కేక్‌లో వెన్నకు బదులు పురుగుల లార్వా..ట్రై చేస్తారా

  • Published By: madhu ,Published On : March 1, 2020 / 01:52 PM IST
కేక్‌లో వెన్నకు బదులు పురుగుల లార్వా..ట్రై చేస్తారా

అబ్బే..ఏంటీ అది..వెన్నకు బదులు పురుగుల లార్వానా ? ..ఇంకా దీనిని ట్రై చేయాలా ? వింటేనే వాంతికి వచ్చేటట్టు ఉంది అంటారు..కదా..కానీ బెల్జియం శాస్త్రవేత్తలు పరిశోధనలు సాగించి…ఈ విధంగా తయారు చేశారు. Waffeles, Cakes, Cookiesలలో వెన్నను ఉపయోగిచకుండా..కీటకాల లార్వా ద్వారా వచ్చిన కొవ్వుతో ప్రయోగాలు చేస్తున్నారు. 

ఘెంట్ యూనివర్సిటీ శాస్త్రవేత్తలు కుకీలలో ఉన్న వెన్నస్థానంలో లార్వా కొవ్వుతో ప్రయోగాలు చేస్తున్నారు. పాల ఉత్పత్తుల కంటే..కీటకాల నుంచి వచ్చిన Grease లా స్థిరమైందిగా వ్యాఖ్యానించారు. 
కీటకాలను ఓ బౌల్‌లో వేసి..ఓవెన్‌లో ఉంచుతున్నారు. వీటి నుంచి వెలువడిన..కొవ్వును కేక్‌లలో వాడుతున్నారు. దీనిని తిన్న వారు కూడా తేడాను గుర్తించలేకపోతున్నట్లు తెలుస్తోంది. ఈ పరిశోధనల మూలంగా..అనేక సానుకూల విషయాలను గుర్తించడం జరిగిందని పరిశోధనలను పర్యవేక్షించే డేలాన్ అన్నారు.

Read More : కోవిడ్ – 19 (కరోనా) వైరస్..అప్ డేట్

వెన్నను ఉత్పత్తి చేయడానికి తక్కవు నీటిని ఉపయోగించడం జరుగుతుందన్నారు. కీటకాల కొవ్వులో ప్రోటీన్, విటమిన్లు, ఫైబర్, ఖనిజాలు అధికంగా ఉన్నాయంటున్నారు. దీనికి సంబంధించిన వీడియో ట్విట్టర్ వేదికగా విడుదల చేశారు.