బంక్ బంపర్ ఆఫర్ : బికినీతో వస్తే పెట్రోల్ ఫ్రీ…

  • Published By: veegamteam ,Published On : November 19, 2019 / 08:04 AM IST
బంక్ బంపర్ ఆఫర్ : బికినీతో వస్తే పెట్రోల్ ఫ్రీ…

పెట్రోల్, డీజిల్, ఫ్రీగా ఇస్తామంటే…జనాలు ఎగేసుకుంటూ పోరూ..క్యూలో నిలబడి మరీ తెచ్చేసుకంటారు. ఇది ఏ ఇండియాలోనే కాదు ప్రపంచంలోని ఏ దేశంలో అయినా  సరే ఫ్రీ అంటే వెళ్లకుండా ఉంటారా చెప్పండి. పెట్రోల్, డీజిల్ ఫ్రీ ఇవ్వటానికి ఏ దేశ ప్రభుత్వమూ ముందుకు రాదు. కానీ  రష్యా సమారాలోని ఓల్వీ గ్యాస్ స్టేషన్ మాత్రం బంపరాఫర్ ప్రకటించింది.

మార్కెటింగ్ పెంచుకునే ప్లాన్ లో భాగంగా బికినీలో వచ్చేవారికి ఫ్రీగా పెట్రోల్ పోస్తామని ఆఫర్ ఇచ్చింది. ఈ ఆఫర్‌తో… పెట్రోల్, డీజిల్, గ్యాస్ కోసం… అమ్మాయిలంతా బికినీల్లో వచ్చేస్తారనీ… పండగ చేసుకోవచ్చని అనుకుంది ఆ బంక్ యాజమాన్యం. సిబ్బంది కూడా… అందాల్ని ఆస్వాదించాలని ఆశగా ఎదురుచూశారు. కానీ… ఊహించని షాక్ తగిలింది.

కాకపోతే..ఈ ఆఫర్ అమ్మాయిలకా, అబ్బాయిలకా అన్నది ఆ బంక్ క్లారిటీ ఇవ్వలేదు. బికినీలో ఎవ్వరు  వచ్చినా..ఫ్రీగా పొయ్యాల్సిందే. కానీ షాకింగ్ విషయమేంటంటే..ఆ బంక్ కు అమ్మాయిలెవరూ బికినీలతో రాలేదు. అబ్బాయిలు మాత్రం…బికినీ డ్రెస్సులు ఎగేసుకుంటూ వచ్చేటం మొదలుపెట్టారు. వాచ్ మి… ఐ యామ్ ఇన్ బికినీ అంటూ వరుసగా కార్లేసుకుని వచ్చేస్తున్నారు. ఇక చూడాలి బంక్ వారి పరిస్థితి..బికినీలో వచ్చే పురుషుల్ని చూడలేక తలలు పట్టుకోవటం బంక్ సిబ్బంది వంతు అయ్యింది. కొందరు మగాళ్లైతే అత్యుత్సాహం ప్రదర్శిస్తూ..బికినీకి మ్యాచ్ అయ్యే కలర్ హైహీల్స్ వేసుకుని వస్తూ వాటిని చక్కగా ప్రదర్శిస్తున్నారు.