Saudi Woman: ట్విట్టర్ వాడినందుకు సౌదీలో మహిళకు 34 ఏళ్ల జైలు శిక్ష

ట్విట్టర్ ద్వారా మహిళల హక్కుల గురించి గళమెత్తినందుకు ఒక 34 ఏళ్ల మహిళకు 34 ఏళ్ల జైలు శిక్ష విధించింది సౌదీ అరేబియా. దీనిపై అంతర్జాతీయ సమాజం ఆగ్రహం వ్యక్తం చేస్తోంది. తాజా తీర్పుపై మహిళ పైకోర్టులో అప్పీలుకు వెళ్లే ఛాన్స్ ఉంది.

Saudi Woman: ట్విట్టర్ వాడినందుకు 34 ఏళ్ల మహిళకు, 34 ఏళ్ల జైలు శిక్ష విధించింది సౌదీ అరేబియా కోర్టు. సల్మా అల్ షెహాబ్ అనే మహిళ బ్రిటన్‌లోని యూనివర్సిటీ ఆఫ్ లీడ్స్‌లో పీహెచ్‌డీ చేస్తూ, అక్కడే పనిచేస్తోంది. అయితే, బ్రిటన్‌లో తనకు ట్విట్టర్ అకౌంట్ ఉంది. ఆ అకౌంట్ ద్వారా మహిళల హక్కులకు అనుకూలంగా పలు ట్వీట్లు చేసింది.

Tejaswi Madivada : ఇండస్ట్రీలో నన్ను ఎవరూ కమిట్‌మెంట్‌ అడగలేదు.. నేను పెళ్లి చేసుకోను..

అలాగే ఇతర ఉద్యమకారులు, ఉద్యమ సంస్థలు చేసే ట్వీట్లను రీట్వీట్ చేసింది. దీనిపై సౌదీ అరేబియా ప్రభుత్వం ఆగ్రహం వ్యక్తం చేసింది. దీంతో ఆమెపై స్థానిక తీవ్రవాద కోర్టులో విచారణ జరిపారు. ఆమెకు 34 ఏళ్ల జైలు శిక్ష విధించారు. దేశాన్ని అస్థిర పరిచేందుకు, ప్రజా జీవితానికి భంగం కలిగించేందుకు సల్మా ప్రయత్నించిందని, దేశ భద్రతకు భంగం కలిగించిందని, ట్విట్టర్ ద్వారా అసత్యాల్ని ప్రచారం చేసిందని కోర్టు ఆమెపై అభియోగాలు మోపింది. ఈ నేరాలకుగాను, సల్మాకు 34 ఏళ్ల జైలు శిక్ష విధించింది. గత ఏడాది చివరలో ఆరు సంవత్సరాల జైలు శిక్ష మాత్రమే విధించారు. అయితే, తాజాగా ఈ శిక్షను 34 సంవత్సరాలకు పెంచుతూ నిర్ణయం తీసుకున్నారు.

Ashwini Dutt : చిరంజీవే నాకు టీడీపీ ఎంపీ సీట్ ఇప్పించారు.. నేను కమ్యూనిస్ట్ ని కానీ..

షెహాబ్ కొంతకాలంగా మహిళల హక్కుల కోసం ఉద్యమిస్తోంది. ఆమె సోదరి కూడా ఉద్యమకర్త. ఆమె కూడా దాదాపు వెయ్యి రోజులకుపైగా జైలు శిక్ష అనుభవించింది. తాజా తీర్పుపై అప్పీల్‌కు వెళ్లేందుకు సల్మాకు నెల రోజుల గడువుంది. సల్మాకు భర్త, ఇద్దరు పిల్లలు ఉన్నారు. సౌదీలో శిక్షలు అత్యంత కఠినంగా ఉంటాయనేందుకు తాజా సంఘటన మరో ఉదాహరణ.

 

ట్రెండింగ్ వార్తలు