Russia-Ukraine War: రష్యా సరికొత్త వ్యూహం.. యుక్రెయిన్‌పైకి డాల్ఫీన్ ఆర్మీ

రెండు నెలలకుపైగా ప్రపంచాన్ని వణికిస్తూ.. ప్రజలందరి జీవనంపై ప్రభావం చూపిన రష్యా యుక్రెయిన్ యుద్ధం ముగిసిందన్న వార్త ఎప్పుడు వింటామా అని అందరూ ఆతృతగా గమనిస్తోంటే..

Russia-Ukraine War: రష్యా సరికొత్త వ్యూహం.. యుక్రెయిన్‌పైకి డాల్ఫీన్ ఆర్మీ

Russia Ukraine War

Russia-Ukraine War: రెండు నెలలకుపైగా ప్రపంచాన్ని వణికిస్తూ.. ప్రజలందరి జీవనంపై ప్రభావం చూపిన రష్యా యుక్రెయిన్ యుద్ధం ముగిసిందన్న వార్త ఎప్పుడు వింటామా అని అందరూ ఆతృతగా గమనిస్తోంటే.. అటు రష్యా, ఇటు యుక్రెయిన్ మాత్రం.. యుద్ధాన్ని ఎంత సాగదీద్దామా అన్న తరహాలో ముందుకుపోతున్నాయి. భారీ ప్రాణనష్టాన్ని, ఆర్థిక నష్టాన్ని లెక్కచేయకుండా యుద్ధాన్ని కొనసాగిస్తున్నాయి. ఇరుగు పొరుగు దేశాలు కొన్ని ఆయా దేశాలకు సహకరిస్తూ తమ ఉనికిని చాటుకోవాలని చూస్తున్నాయి.

Russia-Ukraine War : రష్యా సైనిక దాడితో.. నిరాశ్రయులుగా మారిన 4.8 మిలియన్ ఉక్రెయిన్ చిన్నారులు

రష్యాపై కోపంతో తమ ప్రభావాన్ని చాటాలన్న ఉద్దేశంతో అమెరికా సహా ఇతర దేశాలు ఆయుధాలు అందిస్తూ యుక్రెయిన్‌ను వీలయినంతగా ఎగదోస్తున్నాయి. ఫిబ్రవరి 24న యుక్రెయిన్‌పై పుతిన్ యుద్ధం ప్రకటించిన సమయంలో యుద్దం ఇంత సుదీర్ఘంగా జరుగుతుందని ఎవరూ భావించలేదు. రెండు, మూడు రోజుల్లో యుక్రెయిన్ ను రష్యా ఆక్రమించుకుంటుందని అంతా అనుకున్నా.. యుక్రెయిన్ అధ్యక్షుడు జెలన్‌స్కీ.. ఆ దేశ పౌరులు రష్యా బలగాలను.. ప్రపంచం ఊహించని స్థాయిలో ప్రతిఘటిస్తుండడంతో ఇది ఇంకా ఇంకా సాగుతూనే ఉంది.

Russia-Ukraine war: రష్యాకు భారీ షాక్.. హ్యూమన్‌ రైట్స్‌ కౌన్సిల్‌ నుంచి తొలగించిన ఐరాస

యుక్రెయిన్ పై ఎలాగైనా పై చేయి సాధించాలని చూస్తున్న రష్యా ఇప్పటికే హద్దులు మించి చెలరేగిపోతుంది. యుద్ధ నియమాలను ఎప్పుడో పక్కకి పెట్టిన రష్యా విజయం కోసమే పరితపిస్తుంది. యుద్ధంలో ఎలాగైనా గెలవాలని చూస్తున్న రష్యా ఇప్పుడు మరో సరికొత్త వ్యూహానికి తెరతీసినట్లు తెలుస్తుంది. ఇందులో భాగంగా డాల్ఫీన్ లకు శిక్షణ ఇచ్చి డాల్ఫీన్ ఆర్మీని రంగంలోకి దింపినట్లు తెలుస్తుంది. నల్ల సముద్రంలోని రష్యా నావికా స్థావర రక్షణ కోసం వీటిని మోహరించినట్లు తెలుస్తుంది. నీటి అడుగున జరిగే దాడులను ముందుగానే పసిగట్టేందుకు డాల్ఫీన్ ఆర్మీని వినియోగిస్తున్నట్లు తెలుస్తుంది.