షోయబ్ మాలిక్ 10వేల పరుగులు: సానియా హార్ట్ ఫెల్ట్ మెసేజ్

షోయబ్ మాలిక్ 10వేల పరుగులు: సానియా హార్ట్ ఫెల్ట్ మెసేజ్

పాకిస్తాన్ బ్రిలియంట్ బ్యాట్స్‌మన్ Shoaib Malik శనివారం అరుదైన ఘనత సాధించారు. టీ20 క్రికెట్లో 10వేల పరుగులు చేసిన తొలి ఆసియా క్రికెటర్ గా నిలిచారు. పాకిస్తాన్ లో జరుగుతున్న నేషనల్ టీ20 కప్‌లో భాగంగా ఈ ఫీట్ సాధించాడు. ప్రపంచవ్యాప్తంగా ఈ రికార్డు సాధించిన మూడో ప్లేయర్ గా Shoaib Malik నిలిచాడు. అతడికంటే ముందుగా క్రిస్ గేల్, కీరన్ పొలార్డ్ ఈ జాబితాలో ఉన్నారు.

ఖైబర్ పక్తున్ఖ్వా జట్టు కోసం ఆడుతున్న ఆయన 44బంతుల్లో 74 పరుగులు చేయగలిగాడు. బలూచిస్తాన్ జట్టుతో ఆడుతుండగా ఈ ఫీట్ సాధించాడు. ఈ మైలురాయిని సాధించిన షోయబ్ దీనిని పేరెంట్స్ కు డెడికేట్ చేస్తున్నట్లు ప్రకటించాడు. దీని గురించి ట్విట్టర్ వేదికగా తన సంతోషాన్ని తెలియజేశాడు.



‘పాకిస్తాన్ ప్రజలకు కంగ్రాట్స్ తెలుపుతున్నాను. ఆసియాలో 10వేల పరుగులు సాధించిన తొలి ప్లేయర్ గా నిలిచాను. ఇదే తరహాలో ఆడాలనుకుంటున్నా. ఈ మైలు రాయిని నా కుటుంబ సభ్యులకు అంకితం ఇవ్వాలనుకుంటున్నా. ఈ రోజున నా తండ్రి బతికి ఉంటే మరింత హ్యాపీగా ఫీలయ్యేవారు. గ్రౌండ్ కు వెళ్లే ప్రతీసారి నేను మా అమ్మకు ఫోన్ చేసి ఆశీర్వాదం తీసుకుంటాను’ అని షోయబ్ అన్నారు.

ఇదే విషయాన్ని ప్రస్తావిస్తూ.. Shoaib Malik భార్య టెన్నిస్ స్టార్ ప్లేయర్ Sania Mirza గుండెను కదిలించేలా భావోద్వేగకర పోస్టును పెట్టారు. ‘సుదీర్ఘ ప్రయాణం, సహనం, త్యాగం, నమ్మకం కలిస్తే షోయబ్ మాలిక్. చాలా గర్వంగా అనిపిస్తుంది’ అని పోస్టు చేశారు.

14ఏళ్లుగా పాకిస్తాన్ క్రికెట్ లో రాణిస్తున్నారు Shoaib Malik. 395టీ20 మ్యాచ్ లలో 10వేల 27పరుగులు సాధించారు. 37.41యావరేజ్‌తో 125.71 గ్రేట్ స్ట్రైక్ రేట్ రాణిస్తున్నాడు. టెన్నిస్ స్టార్ సానియా మీర్జాను 2008లో పెళ్లి చేసుకున్నాడు.