Chewing Gum: కరోనాను నోట్లోనే కట్టడి చేసే చూయింగ్ గమ్..! క్లినికల్ ట్రయల్స్‌కు సైంటిస్టులు రెడీ

కొత్త ప్రయోగాత్మక చూయింగ్ గమ్‌ని అభివృద్ధి చేస్తున్నారు పెన్సిల్వేనియా వర్సిటీ శాస్త్రజ్ఞులు.

Chewing Gum: కరోనాను నోట్లోనే కట్టడి చేసే చూయింగ్ గమ్..! క్లినికల్ ట్రయల్స్‌కు సైంటిస్టులు రెడీ

Chewing Gum

Chewing Gum: కరోనా ట్రాన్స్ మిషన్ ను కట్టడి చేసేలా కొత్త ప్రయోగాత్మక చూయింగ్ గమ్‌ని అభివృద్ధి చేస్తున్నారు పెన్సిల్వేనియా వర్సిటీ శాస్త్రజ్ఞులు. కరోనావైరస్ ప్రభావాన్ని తగ్గించే చూయింగ్ గమ్‌ను మొక్కల నుంచి అభివృద్ధి చేస్తున్నట్టు పరిశోధకుల బృందం వెల్లడించింది.

మాలిక్యులర్ థెరపీ జర్నల్‌లో ప్రచురించబడిన ఒక అధ్యయనంలో, కరోనావైరస్ కణాలను బంధించే ప్రోటీన్‌ను కలిగిన చూయింగ్ గమ్ ద్వారా లాలాజలంలో వైరస్ మొత్తాన్ని పరిమితం చేసేలా చేయవచ్చని చెబుతున్నారు. కోవిడ్ ప్రసారాన్ని అరికట్టడంలో ఈ చూయింగ్ గమ్ సహాయపడుతుందని అంటున్నారు.

క్లినికల్ ట్రయల్స్ సక్సెస్ అయితే..!

కరోనా సోకినవారి లాలాజలంలో ఉండే వైరల్‌ లోడ్‌ను తగ్గించే ఏసీఈ2 (యాంజియోటెన్సిన్‌ కన్వర్టింగ్‌ ఎంజైమ్‌ 2) పొట్రీన్‌తో ఈ చూయింగ్ గమ్ తయారుచేస్తున్నారు. దీనిపై క్లినికల్‌ ట్రయల్స్‌ నిర్వహించడానికి అనుమతుల కోసం శాస్త్రవేత్తల టీమ్ కృషి చేస్తోంది. క్లినికల్‌ ట్రయల్స్‌ కూడా విజయవంతమైతే ఈ చూయింగ్‌ గమ్స్‌ అందుబాటులోకి వస్తాయి.

SARS-CoV-2 సోకిన వ్యక్తుల లాలాజలంలో అధిక స్థాయిలో వైరస్ ఉన్నట్లు ఆధారాలు ఇప్పటికే ఉన్నాయి. కాబట్టి, US పరిశోధకులు ప్రత్యేకంగా రూపొందించిన చూయింగ్ గమ్ వారి నోటిలోని వైరస్ మొత్తాన్ని తగ్గించగలదని పరిశోధకులు చెబుతున్నారు.

Bike e-Challan : చలనాలు కట్టే బదులు కొత్త బండి కొనుక్కోవచ్చని బైక్ వదిలి పరార్

SARS-CoV-2 మన శరీరంలోని కొన్ని కణాల ఉపరితలాలపై కనిపించే ACE2 ప్రొటీన్‌లను తాకడం ద్వారా మానవ కణాలలోకి ప్రవేశిస్తుంది. అందువల్ల, పరిశోధకులు ACE2 ప్రోటీన్ కాపీని కలిగి ఉన్న చూయింగ్ గమ్‌ను సృష్టించారు. టెస్ట్-ట్యూబ్ ప్రయోగాలలో, పరిశోధకులు COVID-19 ఉన్న రోగుల నుండి లాలాజల నమూనాలను తీసుకున్నారు.

India Tour Of South Africa: ఒమిక్రాన్ ప్రభావం టీ20 సిరీస్ వాయిదా.. సౌతాఫ్రికా షెడ్యూల్‌ ఇదే!

ఈ నమూనాలను చూయింగ్ గమ్‌తో కలిపారు. చూయింగ్ గమ్‌లో ఉన్న ACE2 “గ్రాహకాలు”తో వైరస్ కణాలు అటాచ్ అయినట్లు వారు కనుగొన్నారు. పెన్సిల్వేనియా విశ్వవిద్యాలయం నుంచి పరిశోధకుల ప్రకారం.. 5mg చూయింగ్ గమ్ కణాలలోకి వైరల్ ప్రవేశాన్ని గణనీయంగా తగ్గిస్తుంది. 50mg గమ్ వైరల్ ప్రవేశాన్ని 95% తగ్గించింది. దీంతో ప్రయోగాలు సక్సెస్ అయినట్లుగా వారు చెబుతున్నారు.