US Passes Same Sex Marriage Bill : స్వలింగ వివాహాల బిల్లుకు అమెరికా సెనేట్ ఆమోదం..

అమెరికా సెనేట్ అత్యంత చరిత్రాత్మక బిల్లుకు ఆమోదం తెలిపింది. అదే స్వలింగ వివాహ బిల్లు. ఈ బిల్లు ఆమోదానికి 50 మంది డెమోక్రాట్ లతోపాటు 11 మంది రిపబ్లికన్లు కూడా ఓటు వేయడం గమనించాల్సిన విషయం.

US Passes Same Sex Marriage Bill : స్వలింగ వివాహాల బిల్లుకు అమెరికా సెనేట్ ఆమోదం..

US Senate passes  same sex marriage bill

US Senate passes  same sex marriage bill : అమెరికా సెనేట్ అత్యంత చరిత్రాత్మక బిల్లుకు ఆమోదం తెలిపింది. అదే స్వలింగ వివాహ బిల్లు. ఈ బిల్లు ఆమోదానికి 50 మంది డెమోక్రాట్ లతోపాటు 11 మంది రిపబ్లికన్లు కూడా ఓటు వేయడం గమనించాల్సిన విషయం. ‘‘వివాహ చట్టాన్ని గౌరవిస్తూ సెనేట్ లోని ద్విపార్టీ సభ్యులు నేడు ఆమోదించడం అన్నది.. ప్రేమ అంటే ప్రేమే అన్న ప్రాథమిక సత్యాన్ని యునైటెడ్ స్టేట్స్ పునరుద్ఘాటించే అంచున ఉంది’’అంటూ అధ్యక్షుడు జోబైడెన్ ప్రకటించారు.

సెనేట్ ఆమోదం పొందిన ఈ బిల్లును ప్రతినిధుల సభకు పంపిస్తారు. అక్కడ ఆమోదం తర్వాత అమెరికా అధ్యక్షుడి సంతకం చేయాల్సి ఉంటుంది. అధ్యక్షుడి ఆమోదంతో ఈ బిల్లు చట్టంగా మారుతుంది. అమెరికాలో ఒకే లింగానికి (స్వలింగ) చెందిన వారు వివాహం చేసుకుంటే ప్రస్తుతం రక్షణ ఉంది. వీరికి 2015 నుంచి సుప్రీంకోర్టు స్వలింగ వివాహాలకు రక్షణ కల్పిస్తోంది.

గర్భ విచ్ఛిత్తి హక్కును 2022 జూన్ లో సుప్రీంకోర్టు కొట్టివేసింది. దీంతో తమ విషయంలోనూ అదే పరిస్థితి రావచ్చన్న ఆందోళన చెందారు అమెరికా స్వలింగ సంపర్కులు. దీంతో డెమోక్రాట్లు ఆగమేఘాల మీద ఈ బిల్లుకు మార్గం చూపించారు. రెండు వేర్వేరు జెండర్ల మధ్య వివాహానికి కూడా ఈ చట్టం కింద ఆమోదం లభిస్తుంది.

 

 

,