జులై 29 నుంచి హజ్ యాత్ర.. భారీగా తగ్గిపోయిన యాత్రికులు

జులై 29 నుంచి హజ్ యాత్ర.. భారీగా తగ్గిపోయిన యాత్రికులు

ఈ ఏడాది హజ్ యాత్రకు వెళ్లే యాత్రికులు భారీగా తగ్గిపోయారు. ఎంతంటే కేవలం 1000మంది మాత్రమే అక్కడికి వెళ్లేందుకు సిద్ధమయ్యారట. కరోనావైరస్ మహమ్మారి ప్రభావానికి భయాందోళనలు పెరిగిపోవడమే దీనికి కారణమంటున్నారు సౌదీ అధికారులు. జులై 29నుంచి మొదలుకానున్న యాత్రలో 2.5 బిలియన్ మంది పాల్గొనేవారు. కొద్ది రోజుల పాటు జరిగే ఈ యాత్ర పవిత్ర మక్కా నగరం నడిబొడ్డున ఉండే మక్కా మసీదు వరకూ జరుగుతుంది.

తీర్థయాత్రికులంతా మౌంట్ అరాఫత్ చేరుకుని హజ్ సంప్రదాలను పూర్తి చేసుకుంటారని సౌదీ ప్రెస్ ఏజెన్సీ చెప్తుంది. ఈ వార్షిక కార్యక్రమానికి బుధవారమే తొలి రోజు. ఇస్లామిక్ ల్యూనార్ క్యాలెండర్ ప్రకారం.. హజ్ చంద్రుని స్థానం బట్టే మొదలవుతుంది. గత నెలలోనే ప్రకటించినప్పటికీ చాలా తక్కువ సంఖ్యలో హజ్ యాత్రలో పాల్గొనాలని నిర్ణయించారు.

కరోనావైరస్ కారణంగా ఎక్కువ మంది వెళ్లకూడదని భావించారు. 2లక్షల 50వేలకు మించిన కేసులతో కరోనా మృత్యు భయం పుట్టిస్తోంది. హజ్, ఉమ్రా తీర్థయాత్ర ప్రపంచవ్యాప్తంగా మిలియన్ల కొద్దీ ముస్లింలను ఆకర్షిస్తుంది. సంవత్సరానికి ఆ దేశానికి 12బిలియన్ డాలర్ల ఆదాయం వస్తుంది.

హజ్ అధికారులు 1000మందికే పరిమితం అి చెప్తున్నా.. 10వేల మంది వరకూ అవకాశం ఉండొచ్చని ప్రెస్ రిపోర్టులు చెబుతున్నాయి. ఈ ఆచారం నుంచి మెడికల్ ప్రొఫెషనల్స్, సెక్యూరిటీ పర్సనల్స్, వైరస్ నుంచి కోలుకున్నవారిని నిషేదించామని హజ్ మినిస్ట్రీ చెప్పింది. సౌదీ అరేబియా బయటి ప్రాంతం నుంచి వచ్చేవారిని నిరాకరించడం చరిత్రలోనే ఇది తొలిసారి.