Ukrain: కొన్ని నెల‌ల త‌ర్వాత తొలిసారి రష్యా-ఉక్రెయిన్ మిల‌ట‌రీ అధికారుల చ‌ర్చ‌లు

రష్యా-ఉక్రెయిన్ మిల‌ట‌రీ అధికారులు కొన్ని నెల‌ల త‌ర్వాత మ‌ళ్ళీ నేరుగా చ‌ర్చ‌లు జ‌రిపారు. న‌ల్ల స‌ముద్రం ద్వారా ఉక్రెయిన్ నుంచి ధాన్యాన్ని ప్ర‌పంచ మార్కెట్‌కు ఎగుమ‌తి చేసేందుకు ఐక్య‌రాజ్య స‌మితి ప్ర‌ణాళిక వేసుకుంది. అందుకు స‌హ‌క‌రించడానికి ఐక్య‌రాజ్య‌స‌మితి, ట‌ర్కీ ప్ర‌తినిధుల‌తో క‌లిసి ర‌ష్యా, ఉక్రెయిన్ అధికారులు పాల్గొన్నారు.

Ukrain: కొన్ని నెల‌ల త‌ర్వాత తొలిసారి రష్యా-ఉక్రెయిన్ మిల‌ట‌రీ అధికారుల చ‌ర్చ‌లు

Russia Ukraine War

Ukrain: రష్యా-ఉక్రెయిన్ మిల‌ట‌రీ అధికారులు కొన్ని నెల‌ల త‌ర్వాత మ‌ళ్ళీ నేరుగా చ‌ర్చ‌లు జ‌రిపారు. న‌ల్ల స‌ముద్రం ద్వారా ఉక్రెయిన్ నుంచి ధాన్యాన్ని ప్ర‌పంచ మార్కెట్‌కు ఎగుమ‌తి చేసేందుకు ఐక్య‌రాజ్య స‌మితి ప్ర‌ణాళిక వేసుకుంది. అందుకు స‌హ‌క‌రించడానికి ఐక్య‌రాజ్య‌ స‌మితి, ట‌ర్కీ ప్ర‌తినిధుల‌తో క‌లిసి ర‌ష్యా, ఉక్రెయిన్ అధికారులు చర్చల్లో పాల్గొన్నారు. ట‌ర్కీలోని ఇస్తాంబుల్ వేదిక‌గా ఈ చర్చ‌లు జ‌రిగాయి. ఉక్రెయిన్ నుంచి ధాన్యాన్ని ప్ర‌పంచ మార్కెట్‌కు ఎగుమ‌తి చేసే ప్ర‌క్రియ‌కు అనుమ‌తించేందుకు ర‌ష్యా-ఉక్రెయిన్ నిర్ణ‌యాలు తీసుకోవాల్సి ఉంది.

Afghan girls: తాలిబన్ల పాలనలో అగమ్యగోచరంగా అఫ్గాన్ బాలికల పరిస్థితి

కాగా, ఉక్రెయిన్‌పై ర‌ష్యా యుద్ధాన్ని కొన‌సాగిస్తోంది. ఇప్ప‌టికే ప‌లు ప్రాంతాల‌పై ప‌ట్టు సాధించింది ర‌ష్యా. అమెరికా స‌హా ప‌లు దేశాల సాయంతో ర‌ష్యాను ఉక్రెయిన్ నిలువ‌రించ‌గ‌లుగుతుంది. న‌ల్ల స‌ముద్రం ద్వారా ఉక్రెయిన్ నుంచి ధాన్యాన్ని త‌ర‌లించే విష‌యంలో యుద్ధం వ‌ల్ల స‌మ‌స్య‌లు ఏర్ప‌డుతున్నాయి. వాటిని ప‌రిష్క‌రించ‌డానికి ఐక్య‌రాజ్య స‌మితి చాలా రోజులుగా ప్ర‌య‌త్నాలు కొసాగిస్తోంది.