Sana Ramchand : పాకిస్తాన్‌ అడ్మినిస్ట్రేటివ్‌ సర్వీస్ కు ఎంపికైన తొలి హిందూ మహిళ సనా రామ్‌చంద్‌ గుల్వానీ

పాకిస్థాన్ లో ఓ హిందూ మహిళ సరికొత్త చరిత్ర క్రియేట్ చేసింది. పాకిస్తాన్‌ దేశ అత్యున్నత పబ్లిక్‌ సర్వీస్‌ పరీక్షలో ఉత్తీర్ణత సాధించిన తొలి హిందూ మహిళగా సనా రామ్‌చంద్‌ చరిత్ర.

Sana Ramchand : పాకిస్తాన్‌ అడ్మినిస్ట్రేటివ్‌ సర్వీస్ కు ఎంపికైన తొలి హిందూ మహిళ సనా రామ్‌చంద్‌ గుల్వానీ

Sana Became The First Hindu Woman In The Pakistan Administrative Service

Sana Ramchand Gulwani : పాకిస్థాన్ అంటే ఇస్లామిక్ దేశం. అటువంటి దేశంలో ఓ హిందూ మహిళ సరికొత్త చరిత్ర క్రియేట్ చేసింది. పాకిస్తాన్‌ దేశ అత్యున్నత పబ్లిక్‌ సర్వీస్‌ పరీక్షలో ఉత్తీర్ణత సాధించిన తొలి హిందూ మహిళగా సనా రామ్‌చంద్‌ గుల్వానీ చరిత్ర సృష్టించారు. తొలి ప్రయత్నంలోనే సనా ఈ ఘటన సాధించటం విశేషం. ఈ పరీక్షలో పాస్ అవ్వాలంటే చాలా కష్టపడాలి. చాలా కష్టమైన పరిక్ష ఇది. అటువంటిది తొలి ప్రయత్నంలోనే సనా పాస్ అయి అందరి ప్రశంసలను అందుకున్నారు హిందూ మహిళ సనా. పరీక్షకు మొత్తం 18,553 మంది అభ్యర్థులు హాజరయ్యారు. అందులో 221 మంది ఉత్తీర్ణులయ్యారు.

Read more : చరిత్ర సృష్టించిన భారత మహిళా పైలెట్లు..17 గంటలు నాన్‌స్టాప్‌గా విమానాన్ని నడిపి రికార్డు క్రియేట్

పాకిస్తాన్‌ అడ్మినిస్ట్రేటివ్‌ సర్వీస్‌లోని సింధు గ్రామీణ్‌లో చోటు సంపాదించి సెంట్రల్‌ సూపిరియర్‌ సర్వీస్‌లో సనా స్థానం కైవసం చేసుకుంది. ఈ పరీక్ష భారత్‌లోని సివిల్స్‌ పరీక్ష మాదిరి అత్యంత క్లిష్టమైన పరీక్ష. సనా.. షహీద్ మొహతర్మ బెనజీర్ భుట్టో మెడికల్ యూనివర్సిటీ నుండి 2016లో ఎంబీబీఎస్‌ పూర్తి చేశారు. ఆ తర్వాత యూరాలజిస్ట్‌గా చదువును కొనసాగించారు. తదనంతరం ఫెడరల్‌ సర్వీస్‌ కమిషన్‌లో చేరారు.

కాగా పాకిస్థాన్లో మొత్తం ముస్లి జనాభాయే ఉంటుంది. అతి తక్కువమంది మాత్రమే హిందువులు ఉంటారు. పాక్ లో ఇప్పటి వరకు హిందువులు ఎవ్వరూ ఉన్నతస్థాయి పదవులకు చేరుకోలేదు. కానీ ఆ చరిత్రను హిందూ మహిళ సనా తిరగరాశారనే చెప్పాలి. తొలిసారిగా పాకిస్తాన్ పాకిస్తాన్ అడ్మినిస్ట్రేటివ్ సర్వీస్ పాస్ కావటమే కాకుండా అసిస్టెంట్ కమిషనర్ గా స్థానం సంపాదించింది.

Read more : Supreme Court : చరిత్ర సృష్టించిన ముగ్గురు మ‌హిళా జ‌డ్జిల గురించి తెలుసుకోండి

సనా సింధ్ ప్రావిన్స్ లోని షికార్పూర్ జిల్లాలో నివసిస్తున్నారు. సింధ్ ప్రావిన్స్ లోని చంద్కా మెడికల్ కాలేజీ నుండి ఎంబీబీఎస్ పూర్తి చేశారు. ప్రస్తుతం ఆమె సింధ్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ యూరాలజీ నుంచి ఎఫ్‌సిపిఎస్ చదువుతున్నారు. ఆమె త్వరలో సర్జన్ కానున్నారు. ఆమె సాధించిన ఈ ఘనతతో పాకిస్తాన్ లోని హిందువులు వేడుకలు చేసుకున్నారు.

కాగా సనా..సింధ్‌లో ప్రభుత్వ ఆస్పత్రుల పరిస్థితి..అక్కడ రోగుల పరిస్థితి చూసి చలించిపోయారు. దాంతో..సీఎస్ఎస్ రాయాలని నిర్ణయించుకున్నారు. అనుకున్నది సాధించటానికి ఆమె తన మొబైల్‌లో అన్ని సోషల్ మీడియా యాప్స్ తీసేశాననీ..అన్ని సామాజిక సంబంధాలకు దూరంగా ఉన్నానని గత 8 నెలలు పరీక్ష్ పాస్ అవ్వాలనే లక్ష్యంతో మరో ధ్యాస లేకుండా సీఎస్ఎస్ కోసం ప్రిపేర్ అయ్యానని అలా విజయం సాధించానని తెలిపింది.

Read more : Zara Rutherford:లోకాన్నిచుట్టేస్తా..19 ఏళ్ల అమ్మాయి విమానంలో ఒంటరిగా ప్రపంచయాత్ర

అలాగే నేను సర్జన్ అవ్వాలని, యూరాలజిస్ట్ కావాలని నేను నిర్ణయించుకున్నాను. ఈ డిపార్ట్ మెంట్ లో చాలా తక్కువమంది మహిళలు పని చేస్తున్నారు. చాండ్కా ఆస్పత్ర తో పాటు మరికొన్ని ప్రభుత్వ ఆస్పత్రులు..అక్కడ రోగుల పరిస్థితి చూసిన తరువాత నా మనసు కలత చెందింది. రోగుల పట్ల అస్సలు శ్రద్ధ లేదు. వనరులూ కూడా లేవు. ఇక్కడ పని చేయడం చాలా కష్టం. ఎందుకంటే డాక్టర్లకు ఉండే పరిధి చాలా తక్కువ.

అదే బ్యూరోకసీలో ఉంటే మార్పు తీసుకురావచ్చని అనిపించింది. ఒక డాక్టర్‌గా నేను రోగులకు చికిత్స మాత్రమే చేయగలను. ఎందుకంటే డాక్టర్లకు ఉన్న పరిధి తక్కువ. ఆ పరిధికి లోబడే పనిచేయాలి. అది కూడా అందుబాటులో ఉన్న వనరులతోనే పనిచేయాలి. అదే బ్యూరోక్రసీలో ఉంటే వ్యవస్థలో మార్పులు తీసుకురావొచ్చు. సమస్యలను పరిష్కరించే అవకాశం ఉంటుంది. ఈ ఆలోచనే నన్ను ఈ దిశగా నడిపించింది అని తెలిపారు.సనాకు 2019లో ఈ ఆలోచన వచ్చింది. అప్పటి నుంచీ శ్రద్ధగా చదివి 2020లో సీఎస్ఎస్ పరీక్ష రాశారు.