Vladimir Putin: ఉక్రెయిన్ బాంబు దాడికి గురైన వంతెనపై కారు నడుపుతూ వెళ్లిన పుతిన్.. ఉత్సాహంగా కనిపించిన రష్యా అధినేత

ఇటీవల అనారోగ్యానికి గురయ్యాడని ప్రచారం జరుగుతున్న రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ ఉత్సాహంగా కనిపించాడు. ఒక బ్రిడ్జిపై కారు నడుపుకొంటూ వెళ్లాడు. తర్వాత కొద్ది దూరం నడిచాడు.

Vladimir Putin: ఉక్రెయిన్ బాంబు దాడికి గురైన వంతెనపై కారు నడుపుతూ వెళ్లిన పుతిన్.. ఉత్సాహంగా కనిపించిన రష్యా అధినేత

Vladimir Putin: రష్యా-ఉక్రెయిన్ యుద్ధం సందర్భంగా రష్యా అధీనంలో ఉన్న క్రిమియాలోని బ్రిడ్జిపై ఉక్రెయిన్ బాంబు దాడికి పాల్పడ్డ సంగతి తెలిసిందే. ఈ బ్రిడ్జిపై తాజాగా రాష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ ప్రయాణించాడు. బ్రిడ్జిపై పుతిన్ సొంతంగా మెర్సిడెస్ కారు నడుపుకొంటూ వెళ్లారు.

Elon Musk: ఎలన్ మస్క్‌కు ఎదురుదెబ్బ.. న్యూరాలింక్ సంస్థపై అమెరికా విచారణ.. కారణమేంటి?

19 కిలోమీటర్ల పొడవు కలిగిన ఈ బ్రిడ్జి రోడ్డు, రైలు మార్గం కలిగి ఉంది. ఉక్రెయిన్ దాడిలో స్వల్పంగా దెబ్బతిన్న ఈ బ్రిడ్జిని అధికారులు ప్రస్తుతం పునరుద్ధరిస్తున్నారు. ఈ బాధ్యతల్ని డిప్యూటీ పీఎం మరాత్ ఖున్సుల్లిన్ పర్యవేక్షిస్తున్నారు. పుతిన్ పర్యటన సందర్భంగా ఆయన అక్కడే ఉన్నారు. బ్రిడ్జి పనుల్ని ఆయను పుతిన్‌కు వివరించారు. బ్రిడ్జిపై కొద్దిదూరం కారులో వెళ్లిన పుతిన్.. తర్వాత కారు దిగి నడుచుకుంటూ వెళ్లారు. ఈ సందర్భంగా అక్కడి బిల్డర్లతో మాట్లాడారు. బ్రిడ్జికి ఎడమవైపు కొద్దిగా దెబ్బతిందని, దీనికి మరమ్మతులు చేయాలని సూచించారు. బ్రిడ్జిని తిరిగి సాధారణ స్థితికి తీసుకురావాలని వారికి సూచించారు. ఈ తతంగాన్ని అక్కడి మీడియా ప్రసారం చేసింది.

PM MODI: వైఎస్.షర్మిలకు ప్రధాని మోదీ ఫోన్.. అరెస్టు వ్యవహారంపై ఆరా

మరోవైపు పుతిన్ అనారోగ్యంపై కొంతకాలంగా ప్రచారం జరుగుతున్న సంగతి తెలిసిందే. ఇటీవల ఆయన అధికారిక నివాసంలో మెట్లు దిగుతుండగా జారిపడ్డారని, దీంతో ఆయన గాయపడ్డారని ప్రచారం జరిగింది. ఈ నేపథ్యంలో తాజాగా విడుదలైన వీడియోలో పుతిన్ ఆరోగ్యంగా, ఉత్సాహంగా కనిపించారు. దీంతో పుతిన్ అనారోగ్యం విషయంలో జరుగుతున్న ప్రచారానికి చెక్ పడ్డట్లైంది.