లాహోర్‌లో ఇండియన్ ప్యాసింజర్స్ : సంఝౌతా ఎక్స్‌ప్రెస్ నిలిపివేత

  • Edited By: madhu , February 28, 2019 / 06:36 AM IST
లాహోర్‌లో ఇండియన్ ప్యాసింజర్స్ : సంఝౌతా ఎక్స్‌ప్రెస్ నిలిపివేత

భారత్ – ఇండియా మధ్య నెలకొన్న ఉద్రిక్త పరిస్థితుల నేపథ్యంలో ఇరు దేశాలు పలు కీలక నిర్ణయాలు తీసుకుంటున్నాయి. పాక్ సంఝౌతా ఎక్స్ ప్రెస్ సేవలను నిలిపివేసింది. ఫిబ్రవరి 28వ తేదీ బుధవారం ఈ విషయాన్ని అక్కడి ప్రభుత్వం ప్రకటించింది. దీనితో పాక్ నుండి రావాల్సిన ఇండియన్ ప్యాసింజర్స్ లాహర్‌ స్టేషన్‌లో ఇరుక్కపోయారు. వీరిని ఇతర మార్గాల ద్వారా భారత్‌కు తీసుకొచ్చేందుకు చర్యలు తీసుకుంటామని భారత అధికారులు వెల్లడించారు. పరిస్థితిని ఎప్పటికప్పుడు సమీక్షించడం జరుగుతోందని తెలిపారు. 
Read Also: సమ్మర్ కూల్ ఎలా : తెలంగాణలో బీర్లు బంద్

భారత్‌, పాకిస్తాన్‌‌ల మధ్య స్నేహ బంధం మెరుగుపర్చడానికి రైలును ప్రారంభించారు. ఢిల్లీ- లాహోర్‌ల మధ్య వారానికి రెండు రోజులు నడుస్తుంది. లాహోర్‌ నుంచి అతారి వరకూ ప్రయాణం సాగనుంది. ప్రస్తుతం నెలకొన్న పరిస్థితుల నేపథ్యంలో భధ్రతా చర్యలో భాగంగా ఈ నిర్ణయం తీసుకున్నట్లు పాక్ పేర్కొంటోంది. ఉగ్రవాదులను ఏరివేసేందుకు భారతదేశం తీసుకుంటున్న చర్యలకు అంతర్జాతీయంగా మద్దతు అనూహ్యంగా పెరుగుతోంది. ఫలితంగా పాక్‌పై తీవ్రమైన వత్తడి పెరుగుతోంది. సంఝౌతా ఎక్స్ ప్రెస్ ఎన్ని రోజులు నిలిపివేస్తారో చూడాలి. 
Read Also : అభినందన్ ప్రొఫైల్ : హైదరాబాద్ లోనే ట్రైనింగ్