మిస్టరీ : బీచ్‌లో నరికిన మనిషి కాళ్లు కొట్టుకొస్తున్నాయ్

  • Published By: veegamteam ,Published On : March 22, 2019 / 11:11 AM IST
మిస్టరీ : బీచ్‌లో నరికిన మనిషి కాళ్లు కొట్టుకొస్తున్నాయ్

నరికేసిన మనిషి కాళ్లు కొట్టుకొస్తున్న బీచ్. శతాబ్దాలుగా కొనసాగుతున్న ఈ మారణ కాండకు సంబంధించిన మిస్టరీని పోలీసులు ఛేదించ లేకపోతున్నారు. కెనడాలోని బ్రిటీష్ కొలంబియా-అమెరికాలోని వాషింగ్టన్ మధ్య సలిష్ సముద్రంలో జరుగుతున్న ఈ దారుణ పరిస్థితులకు  అక్కడ ‘అడుగు’ పెట్టాలంటేనే ప్రజలు హడలిపోతున్నారు. తీరానికి కొట్టుకొస్తున్న ఆ కాళ్ల మిస్టరీ ఏంటీ..దాన్ని  పోలీసులు ఎందుకు  ఛేదించలేకపోతున్నారు?
Read Also : చెన్నైలో కలకలం : శ్రీరెడ్డిపై తమిళ నిర్మాత దాడి

 2018 జనవరి 1న జెట్టీ ఐల్యాండ్‌ తీరానికి ఓ షూ తో పాటు మనిషి పాదం కొట్టుకొచ్చింది. దాన్ని చూసిన స్థానికులు తీవ్ర భయాందోళనకు గురయ్యారు. దాన్ని స్వాధీనం చేసుకున్న పోలీసులు డీఎన్‌ఏ పరీక్షలు నిర్వహించారు. 2016, డిసెంబరు 12 నుంచి ఆచూకీలేని ఆంటోనియో నిల్‌ అనే వ్యక్తిదని తెలిసింది. సలిష్ సముద్రంలో తొలి ఘటన 1887లో చోటుచేసుకుంది. తరువాత 1914లో మరో పాదం కూడా అలాగే దొరికింది. ఆ తరువాత అటువంటి ఘటనలేవీ జరగలేదు. కానీ 2007 నుంచి మనుషుల కాళ్లు..పాదాలు కొట్టుకురావటం జరుగుతోంది. సలిష్ సముద్ర తీరాన్ని ఆనుకుని ఉన్న ప్రాంతాలకు ఆ కాళ్లు కొట్టుకొస్తున్నాయి. ఇలా ఇప్పటి వరకూ 21 కాళ్లు కొట్టుకొచ్చాయి.  

లెక్కల ప్రకారంగా చూస్తే..
2007లో రెండు, 2008లో ఐదు, 2009లో ఒకటి, 2010లో రెండు, 2011లో మూడు, 2012లో ఒకటి, 2014లో ఒకటి, 2016లో రెండు, 2017లో ఒకటి, 2018లో రెండు, 2019లో ఒకటి చొప్పున కాళ్లు, పాదాలు కొట్టుకువచ్చాయి. దీంతో ఆ తీర ప్రాంతాలను ఆనుకుని ఉన్న పరిసర ప్రాంతాల్లో ఏం జరుగుతుందో తెలియక ప్రజలు బిక్కుబిక్కుమంటూ జీవితాలను వెళ్లదీస్తున్నారు. పోలీసులు ఆ తీర ప్రాంతాలపై నిఘా పెట్టిన ఫలితం లేదు. దీనికి సంబంధించిన బాధితుల ఆచూకీ కూడా అంతపట్టటంలేదు. ఇక్కడ గమనించాల్సిన విషయం ఏంటంటే బీచ్ లకు చేరుకుంటున్న అన్ని కాళ్లకు షూలు ఉండటం. 
Read Also : చంద్రబాబు సరికొత్త స్లోగన్ : టీడీపీకి ఓటు వేస్తే గెలుపు ప్రజలదే అట

దీనిపై పోలీసులు వివరణ ఇస్తూ సలిష్ సముద్రంలో ఆత్మహత్య చేసుకునేవారు..వివిధ ప్రమాదాల్లో మరణించేవారి పాదాలు తీరానికి కొట్టుకొస్తున్నాయేనని అనుమానాలు వ్యక్తంచేస్తున్నారు.కానీ  శరీరాలు కాకుండా కేవలం పాదాలు.. కాళ్లు మాత్రమే ఎందుకు కొట్టుకొస్తున్నాయనే విషయానికి మాత్రం వారి వద్ద సమాధానం లేదు. సెంటర్ ఫర్ ఫోరెన్సిక్ రీసెర్చ్‌ కో-డైరెక్టర్ గెయిల్ అండర్సన్ ఈ అంశంపై స్పందిస్తూ.. ‘‘నీళ్లలో ఉండే శరీరాల్లో కాళ్లు, చేతుల భాగాలు సున్నితంగా ఉంటాయనీ..పాదాలకు షూలు ధరించడం వల్ల అవి ఎక్కువగా ప్రవాహానికి కొట్టుకొచ్చే అవకాశాలుంటాయనీ..అందుకే షూలతో సహా కాళ్లు, లేదా పాదాలు శరీరం నుంచి వేరైపోతాయనీ. తెలిపారు. సముద్రంలో ఉండే జీవుల దాడి వల్ల కూడా పాదాలు ఊడిపోయే అవకాశాలున్నాయనీ..సలిష్ తీరానికి కొట్టుకొచ్చిన అన్ని కాళ్లకు షూలు ఉండటాన్ని  గమనిస్తే ఈ విషయం తెలుస్తుందన్నారు. కానీ కనీసం  చనిపోయివారు ఎవరు? ఏ ప్రాంతానికి చెందినవారనే వివరాలు మాత్రం ఇప్పటికే అంతుచిక్కని మిస్టరీగానే ఉండిపోయాయి.