Saudi Arabia : అంతర్జాతీయ ప్రయాణికులపై సౌదీ ఆంక్షలు..ఆ దేశాల నుంచి వచ్చేవారిపై బ్యాన్

అలాగే లెబనాన్‌, సిరియా, టర్కీ, ఇరాన్, ఆఫ్ఘానిస్తాన్, లిబియా సహ పలు దేశాల ప్రయాణికులపై ఆంక్షలు విధించింది. ఓ వైపు ప్రపంచ వ్యాప్తంగా మంకీ పాక్స్ కేసులు పెరుగుతున్నాయి.

Saudi Arabia : అంతర్జాతీయ ప్రయాణికులపై సౌదీ ఆంక్షలు..ఆ దేశాల నుంచి వచ్చేవారిపై బ్యాన్

Saudi Arabia

Saudi Arabia : ప్రపంచ వ్యాప్తంగా కోవిడ్ కేసులు పెరగడం ఆందోళన కలిగిస్తోంది. దీంతో పలు దేశాలు అప్రమత్తమయ్యాయి. ముందస్తు చర్యలు తీసుకుంటున్నాయి. కోవిడ్‌ విజృభించకుండా సౌదీ అరేబియా కీలక నిర్ణయం తీసుకుంది. 16 దేశాల నుంచి వచ్చే ప్రయాణికులపై తాత్కాలిక బ్యాన్ విధించింది. ఇందులో భారత్‌ కూడా ఉంది.

అలాగే లెబనాన్‌, సిరియా, టర్కీ, ఇరాన్, ఆఫ్ఘానిస్తాన్, లిబియా సహ పలు దేశాల ప్రయాణికులపై ఆంక్షలు విధించింది. ఓ వైపు ప్రపంచ వ్యాప్తంగా మంకీ పాక్స్ కేసులు పెరుగుతున్నాయి. ఇక కోవిడ్‌ మరోసారి విజృంభిస్తోంది. దీంతో జీరో కేసుల దిశగా తీసుకున్న చర్యల్లో భాగంగా ఆంక్షలు విధిస్తున్నట్టు సౌదీ అరేబియా తెలిపింది.

Tablighi Jamaat : తబ్లిగీ జమాత్ పై సౌదీ అరేబియా నిషేధం

ప్రస్తుతం మంకీపాక్స్ వ్యాప్తి తక్కువ ఉన్నా…భవిష్యత్‌లో మరింత పెరిగే అవకాశం ఉందని సౌదీ అరేబియా ఆరోగ్య మంత్రి అబ్దుల్లా అసిరి అంటున్నారు. దీంతో ముందస్తు జాగ్రత్తగా మంకీ పాక్స్‌, కోవిడ్ కేసులు అధికంగా ఉన్న దేశాల నుంచి ప్రయాణాలపై బ్యాన్ విధించినట్టు తెలిపారు.