Russian Traffic Cop: ట్రాఫిక్ పోలీసుకు విలాసవంతమైన ఇల్లు.. బంగారపు టాయిలెట్

ట్రాఫిక్ పోలీస్ పై వచ్చిన ఆరోపణలపై జరిపిన విచారణలో విస్తుపోయే నిజాలు బయటికొచ్చాయి. అవినీతిని కప్పి పుచ్చుకునేందుకు టాయ్‌లెట్ ను బంగారంతో కట్టించిన వ్యక్తి బండారం బయటపడింది.

Russian Traffic Cop: ట్రాఫిక్ పోలీసుకు విలాసవంతమైన ఇల్లు.. బంగారపు టాయిలెట్

Traffic Cop

Russian Traffic Cop: ట్రాఫిక్ పోలీస్ పై వచ్చిన ఆరోపణలపై జరిపిన విచారణలో విస్తుపోయే నిజాలు బయటికొచ్చాయి. అవినీతిని కప్పి పుచ్చుకునేందుకు టాయ్‌లెట్ ను బంగారంతో కట్టించిన వ్యక్తి బండారం బయటపడింది. రష్యాలోని దక్షిణ స్టావ్‌రోపోల్ ప్రాంతంలో కల్ అలెక్సీ సఫోనోవ్.. అనే ట్రాఫిక్ పోలీసు అధికారి వ్యాపారాలకు నకిలీ అనుమతులు జారీ చేసేందుకు గానూ లంచాలు తీసుకుంటున్నాడంటూ ఆరోపణలు వచ్చాయి.

విచారణ చేపట్టిన అధికారులు అతడితో పాటు మరో 35 మంది కలిసి ‘మాఫియా ముఠా’ నడుపుతున్నట్లు గుర్తించారు. అతని ఇంటికి సంబంధించిన ఫోటోలు, సీసీ ఫుటేజ్‌ వీడియో లీక్‌ అవడంతో అనుమానం వచ్చింది. అందులో పెద్ద భవనంలో విలాసవంతమైన గదులు, ఖరీదైన వస్తువులతో అలంకరణలు, బిలియార్డ్స్ హాల్, బంగారు బిడెట్, సింక్‌, బంగారు టాయిలెట్ ఉన్నాయి. ప్రస్తుతం ఈ వీడియో సోషల్‌ వీడియాలో తెగ వైరల్ అవుతోంది.


అన్నింటిలోనూ అవినీతే..

కొన్ని సంవత్సరాలుగా అవినీతికి పాల్పడుతూ ఉన్నాడు. బ్లాక్ మార్కెట్‌ నెంబర్ ప్లేట్లు, కార్గో పర్మిట్‌ల నుంచి ఇసుక డెలివరీల వరకూ అన్నింటిలోనూ అదే తరహా అవినీతి. దీనికి సంబంధించి 35 మందికి పైగా ట్రాఫిక్‌ అధికారులను అదుపులోకి తీసుకున్నట్లు యునైటెడ్‌ రష్యా పార్టీలోని ఎంపీ అలెగ్జాండర్ ఖిన్షెయిన్ అన్నారు. ఈ ముఠా 2 లక్షల 55 వేల డాలర్లు దోచుకున్నట్లు సమాచారం. ఇక సఫోనోవ్‌ దోషిగా తేలితే 8 నుంచి 15 ఏళ్ల జైలు శిక్ష అనుభవించాల్సి ఉంటుంది.