Vladimir Putin: రష్యాలో పెరుగుతున్న ఫ్లూ.. భయంతో బంకర్లోకి వెళ్లిపోయిన పుతిన్

రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ బంకర్లోకి వెళ్లిపోయాడు. అయితే, యుద్ధ భయం వల్లో.. దాడుల వల్లో కాదు.. ఫ్లూ సోకుతుందనే ఉద్దేశంతో. రష్యాలో ఫ్లూ విజృంభిస్తుండటంతో పుతిన్ ముందు జాగ్రత్తగా ఈ పని చేశాడు.

Vladimir Putin: రష్యాలో పెరుగుతున్న ఫ్లూ.. భయంతో బంకర్లోకి వెళ్లిపోయిన పుతిన్

Vladimir Putin: రష్యాలో ఫ్లూ వైరస్ విజృంభిస్తుండటంతో అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ స్వీయ జాగ్రత్తలు తీసుకుంటున్నాడు. తనకు ఫ్లూ సోకకుండా బంకర్‌లోకి వెళ్లిపోయినట్లు సమాచారం. ఇటీవలి కాలంలో రష్యాలో ఫ్లూ సోకిన వారి సంఖ్య పెరిగిపోతోంది. పుతిన్ పక్కనే ఉండే పలువురు ఉన్నతాధికారులు, పాలక వర్గంలోని వాళ్లకు కూడా ఫ్లూ సోకింది.

Mumbai: అదృష్టమంటే అతడిడే.. బస్సు కింద పడ్డా బతికిపోయాడు.. వైరల్ వీడియో

దీంతో పుతిన్ ముందు జాగ్రత్తగా బంకర్‌లోకి వెళ్లిపోయాడని ఆయన సన్నిహితుడు, పుతిన్ అధికార ప్రతినిధి డిమిట్రీ పెస్కోవ్ తెలిపారు. కొద్ది రోజులుగా పుతిన్ బంకర్లోనే ఉంటున్నాడు. ఇప్పటికే పుతిన తన అధికారిక కార్యక్రమాల్ని రద్దు చేసుకున్నాడు. ఈ నెలలో జరగాల్సిన కీలక ప్రెస్ మీట్ కూడా క్యాన్సిల్ చేశాడు. కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న పుతిన్ తన ఆరోగ్యం విషయంలో చాలా జాగ్రత్తలు తీసుకుంటాడు.

దీనిలో భాగంగా పుతిన్ బంకర్లోకి వెళ్లాడని ఆయన సన్నిహితులు చెబుతున్నారు. కాగా, ఈ ఏడాది కొత్త సంవత్సర వేడుకల్ని కూడా పుతిన్ బంకర్లోనే జరపుకోవాలని ఆలోచిస్తున్నాడు. ఆయన సన్నిహితులు, కుటుంబ సభ్యులు ఈ వేడుకల్లో పాల్గొనబోతున్నారు.