OMG వీడియో : బీట్ రూట్ రంగులో మారిపోయిన నది…!!

  • Published By: Chandu 10tv ,Published On : November 10, 2020 / 01:22 PM IST
OMG వీడియో :  బీట్ రూట్ రంగులో మారిపోయిన నది…!!

River water turns beetroot red colour : సాధారణంగా నది నీళ్లు తెలుపు రంగులో ఉంటాయి. కానీ నది నీళ్లు ఎరుపు రంగులో ఉండటం ఎప్పుడైనా ఎక్కడైనా చూశారా? లేదనే అంటాం కదూ..కానీ నదినీళ్లు రంగు మారాయి అంటే అది కాలుష్యం అయి ఉండవచ్చు. అదే జరిగింది ఓ ప్రాంతంలోని నదిలో.రష్యాలోని ఓనదిలోని స్వచ్ఛమైన నీరు బీట్ రూట్ ఎరుపు రంగులోకి మారటం ఆందోళన కలిగిస్తోంది.ఇది స్థానిక ప్రజల ఆరోగ్యానికి ప్రమాదంగా మారటంతో నిపుణులు ఆందోళన వ్యక్తంచేస్తున్నారు.

రష్యాలోని ఇష్కిటింకా నదిలో నీళ్లు బీట్ రూట్ రంగులోకి మారింది. ఏదో విషపూరిత వాయువు నదిలోకి ప్రవేశించటం వల్ల నీరు నీలి రంగు నుంచి బీట్ రూట్ రంగులోకి మారిందని ఓ స్థానిక మీడియా చెబుతోంది.




నదిలోని నీరు ఇలా రంగు మారిపోయి కనిపిస్తుండటంతో అక్కడి స్థానికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఈవిధంగా నీళ్లు రంగుమారి కనిపిస్తుండటంతో కిమెరోవో పారిశ్రామిక ప్రాంతంవాసులు ఆశ్చర్యపోతున్నారు. నది నీరు రంగుమారటానికి కారణమైన రసాయనాల గురించి అధికారులు పరిశోధనలు చేస్తున్నారు. మరోవైపు బీట్‌ రూట్‌ రంగులో మారిన ఈ ఇస్కిటిమ్కా నది ఫోటోలు, వీడియోలు సోషల్‌ మీడియాలో వైరల్‌ గా మారాయి.




https://10tv.in/rare-yellow-turtle-found-in-west-bengal-phots-viral/
కెమెరోవో డిప్యూటీ గవర్నర్ ఆండ్రియా పానోవో మాట్లాడుతూ…నది రంగులు మారడానికి కారణమైన కాలుష్యాల గురించి తెలుసుకోవాలని అధికారులను ఆదేశించారు. ఈ నది ఇలా మారటానికి గల కారకులను గుర్తించి వారిపట్ల చట్టపరమైన చర్యలు తీసుకుంటామని ఆయన అన్నారు.కానీ నదిలో సంచరించే బాతులు వంటి ఇతర పక్షిజాతులు అన్నీ సురక్షితంగానే ఉన్నాయని తెలిపారు.



ఈ విషయం పై స్థానికులు స్పందిస్తూ.. ఇది ప్రస్తుతం నదిలా లేదని, క్రాన్ బెర్రి జెల్లిగా కనిపిస్తుందని..ఈ నదిని ఇలా ఎప్పుడూ చూడలేదని తెలిపారు. ఇలా ఇష్కిటింకా నదియే కాకుండా, పశ్చిమ రష్యాలోని నారో-ఫోమిన్స్క్ లోని మరో నది కూడా ఎర్రగా మారటం విశేషం. నదీ ప్రాంతాల్లో ఉండే పరిశ్రమల నుంచి వెలువడే రసాయనాల వల్లే నదులు కలుషితమై, నీళ్లు ఎర్రగా మారాయని తెలుస్తోంది.