Salt Bae Restaurant Bill : వామ్మో.. భోజనం పెట్టారా? బంగారం పెట్టారా? ఆ రెస్టారెంట్‌లో ఫుడ్ బిల్లు రూ.1.36 కోట్లు

ఆ రెస్టారెంట్ లో భోజనం చేసిన ఓ కస్టమర్ కు వచ్చిన బిల్లు ఎంతో తెలిస్తే మూర్ఛపోవాల్సిందే. ఇంతకీ ఆ బిల్లు ఎంతో తెలుసా.. అక్షరాల రూ.1.36 కోట్లు. ఏంటి షాక్ అయ్యారా? నమ్మబుద్ధి కావడం లేదా? కానీ, ఇది నిజమండీ బాబూ.

Salt Bae Restaurant Bill : వామ్మో.. భోజనం పెట్టారా? బంగారం పెట్టారా? ఆ రెస్టారెంట్‌లో ఫుడ్ బిల్లు రూ.1.36 కోట్లు

Salt Bae Restaurant Bill : ఏదైనా రెస్టారెంట్ కి వెళ్లి ఫుల్లుగా తింటే.. బిల్లు ఎంతొస్తుంది? మహా అంటే వేలల్లో రావొచ్చు. లేదంటే ఫ్రెండ్స్ తో కలిసి రెస్టారెంట్ లో పార్టీ చేసుకుని ఫుల్ గా ఎంజాయ్ చేస్తే బిల్లు ఎంతరావొచ్చు. లక్షల్లో రావొచ్చు. ఇది కామన్. ఇందులో పెద్దగా ఆశ్చర్యపోవాల్సిన పని లేదు.

కానీ, ఆ రెస్టారెంట్ లో భోజనం చేసిన ఓ కస్టమర్ కు వచ్చిన బిల్లు ఎంతో తెలిస్తే మూర్ఛపోవాల్సిందే. ఇంతకీ ఆ బిల్లు ఎంతో తెలుసా.. అక్షరాల రూ.1.36 కోట్లు. ఏంటి షాక్ అయ్యారా? నమ్మబుద్ధి కావడం లేదా? కానీ, ఇది నిజమండీ బాబూ. అబుదాబిలోని ఫేమస్ రెస్టారెంట్ ‘సాల్ట్ బే’ లో ఓ కస్టమర్ కు ఇంత బిల్లు వచ్చింది.

ఈ బిల్లును రెస్టారెంట్ ఓనర్, వరల్డ్ క్లాస్ ఫేమస్ చెఫ్ నుస్రత్ గోక్సే.. సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. ‘నాణ్యత ఎప్పుడూ ఖరీదైనది కాదు’ అనే క్యాప్షన్ కూడా జత చేశారు. దీంతో ఈ బిల్లు తాలూకు పోస్ట్ నెట్టింట వైరల్ గా మారింది. బిల్లు చూసి అంతా విస్తుపోతున్నారు.

కాగా, ఇంత బిల్లు అవ్వడానికి కస్టమర్ ఏమైనా బంగారం ఆర్డర్ చేశాడా? అనే డౌట్ రావొచ్చు. నిజమే, అలాంటి సందేహం రావడంలో తప్పు లేదు. మ్యాటర్ ఏంటంటే.. అందులో వడ్డించిన ఐటెమ్స్ చాలా కాస్ట్ లీ మరి.

10TV LIVE : నాన్ స్టాప్ న్యూస్ అప్‌డేట్స్ కోసం 10TV చూడండి.

కస్టమర్ ఆర్డర్ చేసిన వాటిలో చాలా ఖరీదైన ఐటమ్స్ ఉన్నాయి. అందులో ఐదు బాటిళ్ల పెట్రస్ ఉంది. దీని విలువ రూ.72.13 లక్షలు. అలాగే 2009కి చెందిన మరో రెండు బాటిళ్ల పెట్రస్ కూడా ఉంది. దీని ఖరీదు రూ.44.38 లక్షలు. ఇక బిల్లు తాలూకు వ్యాట్ రూ.6.40 లక్షలు. ఇక అందులో 24 క్యారెట్ బంగారం కోటింగ్ తో కూడిన ఓ ఐటెమ్ కూడా ఉంది.

వీటితో పాటు ఇంకా కొన్ని ఖరీదైన ఫుడ్ ఐటెంలతో కలిసి బిల్లు మొత్తంగా రూ.1.36 కోట్లు అయింది. అంత బిల్లు అయినా.. కస్టమర్ హ్యాపీగా పే చేసి వెళ్లాడట. మొత్తం 14 మంది వ్యక్తులు రెస్టారెంట్ కు వచ్చారు. ఫుల్లుగా తినేసి, తాగేసి వెళ్లారట.

ఇకపోతే.. ‘సాల్ట్ బే’ రెస్టారెంట్ వరల్డ్ క్లాస్ చెఫ్ నుస్రత్ గోక్సేది. మాంసాన్ని కట్ చేసే ప్రత్యేకమైన శైలితో పాటు ఆహార పదార్థాలపై అతడు ఉప్పు వేసే ఓ వెరైటీ సిగ్నేచర్ తో నుస్రత్ ఎంతో ఫేమస్ అయ్యాడు. ప్రత్యేకమైన మేనరిజంతో గుర్తింపు పొందాడు. ఈ టర్కిష్ చెఫ్ కు ప్రస్తుతం ఏడు దేశాల్లో లగ్జరీ స్టీక్ హౌస్ లు ఉన్నాయి.

ఈ బిల్లుపై సోషల్ మీడియాలో నెటిజన్ల నుంచి భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. కొందరు.. అంత బిల్లు రావడాన్ని సమర్థిస్తే మరికొందరు తప్పు పడుతున్నారు. విలాసాల పేరుతో డబ్బు తగలేస్తున్నారని మండిపడుతున్నారు. ఆ డబ్బుతో ఓ ఊరి ప్రజల ఆకలి తీర్చవచ్చని అంటున్నారు. ఆర్బాటాల పేరుతో అనవసరంగా డబ్బుని వృథా చేస్తున్నారని వాపోయారు.