Russian Soldiers: కుక్కలను ఆహారంగా తింటున్న రష్యా సైనికులు.. రేడియోనే సాక్ష్యం

యుక్రెయిన్‌లో నెల రోజులకు పైగా దాడులు జరుపుతున్న రష్యా బలగాల చేష్టలకు ప్రజలు భయాందోళనకు గురవుతున్నారు. చివరికి రోడ్ల మీద తిరిగే కుక్కలను కూడా చంపుకు తింటూ క్రూరంగా ప్రవర్తిస్తున్నా

Russian Soldiers: కుక్కలను ఆహారంగా తింటున్న రష్యా సైనికులు.. రేడియోనే సాక్ష్యం

Russain Soldiers

Russian Soldiers: యుక్రెయిన్‌లో నెల రోజులకు పైగా దాడులు జరుపుతున్న రష్యా బలగాల చేష్టలకు ప్రజలు భయాందోళనకు గురవుతున్నారు. చివరికి రోడ్ల మీద తిరిగే కుక్కలను కూడా చంపుకు తింటూ క్రూరంగా ప్రవర్తిస్తున్నారు. యుక్రెనియన్ సెక్యూరిటీ సర్వీస్ (SSU) నుంచి దొరికిన ఆడియోలో రష్యా సైనికులు వారి సొంత భాషలో ఈ సంగతుల పట్ల మాట్లాడుకుంటున్నట్లు తెలిసింది.

ఇక్కడ మూడు ట్యాంకులున్నాయని ఒక వ్యక్తి అంటున్నాడు.

“వాళ్లు అమ్మాయిని రేప్ చేశారు” చేసిందెవరు అని యువతి ప్రశ్నించగా.. 16ఏళ్ల వరకూ ఉండొచ్చని ఇంకొకరు అంటున్నారు. మహిళ మాటలను బట్టి చూస్తే ఆమె కూడా రష్యా వాసి లాగే కనిపిస్తుంది.

మరో ఆడియో క్లిప్ లో మీకు తినడానికి ఏమైనా దొరుకుతుందా అని ఒకతను అడగ్గా.. ఏదో తింటున్నాం. నిన్న కుక్క మాంసం తిన్నామని చెప్పాడు. నిజంగా కుక్కలు తింటున్నారా అని గుచ్చి గుచ్చి అడిగేసరికి అవును మాకు మాంసాహారం తినాలనిపించి అలా చేశామని సైనికులు బదులిచ్చారు.

Read Also : యుక్రెయిన్ మహిళపై రష్యా సైన్యం అత్యాచారం

తమ వద్ద ఉన్న ఆహారం తినడానికి సిద్ధంగా ఉన్నా.. అవి తిని అనారోగ్యానికి గురవుతున్నట్లు వేరే సైనికుడు వివరించాడు. కోడి, బాతులు లాంటి వాటిని కావాలనే లేకుండా చేశారని వెల్లడించాడు.

సైనికులతో జరుపుతున్న కమ్యూనికేషన్ ప్రాసెస్ లు, చాట్ బాట్ లు, మెసేంజర్, ఈమెయిల్ ల ఆధారంగా యుద్ధ నేరాలపై వాస్తవాలను సేకరిస్తుంది రష్యన్ రేడియో.