Chewing Gum : చూయింగ్ గమ్‌తో కరోనా వ్యాప్తికి చెక్..!

చూయింగ్ గమ్ తో కరోనా వ్యాప్తికి చెక్ పెట్టొచ్చా? అంటే.. అవుననే అంటున్నారు సైంటిస్టులు. కరోనా సోకిన వ్యక్తుల లాలాజలంలో అధిక స్థాయిలో వైరస్ ఉంటుందని అధ్యయనాలు చెబుతున్నాయి. అందువల్ల

Chewing Gum : చూయింగ్ గమ్‌తో కరోనా వ్యాప్తికి చెక్..!

Chewing Gum

Chewing Gum : చూయింగ్ గమ్ తో కరోనా వ్యాప్తికి చెక్ పెట్టొచ్చా? అంటే.. అవుననే అంటున్నారు సైంటిస్టులు. కరోనా సోకిన వ్యక్తుల లాలాజలంలో అధిక స్థాయిలో వైరస్ ఉంటుందని అధ్యయనాలు చెబుతున్నాయి. అందువల్ల అమెరికా పరిశోధకులు ప్రత్యేకంగా ఒక చూయింగ్ గమ్
రూపొందించారు. దీని సాయంతో నోటిలోని వైరస్ మొత్తాన్ని తగ్గించవచ్చని, వ్యాప్తిని అరికట్టవచ్చని అంటున్నారు.

సార్స్-కోవ్-2 లాలాజల గ్రంధుల్లో ఉంటుంది. ఇది సోకిన వారు తుమ్మినప్పుడు, దగ్గినప్పుడు లేదా మాట్లాడినప్పుడు ఆ వైరస్ ఇతరులకు చేరుకోవచ్చు. టీకా రెండు డోసులు తీసుకున్న వ్యక్తులు సైతం మరోసారి కరోనా బారిన పడుతున్న విషయాన్ని పరిశోధకులు గుర్తించారు. అంతేకాదు వ్యాక్సిన్ తీసుకోని వారు ఏ విధంగా వైరల్ లోడ్ ని వ్యాప్తి చేస్తారో, వ్యాక్సిన్ తీసుకున్న వారు కూడా అంతే స్థాయిలో వ్యాప్తి చేస్తారని చెప్పారు.

Liver : లివర్ ఆరోగ్యంగా ఉండేందుకు చిట్కాలు

నోటి ఆరోగ్యాన్ని కాపాడడంతో పాటు నోటికి వ్యాయామం అందించడంలో చూయింగ్ గమ్ ప్రత్యేక పాత్ర పోషిస్తుంది. హానికరమైన బ్యాక్టీరియా సంఖ్యను చూయింగ్ గమ్ నమలడం ద్వారా తగ్గించవచ్చని అధ్యయనాలు చెబుతున్నాయి. చూయింగ్ గమ్‌లోని ACE2 ప్రొటీన్లు నోటిలోని వైరస్ కణాలను ఆపగలవు. అవి మన కణాలకు సోకే అవకాశాన్ని తగ్గించగలవని నిరూపణ అయింది. మొక్కలలో ఉత్పత్తి అయిన అధిక స్థాయి ACE2 ప్రోటీన్‌లను కలిగి ఉన్న గమ్‌ను పరిశోధకులు తయారు చేశారు. ఇది ప్రారంభ-దశ పరిశోధన కావడంతో ఫలితాలను నిర్దారించలేకపోతున్నారు.

కణాలపై ACE2 గ్రాహకాన్ని నిరోధించడం ద్వారా లేదా స్పైక్ ప్రోటీన్‌తో నేరుగా బంధించడం ద్వారా గమ్ ఎక్కువగా వైరస్‌లు లేదా వైరల్ కణాలను కణాలలోకి ప్రవేశించకుండా నిరోధిస్తుందని శాస్త్రవేత్తలు గమనించారు. కాగా, దీనికి సంబంధించి క్లినికల్ ట్రయల్ నిర్వహించడానికి అనుమతి పొందే దిశగా ప్రయత్నాలు చేస్తున్నారు.

Body Ageing: ఇవి తింటున్నారా.. ముసలితనం ముందే రావడం ఖాయం

కాగా, ప్రపంచాన్ని వణికిస్తున్న ఒమిక్రాన్ వంటి వివిధ కోవిడ్ వేరియంట్‌లలో చూయింగ్ గమ్ ప్రభావవంతంగా పని చేస్తుందా? లేదా? అనేది తెలియాల్సి ఉంది. ఇకపోతే ఈ చూయింగ్ గమ్‌ పై మరింతగా పరిశోధనలు జరగాల్సి ఉందని శాస్త్రవేత్తలు తెలిపారు.