ఆ బంక్‌కు బికీనీతో వెళ్తే ట్యాంక్ ఫుల్

ఆ బంక్‌కు బికీనీతో వెళ్తే ట్యాంక్ ఫుల్

మార్కెటింగ్‌ కోసం ఎన్ని ఆఫర్లు పెట్టినా సద్వినియోగం చేసుకోవడంలో ముందుంటున్నారు యూత్. ఫ్రీగా ఇస్తున్నారంటే గంటలకొద్దీ లైన్లో ఉండటానికి వెనుకాడని జనాలు ఫ్రీగా పెట్రోల్ వస్తుందంటే బికినీతో రావడానికి ఏం అడ్డు చెప్తారు. రష్యాలోని ఓ ఫ్యూయల్ స్టేషన్లో ఇదే జరిగింది. 

రష్యాలోని సమారాలో ‘ఓల్వీ’ అనే గ్యాస్ స్టేషన్ ప్రకటించిన ఆఫర్‌కు భారీ స్పందన వచ్చింది. బికినీతో తమ గ్యాస్ స్టేషన్‌కు వస్తే.. వారికి ఉచితంగా ఇస్తామంటూ ప్రకటించింది. ఆఫర్ ఐదు గంటలే అని తెలియడంతో మహిళలంతా బికినీల్లో వచ్చి పెట్రోల్ కొట్టించుకున్నారు. ఇక్కడకు వరకూ బాగానే ఉంది కానీ, బికినీలు మహిళలు వేసుకోవాలా.. పురుషులు వేసుకోవచ్చా అనేది బంక్ యజమానులు స్పష్టం చేయకపోవడంతో మహిళలకు బదులు పురుషులే బికినీల్లో వచ్చారు. వీటితో పాటు హైహీల్స్ వేసుకుని కూడా ఆశ్చర్యపరిచారు.
 
టూపీస్ బికినీలు వేసుకుని వచ్చి గ్యాస్ స్టేషన్‌లోకి వెళ్లి.. ‘బికినీ వేసుకున్నా, పెట్రోల్ ప్లీజ్’ అంటూ బంక్ సిబ్బందికి షాక్ ఇచ్చారు. ఈ ఆఫర్‌తో ఏదో ఊహించుకున్న నిర్వాహకులకు ఇలా ఝలక్ వస్తుందని ఊహించకపోవడంతో కంగుతిన్నారు. అలా రావడం కూడా మంచిదే అయ్యిందంటున్నారు. లేడీస్ బికినీల్లో వస్తే దొరికే పబ్లిసిటీ కంటే మగాళ్లు ఇలా రావడంతోనే ఎక్కువగా ఫ్యామస్ అయ్యామని సంతోషపడ్డారు.