పిల్లాడికి దారుణ శిక్ష : విత్తనాలపై కూర్చోబెట్టంతో మోకాళ్లలోంచి మొలకలొచ్చాయి

  • Published By: veegamteam ,Published On : December 17, 2019 / 09:16 AM IST
పిల్లాడికి దారుణ శిక్ష : విత్తనాలపై కూర్చోబెట్టంతో మోకాళ్లలోంచి మొలకలొచ్చాయి

పిల్లాడు స్నేహితులతో ఆడుకుంటూ ఇంటికి లేట్‌గా వస్తే ఏం చేస్తాం..తిడతాం..లేదా రెండు దెబ్బలేస్తాం..కానీ ఆ పిల్లాడి తల్లిదండ్రులు విధించిన శిక్ష గురించి తెలిస్తే వీళ్లసలు మనిషులేనా అనిపిస్తుంది. ఇంటికి లేట్ గా వచ్చాడనే కోపంతో కొచ్చిన పిల్లాడిని పెంపుడు తండ్రి సార్జే కాజకోవ్ (35) బాగా కొట్టాడు. అక్కడితో ఊరుకోలేదు..నేలపై బక్‌వీట్ విత్తనాలు (గోధుమల్లా ఉంటాయి) పోసి..వాటిపై పిల్లాడిని మోకాళ్లపై కూర్చోబెట్టాడు. కదిలితే కాళ్లు విరగ్గొడతానని హుకంరించాడు.

అలా ఏకంగా 9గంటలు పాటు కదలకుండా అలాగే కూర్చోబెట్టాడు. దీంతో పిల్లాడి మోకాళ్లపై చర్మం తెగిపోయింది. రక్తం కారిపోయింది. ఎంతగా అంటే..ఆ పిల్లాడి శరీరంలోకి బక్ వీట్ విత్తనాలు వెళ్లిపోయాయి. ఏకంగా తొమ్మిది గంటలపాటు అలా పిల్లాడి రక్తంలో నానిన బక్ వీట్ విత్తనాలు మొలకలు కూడా వచ్చేశాయి…!! అంటే ఆ పిల్లాడి ఎంతగా బాధ పడ్డాడో ఊహించుకోవచ్చు. 

రక్తంతో మొలకెత్తిన విత్తనాలతో పిల్లాడు కనీసం లేచి నిలబడలేకపోయాడు. ఏడుస్తూ అలాగే ఉండిపోయాడు. కాసేపటికి తండ్రి కాస్త పక్కకు వెళ్లేసరికి ఏమైతే అది అయ్యిందని పైకి లేచిన ఆ పిల్లాడు.. పక్కింటికెళ్లి ఏడుస్తూ ప్లీజ్..హెల్ప్ మీ అంటూ ప్రాధేయపడ్డాడు.

పిల్లాడి కాళ్లలో మొలకెత్తిన విత్తనాలను చూసి పక్కింటివాళ్లు షాకయ్యారు. వెంటనే పోలీసులకు ఫోన్ చేశారు. పిల్లాడిని ఆస్పత్రికి తీసుకెళ్లారు. మత్తుమందిచ్చి పిల్లాడి మోకాళ్లలోని గింజలను డాక్టర్లు సర్జరీతో తీసివేశారు. తండ్రి సార్జే కాజకోజ్ ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఇక్కడ గమనించాల్సిన విషయం ఏమిటంటే..పిల్లాడిని భర్త అలా చేస్తుంటే అడ్డుకోవాల్సి తల్లి అలీనా యుమషేవ(27) భర్తకు వంత పాడింది. ఇది తెలిసి పోలీసులు కూడా షాకయ్యారు. 

దీనిని ఆమె చెప్పిన సమాధానం విని పోలీసులకు దిమ్మ తిరిగిపోయింది. తను..తన భర్త సార్జే ఆన్‌లైన్లో సెర్చ్ చేసి..ఈ పద్ధతి గురించి తెలుసుకున్నామనీ..గింజలపై కూర్చుంటే నొప్పీ ఉండదని చెప్పింది. అందుకే తను దానికి  ఒప్పుకున్నానని కాకమ్మ కథలు చెప్పింది. వీళ్లసలు మనుషులేనా అనుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకుని సార్జేను అదుపులోకి తీసుకుని..అలీనాను తీవ్రంగా మందలించి వదిలేశారు.

ఆస్పత్రి నుంచి డిశ్చార్జ్ అయిన పిల్లాడిని తల్లి వద్దకు పంపిస్తామని పోలీసులు అంటుంటే దయచేసిన నన్ను ఇంటికి పంపిచొద్దనీ..మా అమ్మ నన్ను ఏమైనా చేస్తుందేమోనని భయపడిపోయాడు పాపం ఆ చిన్నారి. కానీ అలీనాను తీవ్రంగా హెచ్చరించి పిల్లాడిని తల్లి దగ్గరకు పంపారు. పిల్లాడికి మరోసారి ఏమైనా అయితే నిన్ను కూడా లోపలేస్తామని హెచ్చరించారు.