Brain Tumors Detect : మూత్ర పరీక్ష ద్వారా మెదడులో కణితులు గుర్తింపు

ఒకప్పుడు మెదడులో ఏర్పడిన కణితులను గుర్తించాలంటే చాలా క్లిష్టమైన వైద్య పరీక్షలు చేయాల్సి వచ్చేది. ఇప్పుడు మెదడులో కణితులను చాలా సులభంగా తెలుసుకోవచ్చు.

Brain Tumors Detect : మూత్ర పరీక్ష ద్వారా మెదడులో కణితులు గుర్తింపు

brain tumors

Brain Tumors Detect : ఒకప్పుడు మెదడులో ఏర్పడిన కణితులను గుర్తించాలంటే చాలా క్లిష్టమైన వైద్య పరీక్షలు చేయాల్సి వచ్చేది. ఇప్పుడు మెదడులో కణితులను చాలా సులభంగా తెలుసుకోవచ్చు. కేవలం మూత్ర పరీక్ష చేయడం ద్వారా మెదడులో ఏర్పడిన కణితులను గుర్తించవచ్చని శాస్త్రవేత్తలు పేర్కొన్నారు.

MP: బ్రెయిన్ ట్యూమర్ సర్జరీ చేస్తూ..రోగి పుర్రె ప‌గుల‌గొట్టిన డాక్టర్లు..

తద్వారా క్యాన్సర్ ను ప్రారంభ దశలోనే గుర్తించడం వల్ల చికిత్స సులభమవుతుందని తెలిపారు. అంతేకాకుండా వ్యాధి నుంచి రోగి త్వరగా కోలుకుంటాడని శాస్త్రవేత్తలు వెల్లడించారు. గతంలో ఈ రకమైన కణితులను గుర్తించాలంటే చాలా క్లిష్టమైన పరీక్షలు జరపాల్సి వచ్చేదని, కానీ ఇప్పుడు చిటికెలో తెలుసుకోవచ్చని పేర్కొన్నారు.