అమెరికాకు సాయం చేసేందుకు ముందుకొచ్చిన రష్యా

అమెరికాకు సాయం చేసేందుకు ముందుకొచ్చిన రష్యా

ఒకరి సంక్షోభంలో ఉంటే ఇంకొకరు చేయందించేందుకు ముందుకొస్తున్నారు. బుధవారం రష్యా మిలటరీ.. అమెరికాకు సాయం చేసేందుకు బయల్దేరింది. మెడికల్ పరికరాలతో పాటు మాస్క్ లను తీసుకుని మాస్కో నుంచి బయల్దేరినట్లు అక్కడి మీడియా చెప్పింది. 

‘రష్యా మానవత్వంతో సాయం అందించేందుకు ముందుకొస్తున్నందుకు ట్రంప్ సంతోషం వ్యక్తం చేశారని అధికార ప్రతినిధి వెల్లడించారు. అమెరికాలో ప్రస్తుతం 2లక్షల కరోనా కేసులు నమోదుకాగా, 4వేల 476మంది ప్రాణాలు కోల్పోయారు. రష్యాలో 2వేల 777మంది కేసులు నమోదైతే 24మంది మృతి చెందారు. 

అమెరికాకు వైద్య సహాయం అందించేందుకు రష్యా ముందుకొచ్చింది. ‘ట్రంప్ కు మంచి కాలమే అని చెప్పాలి. ఈ సమయంలో సాయం చేసేందుకు రష్యా వచ్చింది. అని ఇంటర్నేషనల్ పీస్ ట్విట్టర్ లో పోస్టు చేసింది. 

వైరస్ మొదట వెలుగులోకి వచ్చిన చైనా కన్నా మరణాల సంఖ్యలో,కేసుల సంఖ్యలో అమెరికానే ముందుంది. అయితే గత శనివారం 2010 కరోనా మరణాలు నమోదవగా,రెండు రోజుల్లోనే మరణాల సంఖ్య రెట్టింపు కన్నా ఎక్కువ అయింది. 

కరోనా పురుడు పోసుకున్న చైనా.. కరోనా కారణంగా అత్యధిక మరణాలు సంభవించిన ఇటలీ, స్పెయిన్‌ల కంటే కూడా అమెరికాలోనే కరోనా పాజిటివ్‌ కేసుల సంఖ్య ఎక్కువగా ఉండటం అమెరికన్లలో ఆందోళన కలిగిస్తొంది. అమెరికా కరోనాతో పూర్తిస్థాయిలో పోరాడుతోందని… అయితే మహమ్మారి ధాటికి 2,40,000 అమెరికన్లు మృత్యువాత పడే అవకాశం ఉందని వైట్ హౌస్ హెచ్చరించింది.

Also Read | తర్వాత ఏం చేద్దాం.. 15వ తేదీన లాక్‌డౌన్‌ ఎత్తివేత: సీఎంలతో ప్రధాని మోడీ