2036 వరకు ఆయనే దేశాధ్యక్షుడు

  • Published By: madhu ,Published On : July 2, 2020 / 11:08 AM IST
2036 వరకు ఆయనే దేశాధ్యక్షుడు

అవును మీరు వింటున్నది నిజమే. ఆయన 2036 వరకు ఆ దేశానికి అధ్యక్షుడుగా కొనసాగనున్నారు. ఇందుకు అక్కడి రాజ్యాంగ సవరణ కూడా చేసేశారు. దీనికి అక్కడి ప్రజల ఆమోదం కూడా లభించేసింది. దీంతో 2036 వరకు ఆయన దేశాధ్యక్షుడిగా కొనసాగనున్నారు. ఇంతకు ఏ దేశమనేది చెప్పలేదు కదా..అదే రష్యా. ప్రస్తుతం అధ్యక్షుడు వ్లాదిమర్ పుతిన్ కొనసాగేలా రాజ్యంగ సవరణ చేశారు.

మరో 16 ఏళ్ల పాటు ఆదేశ అధ్యక్షుడిగా కొనసాగనున్నారు. సుదీర్ఘకాలం పాటు రష్యా అధ్యక్షుడిగా కొనసాగనున్నారు పుతిన్. 2000 సంవత్సరం నుంచి రష్యా అధ్యక్షుడిగా లేదా ప్రధానిగా ఏదో ఓ పదవిలో కొనసాగుతూ వస్తున్నారు పుతిన్.. ప్రస్తుతం ఆయన అధ్యక్షుడిగా ఉండగా.. పదవీకాలం 2024లో ముగియనుంది.

రాజ్యాంగ సవరణతో పుతిన్ 2036 వరకు రష్యా అధ్యక్షుడి పదవిలో కొనసాగుతారు. దీనిపై ప్రజాభిప్రాయ సేకరణ ఎన్నికలు జరిపారు. ఇవి…2020, జులై 01వ తేదీ బుధవారంతో ముగిశాయి. 60 శాతం మంది ఓటు హక్కును వినియోగించుకున్నారు. అనుకూలంగా..76.9 శాతం మంది ఓటు వేసినట్లు ప్రాథమిక ఫలితాలు చెబుతున్నాయని కేంద్ర ఎన్నికల సంఘం వెల్లడిస్తోంది.

Read:భారత్‍పై పాకిస్తాన్ భారీ కుట్ర, ఎల్‌వోసీ వెంట చైనాకు మద్దతుగా 20వేల మంది సైనికులు మోహరింపు