనలకు గురవుతున్నారు.