Saudi Arabia Visa Rules: భారతీయులకు సౌదీ అరేబియా ప్రభుత్వం గుడ్‌న్యూస్.. వీసాకోసం పోలీస్ క్లియరెన్స్ సర్టిఫికేట్ అవసరం లేదు..

న్యూ ఢిల్లీలోని సౌదీ రాయబార కార్యాలయం ట్విట్టర్‌లో ఇలా రాసింది.. "సౌదీ అరేబియా, భారతదేశం మధ్య బలమైన సంబంధాలు, వ్యూహాత్మక భాగస్వామ్యాన్ని దృష్టిలో ఉంచుకుని, పోలీసు క్లియరెన్స్ సర్టిఫికేట్ సమర్పించకుండా భారతీయ పౌరులను మినహాయించాలని సౌదీ అరేబియా ప్రభుత్వం నిర్ణయించిందని తెలిపింది. సౌదీ ప్రభుత్వం నిర్ణయంతో వీసా అప్లికేషన్ ప్రక్రియ వేగవంతంకానుంది.

Saudi Arabia Visa Rules: భారతీయులకు సౌదీ అరేబియా ప్రభుత్వం గుడ్‌న్యూస్.. వీసాకోసం పోలీస్ క్లియరెన్స్ సర్టిఫికేట్ అవసరం లేదు..

Saudi Arabia Visa Rules:

Saudi Arabia Visa Rules: సౌదీ అరేబియా వెళ్లే భారతీయ పౌరులకు అక్కడి ప్రభుత్వం గుడ్‌న్యూస్ చెప్పింది. సౌదీ వెళ్లడానికి వీసా పొందేందుకు భారతీయులు పోలీస్ వెరిఫికేషన్ సర్టిఫికేట్ సమర్పించాల్సిన అవసరం లేదని తెలిపింది. ఈ మేరకు నవంబర్ 17న సౌదీ అరేబియా రాయబార కార్యాలయం ఈ ప్రకటన చేసింది. ఇరుదేశాల మధ్య సంబంధాలను మరింత బలోపేతం చేసే ప్రయత్నాల్లో భాగంగా ఈ నిర్ణయం తీసుకున్నట్లు రాయబార కార్యాలయం విడుదల చేసిన ప్రకటనలో పేర్కొంది. ఈ మేరకు సౌదీ రాయబార కార్యాలయం ట్వీట్ ద్వారా సమాచారం ఇచ్చింది.

Saudi Arabia

Saudi Arabia

Saudi Arabia Aid To Ukraine : ఉక్రెయిన్‌కు సౌదీ అరేబియా 400 మిలియన్ల డాలర్ల ఆర్థిక సహాయం

సౌదీ అరేబియా, భారతదేశం మధ్య బలమైన సంబంధాలు, వ్యూహాత్మక భాగస్వామ్యాన్ని దృష్టిలో ఉంచుకుని, పోలీస్ వెరిఫికేషన్ సర్టిఫికేట్ (పీసీసీ) సమర్పించడం నుండి భారతీయ పౌరులకు మినహాయింపు ఇవ్వాలని నిర్ణయించిందని ట్వీట్‌లో పేర్కొంది. సౌదీ అరేబియాకు వెళ్లేందుకు భారతీయ పౌరులు పీసీసీ వీసా పొందాల్సిన అవసరం లేదని పేర్కొంది. సౌదీ అరేబియాలో శాంతియుతంగా నివసిస్తున్న రెండు మిలియన్లకు పైగా భారతీయ పౌరుల సహకారాన్ని అభినందిస్తున్నట్లు రాయబార కార్యాలయం తెలిపింది.

న్యూ ఢిల్లీలోని సౌదీ రాయబార కార్యాలయం ట్విట్టర్‌లో ఇలా రాసింది.. “సౌదీ అరేబియా, భారతదేశం మధ్య బలమైన సంబంధాలు, వ్యూహాత్మక భాగస్వామ్యాన్ని దృష్టిలో ఉంచుకుని, పోలీసు క్లియరెన్స్ సర్టిఫికేట్ సమర్పించకుండా భారతీయ పౌరులను మినహాయించాలని సౌదీ అరేబియా ప్రభుత్వం నిర్ణయించిందని తెలిపింది. సౌదీ ప్రభుత్వం నిర్ణయంతో వీసా అప్లికేషన్ ప్రక్రియ వేగవంతంకానుంది. అంతేకాక పర్యాటక సంస్థలకు పని సులభతరం కానుంది. ఆ మేరకు టూరిస్టులకు డాక్యుమెంట్ల భారం తగ్గనుంది. ప్రస్తుతం దాదాపు 20 లక్షల మంది భారతీయులు ప్రశాంతంగా సౌదీ అరేబియాలో జీవిస్తున్నారని ఆ దేశం తెలిపింది. వాస్తవానికి సౌదీ రాజు మహ్మద్ బీన్ సాల్మన్ ఈ నెల భారత్ లో పర్యటించాల్సి ఉంది. ప్రధాని మోదీతో భేటీ కావాల్సి ఉంది. అనివార్య కారణాల వల్ల పర్యటన రద్దయింది.